నమ్మకద్రోహుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది

మంత్రి అమర్‌నాథ్‌

విశాఖపట్నం: ఉండవల్లి శ్రీదేవికి నాలుగేళ్లుగా కనిపించని లోపాలు ఇప్పుడు ఎలా బయటికి వస్తున్నాయని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. ఆమె ఉండవల్లి శ్రీదేవి కాదు ఊసరవెల్లి శ్రీదేవి అని వ్యంగాస్త్రాలు సంధించారు. సినీనటి శ్రీదేవికి మించి నటించిందని దుయ్యబట్టారు.

ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేసే ముందు జగన్‌మోహన్‌రెడ్డి దగ్గరికి కూతురుని తీసుకెళ్లి ఫోటో దిగింది.. ఆయన అభిమాని అని నమ్మించి మోసం చేయాలని భావించిందని మండిపడ్డారు. ఆమె మరి కొద్ది రోజుల్లోనే చీకొట్టే స్థితికి చేరుకుంటుందని,  శ్రీదేవి లాంటి నమ్మకద్రోహుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.

Back to Top