దళితులను జాగృతి వైపు నడిపించిన ఘనత బాబు జగ్జీవన్ రామ్‌దే

  అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం : దళితులను చైతన్యవంతం చేసి జాగృతి వైపు నడిపించిన ఘనత బాబు జగ్జీవన్ రామ్‌దే అని  ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కొనియాడారు. గురువారం అనంతపురం జిల్లా కేంద్రంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డా.బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా డా.బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అతి చిన్న వయసులోనే స్వాతంత్ర సమరంలో పాల్గొని, స్వాతంత్ర్య పోరాటంలో నాయకత్వం వహించి సమ సమాజ స్థాపన కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, వారిలో చైతన్యం తెచ్చేందుకు అనేకమైన పోరాటాలు చేసిన పోరాటయోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు. డా.బిఆర్. అంబేద్కర్ రాజ్యాంగపరంగా దళితులకు, అణగారిన వర్గాలకు హక్కులు కల్పిస్తే అవి చట్టరూపంగా మార్చి అమలు పరచడంలో అనేక కష్టాలు ఎదుర్కొని, దళితులను చైతన్యవంతం చేసి జాగృతి వైపు నడిపించిన ఘనత బాబు జగ్జీవన్ రామ్ కు దక్కుతుందన్నారు. చిన్న వయస్సులోనే శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఎన్నో పదవులను చేపట్టి గొప్ప రాజకీయవేత్తగా ఎదిగాడన్నారు.  

రాష్ట్రంలో బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తన పాలనను సాగిస్తున్నారని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు చదువు వచ్చినప్పుడే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని భావించి ఉన్నత చదువులు ఎవరికి ఆర్థికభారం కాకుండా సీఎం వైయ‌స్ జగన్ విద్యకు పెద్దపీట వేస్తూ అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అదేవిధంగా పేదలకు మంచి వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ లో అనేలా మార్పులను తీసుకురావడమే కాకుండా కార్పొరేట్ కు దీటుగా ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాడని తెలిపారు. 

కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, రాష్ట్ర బిసి కమిషన్ మెంబర్ రిటైర్డ్ జడ్జి క్రిష్టప్ప, మేయర్ మహమ్మద్ వసీం సలీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్ మంజుల, నాటక అకాడమీ ఛైర్పర్సన్ హరిత, రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్  లిఖిత, బీసీ విభాగం జోనల్ ఇంఛార్జి బీసీ రమేష్, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు సైఫుల్లా  బేగ్, ఉమ్మడి మదన్ మోహన్ రెడ్డి, శ్రీదేవి,సీనియర్ నాయకులు ఎర్రిస్వామి రెడ్డి,పామిడి వీరాంజినేయులు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, ఎస్సి సెల్ అధ్యక్షుడు సాకే కుళ్ళాయి స్వామి, పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top