చంద్ర‌బాబు ప్రతీకార చ‌ర్య‌ల్లో భాగ‌మే మిధున్‌రెడ్డి అరెస్టు

ఎంపీ అక్ర‌మ అరెస్టును ఖండించిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

తాడేప‌ల్లి: లేని లిక్కర్ స్కాం పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ  కీలక నాయకులను అరెస్టు చేయిస్తున్నార‌ని, చంద్ర‌బాబు ప్ర‌తీకార చ‌ర్య‌ల్లో భాగంగానే ఎంపీ మిధున్‌రెడ్డిని అరెస్టు చేయించార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  నిజానికి చంద్రబాబు హయాంలో కంటే వైయ‌స్ జగన్ హయాంలోనే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువగా వచ్చింది. అయినప్పటికీ రూ.3 వేల కోట్లు పక్కదారి పట్టాయంటూ తప్పుడు కేసు నమోదు చేశారు.  టీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారయ్యే స్క్రిప్టునే ఛార్జిషీటు, రిమాండ్ రిపోర్టుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు.  ఎల్లోమీడియా తప్పుడు రాతలు, సిట్ తప్పుడు విచారణలపై  వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఫైర్ అవుతున్నారు. కోర్టుల్లోనే న్యాయపోరాటం చేస్తామని స్ప‌ష్టం చేశారు.

మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజాద్ బాష  కామెంట్స్‌

  • పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి అరెస్ట్‌ రాజకీయ కక్ష సాధింపు
  • పెద్దిరెడ్డి కుటుంబాన్ని, వైయ‌స్ఆర్‌సీపీని ఇబ్బంది పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లు....లేని లిక్కర్‌ స్కామ్‌ను సృష్టించి అరెస్ట్‌లు చేస్తున్నారు.
  • ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు.
  • ఇది ఇంకా కొనసాగితే ఏ మాత్రం సహించబోము.
  • ప్రభుత్వ తీరును కచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం - అంజాద్ భాష
  • అధికారం శాశ్వతం కాదు–అధికారులు శాశ్వతం...వచ్చేది వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వమే...
  • కూటమి ప్రభుత్వం లో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. 
  • కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
  • పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వైయ‌స్ఆర్‌సీపీ  పూర్తిగా అండగా ఉంటుందని అంజాద్ బాష అన్నారు.

అంతిమ విజయం ధర్మానిదే : ఎంపీ తనూజ రాణి   

  • ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నాం 
  • వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై కక్షపూరిత కేసులు పెడుతున్నారు 
  • మద్యం కేసు పేరుతో కట్టు కథలు చెబుతున్నారు 
  • వైయస్ జగన్ సన్నిహితుల పైన అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు 
  •  ఈ కేసులకు భయపడేది లేదు 
  • ధర్మ యుద్ధంలో మొదట అన్యాయమే  గెలిచినట్లు కనిపిస్తుంది 
  • ఈ కేసు నుంచి మిథున్ రెడ్డి క్లీన్ చిట్ తో బయటపడతారు

మాజీ ఎమ్మెల్యే బుర్రా మ‌ధుసూద‌న్‌రెడ్డి కామెంట్స్‌

  • ఎంపీ మిధున్‌రెడ్డి అక్ర‌మ అరెస్టును ఖండిస్తున్నాం
  • వైయ‌స్ జ‌గ‌న్‌కు అండగా ఉన్న వారిని అరెస్ట్ చేస్తున్నారు..
  • తప్పుడు కేసుల్లో ఇరికించి పార్టీని బలహీన పరచాలనుకుంటున్న బాబు కుట్రలు సాగవు...
  • ప్రజల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆదరణ ఏనాటికి తగ్గదు... 

జీడీ నెల్లూరు స‌మ‌న్వ‌య‌క‌ర్త కృపాల‌క్ష్మీ

  • ఎంపీ మిథున్ రెడ్డి అన్న అక్రమ అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్నాం, 
  • కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు పాల్పడుతోంది..  
  • ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారు. 
  • కూట‌మి ప్ర‌భుత్వానికి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయి
  •  
Back to Top