పోలవరం : దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పోలవరం ప్రాజెక్టును ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కళ్లార్పకుండా అసత్యాలు వల్లిస్తున్నారని మండిపడ్డారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, స్పిల్ ఛానల్, స్పిల్‌వేని పూర్తి చేయకుండా, నీళ్లు మళ్లించకుండా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించడం చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదమన్నా రు. నిర్మాణంలో జాప్యానికి చంద్రబాబు నిర్వాకాలే కారణమన్నారు. ఈ కారణంగానే 2019, 2020 వరదలకు డయాఫ్రమ్‌వాల్ దెబ్బతిందన్నారు. ప్రాజెక్టులు, వ్యవసాయంపై చిత్తశుద్ధి లేని చంద్రబాబు ఎన్నికల భయంతో పర్యటనలు తలపెట్టారని విమర్శించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, సీఈ సుధాకర్‌బాబులతో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు. స్పిల్‌వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ ప్రాంతాల్లో పర్యటించారు. ఎవరి హయాంలో ఎప్పుడెలా పనులు జరిగాయో నాడు–నేడు ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు. పోలవరం పనులు ఎక్కడా ఆగలేదని మంత్రి అంబటి స్పష్టం చేశారు. దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్ ప్రాంతంలో ఇసుక నింపి జెట్ గ్రౌటింగ్ పనులు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, గేట్లు, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను తాము పూర్తి చేశామన్నారు. తాము పూర్తి చేసిన స్పిల్‌వేపై నడుస్తూ చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలా డుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ సర్కారు ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి పెట్టకుండా బస్సు యాత్రలు, భజనలకే ప్రాధాన్యం ఇచ్చిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఏం మాట్లాడారంటే: రాజకీయ కక్షతో చంద్రబాబు ఎంతగా దిగజారిపోయాడో..?: - పోలవరం ప్రాజెక్టులోని కీలక ప్రాంతాలను పరిశీలించాను. - నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని ప్రాజెక్టులు తిరుగుతూ పోలవరం కూడా వచ్చారు. - పోలవరం స్పిల్ వే మీద నుంచి చాలా విషయాలు మాట్లాడారు. - ఆయన చాలా అంశాల్లో అసత్యాలు చెప్పే ప్రయత్నం చేశారు. - చంద్రబాబు పర్యటన అంతా ప్రాజెక్టుల కోసం కాదు..బ్యానర్లు కట్టుకుంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లుంది. - వెళ్లిన ప్రతి చోటా అక్కడి వైయస్ఆర్‌సీపీ నాయకులను దూషించడం, తన వాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. - వయసులో చంద్రబాబుతో పాటే పెద్దిరెడ్డి గారు కూడా ఉంటారు. - పెద్దిరెడ్డిపై ఉన్న రాజకీయ కక్షతో కేంద్రంలో చక్రాన్ని తిప్పానని చెప్పుకునే చంద్రబాబు ఎవడ్రా వాడు అనడం అంటే ఎంతకి దిగజారిపోయాడో అర్ధం అవుతోంది. - నీకు ప్రాజెక్టులపై చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టుల గురించి మాట్లాడు. - అలా కాకుండా వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు...సైకో అంటాడు...అంబోతు రాంబాబు అంటాడు.. నా మూడు ప్రశ్నలకు బదులేది చంద్రబాబూ..?: - నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ చంద్రబాబును మూడు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నా..కానీ నేటికీ వాటి సమాధానం లేదు. - విభజన చట్టంలో 90 సెక్షన్ ప్రకారం కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టును మీరెందుకు దేహీ అని తీసుకున్నారు..? - 2018లో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సాక్షాత్తు శాసనసభలో ప్రగల్భాలు పలికిన మీరు ఎందుకు పూర్తి చేయలేదు..? - కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కాకుండా, నది డైవర్షన్ పూర్తి కాకుండా డయాఫ్రం వాల్ ఎందుకు వేశారు..? - ఇవన్నీ చెప్పమంటే అది చెప్పకుండా ఆంబోతు రాంబాబు అంటాడు. - సమాధానం లేనప్పుడు, లాజిక్ లేనప్పుడే ఇలాంటి మాటలు మాట్లాడతారు. - నేను చిత్తశుద్ధిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా...డయాఫ్రం వాల్ వేయవలసిన సమయానికంటే ముందుగా వేయడమే ఈ ప్రాజెక్టుకు శనిలా దాపురించింది. - నేను 72 శాతం పూర్తి చేశాను..28 శాతం వీళ్లు చేయలేకపోతున్నారు. నేనొస్తే పూర్తి చేస్తా అంటున్నాడు. - నువ్వు ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేకపోయావ్..? 2018కి పూర్తి చేస్తానని చెప్పిన పెద్దమనిషివి ఎందుకు పూర్తి చేయలేకపోయావో చెప్పు. వేలకోట్ల దోపిడీకే గడ్కరీ కాళ్లు పట్టుకున్నావ్..: - తన బినామీ కాంట్రాక్టరుకు ఇచ్చుకుని దాంట్లో వేలకోట్లు దోచేద్దామని మోడీ, గడ్కరీ కాళ్లు పట్టుకుని పోలవరం ప్రాజెక్టు తీసుకున్నాడు. - గడ్కరీ దగ్గరకు పండుగ రోజు కూడా వెళ్లాను..అదీ నా చిత్తశుద్ధి అంటాడు. - పండుగ రోజు కూడా వెళ్లి కాళ్లు పట్టుకుని ఈ ప్రాజెక్టును తెచ్చుకోవాలనేది చంద్రబాబు కోరిక. - ఈయన దేహీ అని అడుగుతుంటే...వాళ్లు భూసేకరణ, పునరావాసం మీరే పెట్టుకోండి అన్నారు. - 2016లో నువ్వు జాతీయ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని కేంద్రాన్ని ఒప్పించి తీసుకున్నావ్. ఆనాడు 2013–14 రేట్లపై 2016లో తీసుకున్నావు.. - స్వార్ధం, ఆతృత, డబ్బు కాజేద్దామనే మనస్థత్వంలో ఇవన్నీ వదిలేశాడు. - మేం కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే ఇస్తామన్నా ఒప్పుకొని వచ్చాడు. - వాటర్ సప్లై కాంపోనెంట్, పవర్ కాంపోనెంట్ లను కూడా ఇవ్వలేమన్నారు. - అయినా సరే రూ.20,392 కోట్లకు అంగీకరించి ప్రాజెక్టును తీసుకున్నాడు. - కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టును తగుదునమ్మా అంటూ తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదం. - 2013–14 రేట్లకు అంగీకరించడం చంద్రబాబు చేసిన రెండో తప్పిదం. - వీటికి తోడు ఇరిగేషన్ కాంపోనెంట్‌కి మాత్రమే ఒప్పుకుని తీసుకోవడం మూడో తప్పిదం. - కాఫర్ డ్యాం పూర్తి కాకుండానే డయాఫ్రం వాల్ వేయడం మరో తప్పిదం. - త్వరగా బిల్లులు చేసుకుని జేబులు నింపుకోవడం కోసం చేసిన తప్పిదాలు ఇవి. మేం కట్టిన స్పిల్‌వేపై చంద్రబాబు సెల్ఫీ దిగాడు: - కాఫర్ డ్యాంలలో చిన్నగ్యాప్‌లు ఉన్నాయట...వాటిని మేం పూర్తి చేయలేకపోయాం అంటాడు. - కాఫర్ డ్యాంను మీడియా వాళ్లు ఇప్పుడే చూశారు కదా..కాఫర్ డ్యాం ఎత్తే పెరగలేదు. - నది డైవర్షన్, స్పిల్ వే పూర్తి కాలేదు. గేట్లు పెట్టనే లేదు. - కానీ అంతా నేనే చేశా అంటూ దారుణంగా అబద్ధాలు అడుతున్నాడు. - నది డైవర్షన్ చేయకుండానే కాఫర్ డ్యాంలు వేస్తే వెనుకనున్న 50 గ్రామాలు మునిగిపోతాయి అని అధికారులు చెప్పినా వినలేదు. - నువ్వు వదిలేసిన కాఫర్ డ్యాంలు పూర్తి చేయాలంటే స్పిల్ వే పూర్తి కావాలి కదా.? - అప్రోచ్ చానల్ పూర్తయితే, ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసిన తర్వాత కాఫర్ డ్యాంలు పూర్తి చేస్తాం. - నది డైవెర్షన్ పూర్తి అయిన తర్వాత వెయ్యాల్సిన డయాఫ్రం వాల్‌ను ముందే వేసి ఈ ప్రాజెక్టుకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు. - ఇంత దుర్మార్గం చేసి మళ్లీ ప్రాజెక్టు పైకి వచ్చి అవే ఆబద్దాలు మాట్లాడుతున్నాడు. - నిన్న ఆయన తిరిగిన స్పిల్‌వే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసిందే. - ఆయన చూసిన కాఫర్ డ్యాంలు కూడా మేం పూర్తి చేశాం. - ఆయన ప్రతి సోమవారం వచ్చి ఇవన్నీ ఎందుకు పూర్తి చేయలేదో..? - మీరు ఏది చెబితే అది చూపించే మీడియా, పత్రికలు ఉన్నాయని దారుణంగా మాట్లాడుతున్నాడు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించారని నీతో ఎవరు చెప్పారు బాబూ..?: - 41.15 మీటర్లకు ఎందుకు తగ్గించాడు..మూర్ఖుడు, సైకో అంటూ మాట్లాడతాడు.. - ఈ ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు. ఎవ్వరూ తగ్గించలేదు..తగ్గించడానికి వీళ్లేదు. ఇది అనుమతి పొందిన ప్రాజెక్టు. - అయితే ప్రాజెక్టులో కొన్ని దశలుటాయి. 41.15కి మొదటిగా నీళ్లు నిలబెడతారు. - స్టడీ చేసి అక్కడేమన్నా సమస్యలున్నాయా అనేది చూసుకుని ఆ తర్వాత మరింత ఎత్తు పెంచుతారు. - అలా పెంచుకుంటూ పరిశీలించుకుంటూ వెళ్లి చివరిగా 45.72 మీటర్లకు నింపుతారు. - ఇది దశల వారీగా చేయాల్సిన పని. నువ్వున్నా..మేమున్నా చేయాల్సింది ఇదే..? - 41.15కి తగ్గించారని మాట్లాడటానికి బుద్ధుందా చంద్రబాబూ..? తప్పుడు మాటలు ఎందుకు మాట్లాతున్నావ్..? - 50 లక్షల క్యూసెక్కుల వరద డిఛార్జి అయ్యే విధంగా పోలవరం ప్రాజెక్టును డిజైన్ చేశారు. - స్పిల్ వే పూర్తి అయ్యింది..ఎంత నీరు పైనుంచి వస్తే అంత నీరు కిందకు వెళ్తుంది. - రిజర్వాయర్‌ను నింపే కార్యక్రమం లేదు కాబట్టి వచ్చిన నీరు వచ్చినట్లు వెళ్లిపోతుంది. - 50 లక్షల క్యూసెక్కులకు డిజైన్ చేస్తే 50 లక్షలు వస్తాయని కాదు... - ఇంతవరకు గోదావరిలో ఎప్పుడు 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన సందర్భమే లేదు. - గోదావరి చరిత్రలో 1986లో 36 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చింది. అదే ఇప్పటి వరకూ అత్యధికం. - నీళ్లొస్తే ఎదురు తన్నేస్తాయి కదా..అంటాడు...గేట్లు ఎత్తేస్తే నీళ్లు వెనక్కి ఎందుకు తంతాయి..? - 41.15 మీటర్లకు మనం కేవలం 119 టీఎంసీల నీటిని మాత్రమే నింపగలం. - మొత్తం 194 టీఎంసీలకు గాను మొదటి దశలో 119 టీఎంసీలు మాత్రమే నింపుతాం. - ఈ ప్రాజెక్టు లేకపోయినా ఎక్కువ వరద వస్తే గ్రామాలు మునిగిపోతాయి. - ప్రాజెక్టు లేనప్పుడు కూడా మునుగాయి. గోదావరి ఉదృతి అలా ఉంటుంది. నువ్వు చేసిన నిర్వాకాన్ని మేం సరిచేస్తున్నాం - మేం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2017–18 రేట్ల ప్రకారం రూ.55వేల కోట్లకు అనుమతులు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరాం. - మొదటి దశలో 41.15 మీటర్లకు రూ.19వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాం. - 20,946 పీడీఎఫ్‌లకు రూ.2,177 కోట్లు ఇవ్వాలని అంచనా వేశాం. - లేడార్ సర్వే చేస్తే గ్రామాలు మునగకుండా, గ్రామాలకు వెళ్లే మార్గాలు మునిగిపోతున్నాయని తేలింది. వాటికి కూడా పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. - అవి 16,642 పీడీఎఫ్‌లు అయ్యాయి. దానికోసం మరో రూ.5,217 కోట్లు ఇవ్వాల్సి వస్తోంది. - ఇవన్నీ కలిపి మొత్తంగా భూసేకరణ, ఆర్ అండ్ ఆర్‌కి 41.15 మీటర్ల మేర మొదటి దశకు రూ.7,394 కోట్లు ఇవ్వాలని కోరాం. - దీనికి తోడు కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిన దానికి మరో రూ.2,002 కోట్లు అవసరం పడుతుంది. - కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బు మంజూరు చేసే దశలో ఉంది. - ఎక్కడా పని ఆగలేదు..ఒక్క డయాఫ్రం వాల్ వద్దే ఆగిపోయింది. - స్పిల్ వే పూర్తి చేసింది మేమే. నదిని డైవర్షన్ చేసింది మేమే. - కాఫర్ డ్యాంలు రెండూ పూర్తి చేసింది మేమే. - కానీ మేమేమీ చేయడం లేదని ఆబద్దాలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. నీ హయాంలో ఒక్క ప్రాజెక్టుకైనా ప్రారంభోత్సవం చేశావా..?: - జగన్ గారు దిగిపోవాలి ఆయన ఎక్కాలి అనే తాపత్రయంతో ఏదంటే అది మాట్లాడుతున్నాడు. - నువ్వేమన్నా కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నావా...40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నావు..14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు కదా..? - ఇప్పుడు కొత్తగా వచ్చి చేసేదేంటి..? నువ్వున్నప్పుడు ఎందుకు నీళ్లివ్వలేదు..? - ఒక్క ప్రాజెక్టును శంకుస్థాపన చేసి పూర్తి చేశావా..? - ప్రాజెక్టులు, వ్యవసాయంపై చిత్తశుద్ధి లేని వ్యక్తి ప్రాజెక్టుల వద్ద గందరగోళం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. - యువగళంలో ఏమీ జరగడం లేదు..దానివల్ల టీడీపీ డౌన్ అవుతోంది. - మొన్నామధ్య బీసీ చౌదరులారా అంటాడు..ప్రశాంతత అనమంటే ప్రశాంతి అత్త అంటున్నాడు. - తన కొడుకును రోడ్ల మీదకు పంపినా అతని లీడర్ షిప్ ఎవరూ యాక్సెప్ట్ చేయడం లేదు. - అందుకే ప్రాజెక్టుల వంకతో చంద్రబాబు మరో రూట్లో తిరుగుతున్నాడు. - ప్రాజెక్టులపై చిత్తశుద్ధి కాదు...కక్షసాధింపులో భాగంగానే పర్యటన. - నేను ఆంబోతు రాంబాబునా..? నేను అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పని నీకు నన్ను దూషించే హక్కు ఎక్కడిది..? - నేను ఆంబోతు రాంబాబును అయితే మీరు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే మనిషి మీరు. - కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్నపుడు ఢిల్లీలో ఆంబోతులకు ఎన్ని ఆవులన్ని సప్లై చేశావో మాకు తెలియదా..? - సైకిల్ గుర్తును తెచ్చుకోడానికి ఎన్ని ఆంబోతులకు ఎన్ని ఆవులను సప్లై చేశావో మళ్లీ చెప్పాలా..? - ప్రాజెక్టుల గురించి మాట్లాడు..అంతేకానీ ఇష్టారీతిన మాట్లాడవద్దు. - నేను ఊరికనే బ్రో సినిమా గురించి మాట్లాడతామా...? నన్ను గోకారు కాబట్టి మాట్లాడుతున్నాను. - చంద్రబాబూ నువ్వు ఒకటంటే..మేం వంద అన్నాల్సి వస్తోంది. మీ హయాంలో గుడ్డి గాడిద పళ్లు తోమారా..?: - నువ్వు 72 శాతం పూర్తి చేశాను..అంటున్నావ్...నా కలల పంట అంటున్నాడు. - ఇంత గొప్ప ప్రాజెక్టు అంటున్న నువ్వు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు గుడ్డి గాడిదలకు పళ్లు తోముతున్నావా..? - రాజశేఖరరెడ్డి గారు శంకుస్థాపన చేసి రూ.4వేల కోట్లు ఖర్చు చేసే వరకూ నువ్వేం చేశావ్..? - నీకు ఏ మాత్రం సంబంధం లేని ఈ ప్రాజెక్టును బ్రెయిన్ చైల్డ్ అంటున్నావు. - ఇది కాదా ఎవరికో పుట్టిన బిడ్డను నువ్వు ఎత్తుకుంటున్నావ్ అనేది. - ప్రాజెక్టులపై చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. పోలవరం మీద అసలే చిత్తశుద్ధి లేదు. - పోలవరాన్ని ఆయన శంకుస్థాపన చేయలేదు.. - పోలవరాన్ని ఏటీఎంగా వాడుకుంటున్నాడని సాక్షాత్తు ప్రధాని మంత్రే చెప్పాడు. - ఏటీఎంలా వాడుకోవడం కోసమే దేహీ అని వాళ్ల కాళ్లు పట్టుకుని ప్రాజెక్టు తెచ్చుకున్నావు. - నీ తాబేదార్లకు కాంట్రాక్టులు ఇచ్చుకుని డబ్బు కాజేసే కార్యక్రమం చేశావు. - జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక పోలవరం నిర్మాణంలో ఎక్కడా తప్పిదం చేయలేదు. - ప్రొటోకాల్ ప్రకారం మేం పనులు చేస్తున్నాం. 2022లో పూర్తి చేస్తామని శాసనసభలో చెప్పిన మాట వాస్తవం. - అప్పటికి చంద్రబాబు వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదన్న విషయం మాకు తెలియదు. - చంద్రబాబు ఆబద్దాలు అద్భుతంగా ఆడుతున్నారు. నిన్న ప్రాజెక్టు పై నిల్చుని అన్నీ ఆబద్దాలు చెప్పే ప్రయత్నం చేశాడు. మేం చేసిన అభివృద్ధి చూసి నిన్న బాబు ఫేస్‌లో కళలేదు: - నిన్న ఆయన ఫేస్‌లో కళ లేదు. అన్ని పనులు పూరై కనిపించాయి..అందుకే కళ తప్పింది. - ఆయన సోమవారం సోమవారం రావడం మానేసిన తర్వాతనే ప్రాజెక్టు పనుల్లో పురోగతి వచ్చింది. - బ్యానర్లు, బస్సు యాత్రలు, బొకేలు, భోజనాలు, భజనలు, శిలాఫలకాలు తప్ప ఇంకేం జరగలేదు. - ఆయన హాయంలో అన్నీ పునాదుల స్థాయిలోనే ఉండి పోతే మేము వచ్చి పూర్తి చేస్తున్నాం. - జగన్ గారి చేతుల మీదుగానే ఈప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం. - వైయస్ఆర్ ప్రారంభించిన ప్రాజెక్టు ఇది..ఆయన తనయుడు వైయస్ జగన్‌గారే ఇది ప్రారంభం అవుతుంది. ఇది దైవ సంకల్పం..ప్రజల సంకల్పం. - చంద్రబాబు అబద్దాలు చెప్పడం మొదలు పెడితే లై డిటెక్టర్ కూడా కనిపెట్టలేదు. - ఈ ఎన్నికల తర్వాత దేశంలోని దొంగలందరికీ బెత్తం పుచ్చుకుని లై డిటెక్టర్‌కి దొరకకుండా అబద్దాలు ఎలా చెప్పాలో క్లాసులు తీసుకుంటాడు. సెల్ కనిపెట్టినాయన సెల్ఫీ దిగలేకపోతున్నాడు: - మేం ప్రచారం చేసుకోలేదు..ఆయన బస్సులు పెట్టి భజన చేయించుకోడానికి వంద కోట్లు అయ్యింది. - పిచ్చితనంగా తప్పు చేసి నేను మేధావిని అంటే ఎలా..? - వయసులో పెద్దవాడు నోరు అదుపులో పెట్టుకోవాలి. - ఫ్రస్టేషన్ వల్ల నోరు అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు. - అధికారం పోగానే ఆయనకు బుర్ర పోయింది. తిరిగి అధికారం వచ్చే అవకాశం లేదు. - భవిష్యత్తులో మరింతగా పోతుంది...అధికారం ఎలాగూ ఇవ్వలేరు కాబట్టి పోయిన బుర్రను తిరిగి ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిద్దాం. - మేం పూర్తి చేసిన స్పిల్‌వే మీద సెల్ఫీ దిగాడు.. - సెల్ఫిష్ ఫెలో సెల్ఫీలకు విలువ లేదు. - సెల్ కనిపెట్టినాయన సెల్ఫీ దిగలేకపోతున్నాడు. తమ్ముడు తనోడైనా ధర్మం చెప్పండి: - నేను చిరంజీవి గారిని కోరేది ఎంటంటే...తమ్ముడు తనోడైనా ధర్మం చెప్పండి. - నన్ను గోకింది ఎవరు..? దానివల్ల ఉపయోగం ఏంటి..? ముందు తమ్ముడికి చెప్పండి మీరు. - నా క్యారెక్టర్ పెట్టాడా లేదా..? నన్ను తిట్టే ప్రయత్నం చేశాడా లేదా..? - చిరంజీవి గారంటే నాకు గౌరవం.. ఆయన పీఆర్పీ పెట్టి రాజశేఖరరెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసినా ఆయనంటే నాకు గౌరవం ఉంది.