జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వ‌స్తున్నారు..జాగ్ర‌త్త

ఎర్ర‌గుంట్ల స‌భ‌లో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి

ఆళ్ల‌గ‌డ్డ‌:  మరో 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి కొంద‌రు రకరకాల జిమ్మిక్కులతో పగటివేషగాళ్ల మాదిరి మీ ముందుకు వస్తున్నారు. మీరు ఇవన్నీ గమనించి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి అన్నారు.
మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రెండో రోజు ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో సాగింది. ఎర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి సందర్భంగా ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి మాట్లాడారు.

ఎమ్మెల్యే బ్రిజేంద్ర‌రెడ్డి ఏమ‌న్నారంటే.. 

అందరికీ నమస్కారం. మరో 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అందరూ కూడా రకరకాల జిమ్మిక్కులతో పగటివేషగాళ్ల మాదిరి మీ ముందుకు వస్తున్నారు. మీరు ఇవన్నీ గమనిస్తున్నారు కూడా. మీకు ఈరోజు రెండు విషయాలు చెబుతాను. సీఎం వైయస్ జగన్ 2019లో సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు  అధికారంలోకి వస్తే రైతుభరోసా, అమ్మఒడి, చేయూత వంటి సంక్షేమ పథకాలతో నవరత్నాలను ప్రకటించారు. ఆ పాదయాత్రలో మీ మద్దతు చూరగొని 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ తూచా తప్పకుండా ఎన్ని ఇబ్బందులు, కష్టాలు వచ్చినా ప్రతి ఒక్క హామీని ఎలాంటి దళారుల వ్యవస్థ లేకుండా నేరుగా మీకే అందించారు. గత ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అందివ్వకపోగా దాదాపు 650 హామీలను ఇచ్చి ఒక్కదాన్ని కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టిన పరిస్థితి. ఇప్పుడు కూడా మనం ఒకటే చెబుతున్నాం మాకు అధికారం ఇస్తే మీ గ్రామాలను మారుస్తాం, మీ పిల్లలకు మంచి బడులు కట్టిస్తాం, మంచి చదువులు చెప్పిస్తాం, మంచి వైద్యం అందుబాటులోకి తీసుకొస్తాం, మహిళలకు చేయూత అందిస్తామని ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తామని కోరుతుంటే ఇవాళ ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయో గమనించండి.  ఒకడు అధికారంలోకి వస్తే మా దగ్గర ఎర్రబుక్కు ఉంది, అందులో పేర్లు ఉన్నాయని అంటాడు. అంటే మీరు వేసే ఓటు మీకు మంచి జరగడానికి వేయాలా? వాళ్ల పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి వేయాలా? అని మీరందరూ ఆలోచన చేయాలి. ఇంకొకడు..మేం అధికారంలోకి వస్తే మీరు గుడుల్లో, బడుల్లో దాచి పెట్టుకోవాలి అంటాడు. మేం కూడా ఆళ్లగడ్డ వాళ్లమే, గుడుల్లో, బడుల్లో దాచిపెట్టుకోవాల్సిన అవసరం రాదు కలలు మానుకోండి. అధికారంలోకి వచ్చేది వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఎగిరేది వైఎస్సార్ కాంగ్రెస్ జెండా. 2019లో మీరు మంచి మనస్సుతో మమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి మీకు పెద్దఎత్తున సంక్షేమం చేసే అవకాశం దొరికింది. కాబట్టి రానున్న రోజుల్లో మీకు, మీ కుటుంబాలకు మంచి జరిగింది కాబట్టి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరుతున్నాను.

Back to Top