విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధమైంది. సోమవారం జరుగనున్న స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శిస్తారు. రేపు సాయంత్రం 5:30నిమిషాలకు రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్ కార్యక్రమం జరుగనుంది.ఈ కార్యక్రమానికి సీఎం వైయస్ జగన్ హాజరు కానున్నారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలకు ఏర్పాట్లు తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కో- ఆర్డినేటర్, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.