ప్రతి ఏటా జనవరిలో "అమ్మ ఒడి'

 నాడు నేడు  మెదటి దశలో 15వేల స్కూళ్లను, రూ.3600 కోట్లతో అభివృద్ధి పనులు

రూ.1300 కోట్లతో మధ్యాహ్నం భోజన పథకం మార్పులు

ప్రకాశం జిల్లా : ఇక నుంచి ప్రతి ఏడాది జనవరి నెలలో జగనన్న అమ్మఒడి పథకం కింద తల్లుల ఖాతాలో డబ్బులు చేస్తామని, ఇందుకు ఆరువేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. సంకాంత్రి పండుగను పురస్కరించుకొని  ఆయన దోర్నాల మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాడు నేడు కార్యక్రమంలో కింద మెదటి దశలో 15వేల స్కూళ్లను, రూ.3600కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ రోజు ఫోటో చూపించి.. తిరిగి మూడేళ్ల తర్వాత అదే స్కూల్‌ను ఫోటో తీసి చూపిస్తామన్నారు. ఫోటో చూసి ఎలా అభివృద్ధి జరిగిందో ప్రజలే అర్థం చేసుకుంటారని చెప్పారు. రాబోయే రోజుల్లో రూ.1300 కోట్లతో మధ్యాహ్నం భోజన పథకం మార్పులు చేసి పిల్లకు మంచి భోజనం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో తొలిసారిగా వచ్చే ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. 
 

తాజా వీడియోలు

Back to Top