నేడు వైయ‌స్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం 

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ మీటింగ్‌కు రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంటు)లు హాజరు కానున్నారు. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పార్టీ నేతలతో వైయ‌స్‌ జగన్‌ చర్చిస్తారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. 

Back to Top