పవన్‌కు భారీ షాక్‌.. 

వైయ‌స్ఆర్‌సీపీలోకి భారీగా జనసేన కార్యకర్తలు

గాజువాకలో పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి 

గాజువాక: విశాఖజిల్లా గాజువాకలో ఆదివారం 500 మంది జనసేన కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వారికి గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనగర్‌ నుంచి జగ్గు జంక్షన్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం 72వ వార్డు యువ నాయకుడు కొసిరెడ్డి గణేష్‌ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన దంతవైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన నుంచి 500 మంది కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అవి పేదలకు అందుతున్న విధానం చూసి వారు వైయ‌స్ఆర్‌సీపీలో చేరినట్లు చెప్పారు. 72వ వార్డు ప్రజల కోరిక మేరకు వార్డులో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడానికి కృషిచేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలోవైయ‌స్ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్‌రెడ్డి, 72వ వార్డు ఇన్‌చార్జి సిరట్ల శ్రీనివాస్‌ (వాసు), నాయకురాలు రోజారాణి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Back to Top