ఈ నెల 29న తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ సభ  

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి  
 

తిరుపతి: ఈ నెల 29న తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేసినట్లు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...సీఎం వైయస్‌ జగన్‌పై టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టేలా అమరావతి పాదయాత్ర ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.  అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే సీఎం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 
 

తాజా వీడియోలు

Back to Top