తూర్పు గోదావరి: టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో స్థానిక ఖండ్రిగ పేటకు చెందిన సుమారు 200 మంది శెట్టిబలిజలు టీడీపీని వీడి వైయస్ఆర్ సీపీలో చేరారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు రావాడ సత్తిబాబు, పార్టీ నేతలు నాతి కుమార్ రాజా, వనుం సూరిబాబు, కె.సత్యనారాయణ, వాసంశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలన, వెనుకబడిన వర్గాలకు కల్పిస్తున్న ప్రాధాన్యతకు ఆకర్షితులై బీసీ నేతలు వైయస్ఆర్‌సీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే 50 శాతం నామినేటెడ్ పదవుల కల్పనతో పాటు పలు ఎమ్మెల్సీలు, రాజ్యసభ స్థానాలు బీసీలకు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వాసంశెట్టి మసేను (రామన్న), పిల్లి శేషారావు, గుత్తుల సత్యనారాయణ, నసూరి కొండ, వాసంశెట్టి సూర్యనారాయణ, వాసంశెట్టి బూరయ్య, వాసంశెట్టి వీరవెంకటరావు, వాసంశెట్టి శ్రీను (బూరయ్య), వనుం దాది, గుత్తుల సీతమ్మ, గుత్తుల మేరీ సుశీల, పిల్లి నరసింహ మూర్తి, కాకరపల్లి గోవిందు, వనుం శ్రీను, గుత్తుల శ్రీను (కొండ), కోశెట్ట్టి రాంబాబు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.