తినగలిగే నాణ్యమైన బియ్యం ఇస్తున్నాం

పాదయాత్ర సమయంలో ప్రజల దగ్గర నుంచి రకరకాల సూచనలు, సలహాలు చూసిన నేపధ్యంలో, ఎన్నికలకు వెళ్లేముందు మేనిఫెస్టో తయారు చేసాం. టీడీపీ వాళ్లకు గౌరవంలేదు అందుకే మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేస్తారు. ప్రజలు కొడతారని ఆన్లైన్లో పెట్టిన మేనిఫెస్టోను డిలీట్ కూడా చేసేస్తారు. కానీ మేము మానిఫెస్టోనే మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెబుతూ రిలీజ్ చేసాం. ఇందులోని ప్రతి అంశమూ చేస్తాము అని చెప్పి ఓట్లు అడిగాము. ఈ మేనిఫెస్టోలో ఎక్కడా ఈ రకమైన బియ్యం ఇస్తామని వివరాలు రాయలేదు. అసలు మేనిఫెస్టోలో చెప్పని కార్యక్రమం మేము చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. కావాలంటే అద్దాలు సరి చేసుకుని చదువుకోవచ్చు. చెప్పని అంశాన్ని కూడా చేసిచూపాలని, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో చేస్తున్న కార్యక్రమం ఇది. చంద్రబాబు హయాంలో ఇచ్చిన బియ్యం ప్రజలకు తినలేకపోయారు. ఆ బియ్యాన్ని రూపాయికి కొని తిరిగి డీలర్ కే 7 రూపాయిలకు అమ్మేసేవారు. అదే బియ్యాన్ని డీలర్ రైస్ మిల్లులకు అమ్ముకునేవాడు. మిల్లర్లు మరో రెండు రూపాయిలు ఎక్కువకు కొన్న ఆ బియ్యాన్ని రీ పాలిష్ చేసి పబ్లిక్ డిస్టిబ్యూషన్ సిస్టంలోకి పంపుతున్నారు. అధిక ధరలకు అమ్ముతున్నారు. తినేపరిస్థితి లేని బియ్యాన్ని నాడు టీడీపీ సప్లై చేసింది. అది తెలుసుకునే మేము ఆ స్కీమును పూర్తిగా మార్చాము. నేడు మేము ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నాము. పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళంలో ప్రారంభించాము. నేను గర్వంగా చెబుతున్నాను గతంలో చంద్రబాబు ఇచ్చిన బియ్యం క్వాలిటీతో కంపేర్ చేయండి. నేడు శ్రీకాకుళంలో మేము నాణ్యతతో కూడిన ప్యాక్ చేసిన బియ్యాన్ని ఇస్తున్నాం. ఏ ఒక్కరూ తినలేని పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరూ ఆనందంగా తింటున్నారు. శ్రీకాకుళంలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ మాసం నుంచి రాష్ట్రమంతటా విస్తరిస్తున్నాం. గతంలో చంద్రబాబు పంపిణీ చేసిన నాసిరకం బియ్యం కంటే మా ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన బియ్యం కోసం అక్షరాలా 1400 కోట్ల రూపాయిలు అధికంగా ఖర్చు చేస్తోంది. క్వాలిటీ బియ్యం ప్రతి పేదవాడకి అందించాలని, తినాలనే ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేదు అని డ్రామా నాయుడు అడుగుతున్నారు. అంటే వాళ్లకే అర్థం అవుతోంది శ్రీకాకుళంలో మంచి క్వాలిటీ బియ్యం ఇస్తున్నాము అని. చంద్రబాబు గారి టైమ్ లో కొని గోడౌన్లో పెట్టిన బియ్యాన్ని పూర్తిగా డిస్టిబ్యూట్ చేసేసి, ఖరీప్ లో ప్రొక్యూర్ చేయబోతున్న బియ్యాన్ని పంపిణీ చేస్తాం. అందులోనూ స్వర్ణ వెరైటీకి చెందిన నాణ్యమైన బియ్యాన్ని మాత్రమే సేకరించమని ఆదేశాలిచ్చాం. ఆరునెలలు నిల్వపెట్టి అందించే కార్యక్రమం కూడా చేస్తున్నాం. గతంలో పంపిణీ చేసిన బియ్యంలో 25 శాతం నూకలు ఉండేవి. ఇప్పుడు మనం సప్లై చేసే బియ్యంలో నూకలు 15% కి తగ్గేలా జాగ్రత్త తీసుకున్నాం. డ్యామేజీ 3% ఉండేది దాన్ని .75% మించకూడదని చెబుతున్నాం. షాకీ గ్రేన్స్ గతంలో 5% ఉండేది. అది కూడా 1% మించకూడదని చెబుతున్నాం. ఇవన్నీ చేయడం వల్ల బియ్యంలో క్వాలిటీ పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల ప్రజలు బియ్యాన్ని అమ్ముకోవాలనే ఆలోచన చేయకుండా తినగలిగే పరిస్థితి వస్తుంది. 
వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచీ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఇదేరకమైన నాణ్యమైన బియ్యం సరఫరా చేసి ప్రజలు గర్వంగా చెప్పుకునేలా చేస్తాం. 
సాక్షిలో వచ్చిన వార్తను పట్టుకుని అది గెజిట్ అని అంటున్నారు. సాక్షి పత్రిక వాళ్లు పొరపాటుగా రాసారు. కానీ మిగతా పత్రికల్లో మాత్రం నాణ్యమైన బియ్యం అనే రాసారు. అది కాస్త చదువుకుంటే బావుంటుంది. జ్ఞానం వస్తుంది. నాలెడ్జ్ కూడా కాస్త పెరుగుతుంది.

Read Also: బియ్యం బ్యాగుతో ప్ర‌భుత్వానికి సంబంధం లేదు

Back to Top