చంద్రబాబు..ఎల్లోమీడియాకు ఎందుకంత అక్కసు

వైయస్‌ జగన్‌ పాలనలో సామాజిక న్యాయానికి పెద్దపీట

గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు

గత పాలనలో ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే

కష్టపడి ఉద్యోగాలు సాధించిన వారి మనోభావాలు దెబ్బతీస్తారా?

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు

 

తాడేపల్లి: బడుగులు, బలహీన వర్గాలకు ఉద్యోగాలు వస్తే చంద్రబాబు, ఎల్లోమీడియా ఓర్వలేకపోతున్నారని, వారికి ఎందుకంతా అక్కసు అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు  మండిపడ్డారు. మహాత్మాగాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం దిశగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అధికారుల సహకారంతో సచివాలయ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించారని చెప్పారు.వైయస్‌జగన్‌ పాలనలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశారని చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. గత టీడీపీ పాలనలో ఒక సర్టిఫికెట్‌ కావాలంటే లంచం..ఇల్లు కావాలంటే లంచం..పింఛన్‌ కావాలంటే లంచం..ప్రభుత్వం నుంచి చిన్న పని కావాలన్నా లంచం..లంచం అన్నారు. ఇందుకు చంద్రబాబు నియమించిన జన్మభూమి కమిటీలు కొమ్ముకాశాయి. మీడియా పేరుతో రాధాకృష్ణ కులాల మధ్య చిచ్చుపెట్టారు. రాధాకృష్ణకు చంద్రబాబు ఒక శ్రీరాముడిగా కనిపిస్తారు. చంద్రబాబు తప్ప మరొకరు ఈ రాష్ట్రాన్ని పాలించకూడదన్నది రాధాకృష్ణ ఉద్దేశం. ఎందుకు ఎన్టీఆర్‌ను గద్దె దించేందుకు వీరిద్దరు కుట్ర పన్నారో ప్రజలకు తెలుసు. చంద్రబాబుకు, రాధాకృష్ణకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఒక లైవ్‌ టెలీకాస్ట్‌లో చంద్రబాబు, రాధాకృష్ణ మధ్య జరిగిన సంభాషణలో ఎన్టీఆర్‌ను వాడు..వీడు అంటూ సంభోదించారంటే వారి గుణం ఏంటో తెలుస్తుంది. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక మూడు నెలల్లోనే 1.30 లక్షల ఉద్యోగాల నియామకాలు చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్లుకల్పించారు. ఇదే కదా మేం కొరుకున్న సామాజిక న్యాయం. టీడీపీ నేతలు ఒక్కరైనా స్పందించారా? ముఖ్యమంత్రి పాదయాత్రకు ముందుకు ఎలా ఉన్నారో..సీఎం అయ్యాక ఎలా పని చేస్తున్నారో దేశమంతా చూస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు మేలు చేసేలా పాలన సాగిస్తున్నారు. సచివాలయ ఉద్యోగాల్లో ర్యాంకులు సాధించింది ఓ మహిళ, దళితులు,  బడుగులే కదా? ఎందుకు మీకంతా అక్కస్సు. వ్యాన్‌ డ్రైవర్‌ కుమారులు, సైకిల్‌ రిపేరీ చేసే వ్యక్తి కుమారులు స్టేట్‌ ర్యాంకులు సాధిస్తే..అభినందించాల్సింది పోయి..వారి మనోభావాలు దెబ్బతిస్తారా? మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వంపై నిందలు వేస్తారా? చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా మోసం చేశారు. చదువుకుంటున్న తల్లులకు అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేలు ఇచ్చే కార్యక్రమం పచ్చ మీడియాకు, టీడీపీ నేతలకు కనిపించదు. రైతు భరోసా పథకం వీరికి పట్టదు. నిన్న రాసిన పరీక్షల్లో టీడీపీకి చెందిన వారు టాపర్లుగా లేరా? చంద్రబాబు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
 

తాజా వీడియోలు

Back to Top