ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ ప్యాకప్‌..

పార్టీని బతికించుకోవడానికే చంద్రబాబు డ్రామాలు

టీడీపీని చరిత్రహీనంగా దిగజార్చారు

చంద్రబాబూ.. జాతీయనేతనంటూ ఎందుకంత ఫోజులు

వాస్తవాలకు విరుద్ధంగా చంద్రబాబు తీరు

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం

హైదరాబాద్‌: ఫలితాలు రాకుండానే జాతీయ నేతనని చంద్రబాబు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం విమర్శించారు. హైదరాబాద్‌లో వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును కొన్ని పత్రికలు,ఛానెళ్లు ఎక్కడికో తీసుకెళ్తున్నాయన్నారు. చంద్రబాబుకు జేబు మీడియా వంత పాడుతున్నాయని ధ్వజమెత్తారు. వాస్తవాలు ప్రతిబింబించే విధంగా లేకుండా..అందుకు విరుద్ధంగా దేశ రాజకీయాల్లో చంద్రబాబు ఒక గొప్ప వినూత్న చారిత్రక క్రియశీలక పాత్ర వహిస్తున్నారని, దేశంలోని రాజకీయపార్టీలను అన్నింటిని ఒక తాటిపైకి తీసుకువస్తున్నారని కొన్ని పత్రికలు,మీడియా ఛానెల్స్‌ ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు. అమరావతిలో సమీక్ష సమావేశాలు ఎన్నికల తర్వాత ప్రారంభించారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఓటమి భయం కళ్ల ఎదుట కనబడుతుందని, టీడీపీలో ఉన్న సీనియర్లకు సైతం తెలుసునని తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగుదేశం ప్యాకప్‌ అయిపోతుందన్నారు.  టీడీపీ పార్టీని బతికించుకోవడానికి దేశ రాజకీయాల్లో బ్రహ్మండమైన పాత్ర  పోషిస్తున్నానని చంద్రబాబు తనకుతానే ఇమేజ్‌ సృష్టించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దీనికి కొన్ని పత్రికలు,ఛానెల్స్‌ వంత పాడుతున్నాయని ధ్వజమెత్తారు.

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటే రేపు పార్లమెంటు స్థానాల్లో ఎన్ని గెలవబోతున్నావో సమాధానం చెప్పాలన్నారు. ఫలితాల వెలువడక ముందే రాష్ట్రాలు తిరిగి చంద్రబాబు స్వయంగా జాతీయ నాయకుడిగా ప్రకటించుకుంటున్నారన్నారు.ప్రజల డబ్బులు దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు విమాన యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలన్నింటిని ఒకే తాటిపైకి తేగలిగే శక్తే  ఉంటే.. ఆ పార్టీలను ప్రకటించగలరా అని ప్రశ్నించారు.ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ,కాంగ్రెస్‌లు రెండు కలిసే ప్రసక్తే లేదన్నారు.సమాజ్‌వాదీ,బీఎస్పీ పార్టీలు కాంగ్రెస్‌ పార్టీతో కలిసే ప్రసక్తే లేదన్నారని తెలిపారు.అఖిలేష్‌యాదవ్‌ కూడా తిరస్కరించారన్నారు.మమతా బెనర్జీ కూడా వ్యతిరేకత తెలిపారన్నారు.ఒడిస్సాలో కూడా నవీన్‌పట్నాయక్‌ ససేమిరా అంటున్నారని తెలిపారు.  ఈ నేపథ్యంలో వాస్తవాలు ఈ విధంగా ఉంటే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నానంటూ  చంద్రబాబు స్వయం ప్రకటిత ఫోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబును ఎవరు ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారు.ఏ ప్రాంతీయ పార్టీ కూడా  ఆహ్వానించలేదన్నారు.  మీకు మీరుగా పిలవని పేరంటానికి వెళ్తుతున్నారన్నారు. నాలుగు సంవత్సరాలు కేంద్రంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎంత చక్రం తిప్పావో ప్రజలందరూ చూశారన్నారు.  చక్రం తిప్పలేక చతికిలపడ్డారన్నారు. వైఫల్యాన్ని,చేతగానితనం,అసమర్థతను చాటుకుని తిరిగి కేంద్రంపై దుమ్మెత్తి పోశారని తెలిపారు. చంద్రబాబు.. ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీని చంద్రబాబు అమ్మకానికి పెట్టారని.. కాంగ్రెస్‌ పార్టీలో కలిపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.  రాహుల్‌గాంధీతో చంద్రబాబు ఎప్పడయితే చేతులు కలిపారో ఆనాడే ఎన్టీఆర్‌ స్ఫూర్తిని పాతిపెట్టేశారన్నారు.తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవంగా చెప్పుకునే దమ్ము,ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు పార్టీకి వ్యతిరేకంగా ఉద్భవించిన తెలుగుదేశంపార్టీ.. భారతదేశ రాజకీయాల్లో చరిత్ర హీనంగా మిగిలిపోయిందన్నారు.

రాబోయే ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు పాలనకు కాలం చెల్లిపోతుందన్నారు.ఎన్నికల అనంతరం టీడీపీ బతికిబట్ట కట్టే పరిస్థితి లేదన్నారు.చంద్రబాబు ఇంకా ప్రజలను,టీడీపీ కార్యకర్తలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.  ప్రజలు.. చారిత్రాత్మక విజయాన్ని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కట్టబెట్టబోతున్నారన్నారు.అసెంబ్లీ స్థానాల్లోనే కాదు,పార్లమెంటు స్థానాల్లో కూడా వైయస్‌ఆర్‌సీపీ విజయ దుందుంబి మోగించబోతుందన్నారు.

 

 

తాజా ఫోటోలు

Back to Top