బాబు మానసిక స్థితి మారినట్లుగా లేదు

గాల్లో గేట్లు పెట్టి పోలవరం పూర్తయిందని టీడీపీ మభ్యపెట్టింది 

ప్రాజెక్టును దోపిడీకే చంద్రబాబు ఉపయోగించుకున్నారు

పోలవరం ప్రాజెక్టు వైయస్‌ఆర్‌ కల

మొదలుపెట్టింది వైయస్‌ఆర్‌.. పూర్తి చేసేది సీఎం వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌ పాలన మళ్లీ పునరావృతం కాబోతుంది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డి

 

విజయవాడ: భయంకరమైన తీర్పు చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చినా వాస్తవాలకు దగ్గరలేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆయన మానసిక స్థితి మారినట్లుగా లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో పోలవరం ప్రాజెక్టు పునాదులకే పరిమితం అయ్యిందని ట్విట్టర్‌ ద్వారా వారే అంగీకరిస్తున్నారన్నారు. గాల్లో షెట్టర్‌ పెట్టి పోలవరం పూర్తయిందని చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, అప్పటి ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమా పోలవరం ప్రాజెక్టులో భారీ కుంభకోణానికి పాల్పడ్డారనే అభియోగం ఉందన్నారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు గత తొమ్మిది సంవత్సరాల పాలనలో పోలవరానికి పునాదులు కూడా పడలేదు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకురావడమే కాకుండా పునాదులు వేసి, కుడి, ఎడమ కాల్వలను కూడా 90 శాతం పూర్తి చేశారు. కుడి కాల్వ 173 కిలోమీటర్లు ఉంటే 140 కిలోమీటర్లు కాంక్రీట్‌ లైనింగ్‌ బ్రిడ్జిలతో సహా వైయస్‌ఆర్‌ నిర్మించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో కలగా ఉన్న పోలవరం వైయస్‌ఆర్‌ పాలనలో రూపుదిద్దుకుంది. పోలవరం ప్రాజెక్టు మొదలు పెట్టింది వైయస్‌ఆర్‌.. పూర్తి చేయబోతుంది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. 

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండానే వందలాది బస్సులో ప్రజలను తీసుకెళ్లి పూర్తయినట్లుగా గత టీడీపీ ప్రభుత్వం చూపించింది. అసెంబ్లీలో అప్పటి మంత్రి ఉమా రాసుకో జగన్‌ 2018 వరకు పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం పూర్తి చేసి ఉంటే ఇవాళ సముద్రంలోకి నీరు ఎందుకు పోతున్నాయి. 25.7 మీటర్లకు స్పిల్‌ లెవల్‌ అక్కడి నుంచి 20 మీటర్లు క్రస్టు గేట్లు మొత్తం 47.7 మీటర్లు క్రస్టు లెవల్‌. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక షెట్టర్‌ను గాల్లో పెట్టారు. ఆ షెట్టర్‌ మళ్లీ తొలగించేశారు. 54 మీటర్లు ఎత్తుకు డ్యామ్‌ ఉంటే షెట్టర్స్‌ ఆపరేషన్‌ జరుగుతుంది. ఆపరేషన్‌ పైన రోడ్డు వస్తుంది అప్పుడే డ్యామ్‌ పూర్తవుతుంది. స్పిల్‌ వే వరకు అయిన పనులు చూపించి డ్యామ్‌ పూర్తయిందని ప్రజలను మభ్యపెట్టారు. ఇప్పుడు కూడా పునాదులు మాత్రమే మా పాలన జరిగిందని ట్విట్టర్‌ ద్వారా మీ పాలనను మీరే అంగీకరించారు. 

వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధుకాన్‌ కంపెనీ యజమాని నామా నాగేశ్వర్‌రావు తెలుగుదేశం పార్టీ నేత వేసిన టెండర్‌ కనీసం 2009 ఎన్నికలు అయ్యే వరకు ఏ మాత్రం పనులు మొదలు పెట్టకపోతే వైయస్‌ఆర్‌ ఆ టెండర్‌ను రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలిచారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికావొద్దని రైట్‌ æ కెనాల్‌కు టీడీపీ నేతలతోనే చంద్రబాబు కోర్టులో కేసులు వేయించింది వాస్తవం కాదా చంద్రబాబూ..?  వైయస్‌ఆర్‌ అన్ని అనుమతులు తీసుకువచ్చి పనులు ప్రారంభించారు. అసలు మీ సమయంలో ప్రాజెక్టుకు ఖర్చు పెట్టింది ఎంత.. పూర్తి చేసింది ఎంతో చంద్రబాబు సమాధానం చెప్పాలి. రీహ్యాబ్లిటేషన్‌లో ఒక్క ఎకరానికైనా మీరు పరిహారం చెల్లించారా బాబూ..? వైయస్‌ఆర్‌ చెల్లించిన పరిహార తప్ప చంద్రబాబు నిర్వాసితులకు చేసిందేమీ లేదు. 

పోలవరం ప్రాజెక్టును దోపిడీకి చంద్రబాబు ఉపయోగించుకున్నారు తప్ప పూర్తి చేయాలనే ఆలోచన వారికి లేదు. పోలవరం అథారిటీని కేంద్రం వేసినా మీ చేతుల్లోకి ప్రాజెక్టు వచ్చేంత వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా చేసింది మీరు కాదా చంద్రబాబూ? వరద సమయంలో టెండర్లు రద్దు చేస్తారా అని అడుగుతున్నారే.. వరద సమయంలో పనులు చేస్తారా.. లేదా అనే సంగతి కూడా తెలియదా..? పోలవరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కమిటీ రిపోర్టు ఇచ్చింది. ట్రాన్స్‌రాయ్‌ కంపెనీ టెండర్‌ను రద్దు చేయకుండా.. నామినేషన్‌ ప్రక్రియలో పనులు కట్టబెడితే రూ. 2300 కోట్ల అవినీతి జరిగింది. చంద్రబాబు, లోకేష్, ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమా దోపిడీ చేశారనే ఆరోపణ ఉంది.  

చరిత్ర మళ్లీ పునరావృతం అయ్యిందని, 2004 మే రెండో వారంలో ముఖ్యమంత్రిగా మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రమాణం చేశారు. వెంటనే జూలైలో ఆల్మట్టీ నుంచి 10 టీఎంసీల మంచినీరు విడుదల చేయాలని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు. ఢిల్లీకి వెళ్లినవారిలో మీరు లేరా చంద్రబాబూ..? సమాధానం చెప్పాలి. వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు సకాలంలో వర్షాలు కురిశాయి.. రైతులు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు ఐదు సంవత్సరాల పాలనలో కరువు తాండవం చేసింది. మహానేత తనయుడు వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత ఆల్మట్టీ నుంచి 2.30 లక్షల క్యూసెక్కుల నీరు ఇవాళ బయటకు వస్తున్నాయి. గత ఐదేళ్లలోఆల్మట్టీ నుంచి ఎంత నీరు బయటకు వచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ప్రకృతి విధ్వంసకులు పాలకులుగా ఉంటే ఏ విధంగా ఉంటుందో.. చంద్రబాబు గత ఐదేళ్ల పాలన తెలిసిపోతుంది. ఒక మీటింగ్‌లో వరుణదేవుడికి మేము అంటే ప్రేమ అని గతంలో వైయస్‌ఆర్‌ చెప్పారు. అన్నట్లుగా చరిత్ర పునరావృతం అవుతుంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలనలో వర్షాలు కురుస్తున్నాయి. రైతులు సంతోషంగా ఉంటారని నాగిరెడ్డి చెప్పారు.

 

Back to Top