చంద్రబాబు సర్కార్‌ ఐదేళ్ల పాలనంతా ఓవర్‌ డ్రాప్టే

శ్వేతపత్రం విడుదల చేసిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

విభజన తరువాత ప్రజలు ఆశించిన స్థాయిలో పాలన జరగలేదు

రూ.18 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారు

ప్రత్యేక హోదా డిమాండ్‌ను చంద్రబాబు సర్కార్‌ నీరుగార్చింది

 అమరావతి: చంద్రబాబు ఐదేళ్ల పాలన అంతా కూడా ఓవర్‌ డ్రాప్టే అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రంవిడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..జాతీయ సగటుతో ఆంధ్రప్రదేశ్‌ స్థూల ఉత్పత్తి తక్కువగానే ఉందని తెలిపారు. గతంలో స్థూల ఉత్పత్తి పెరుగుదల రెండు శాతం మాత్రమే ఉండేదన్నారు. వ్యవసాయ రగంలో 1999– 2004 మధ్య కాలంలో 3.66 శాతం, 2004–2009 ఐదేళ్ల కాలంలో 6.14 శాతమన్నారు.

2014 నుంచి కరువు ఉందని చెబుతూనే, మరోవైపు మన రాష్ట్రం వ్యవసాయ రంగంలో ఆదాయం పెరిగిందని గత ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. చేపల పెంపకం పెరిగినంత మాత్రన వ్యవసాయ వృద్ధిరేటు ఎలా పెరుగుతుందని ఆయన ప్రశ్నించారు.   స్థూల ఉత్పత్తిలో ఐదు శాతం మాత్రమే పెరిగామని చెప్పారన్నారు. జాతీయ స్థూల ఉత్పత్తి రెండు శాతమే ఉందన్నారు. జీపీఏ 2012లో పది శాతం తగ్గిందన్నారు. పరిశ్రమలకు సంబంధించి 2.25 శాతమే తగ్గిందన్నారు. రాష్ట్ర విభజనకు ముందు, తరువాత ఆశించిన పాలన జరగలేదన్నారు.  

2014 నుంచి 2017 మధ్య కాలంలో జాతీయ సగటు 7 శాతమే అన్నారు. ద్రవ్యోల్బణం జాతీయ స్థాయిలో తగ్గిందని చెప్పారు. ఆం్ర«దప్రదేశ్‌లో వినియోగ ద్రవ్యోల్బణం భారీగా పెరిందని తెలిపారు.  2004–2007 వరకు ఏపీ రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉండేదని గుర్తు చేశారు. 2006–07 వరకు కూడా రెవెన్యూ సర్ప్‌లెస్‌లో ఉన్నామని చెప్పారు. ఇవాళ రెవెన్యూ లోటు రూ.66 వేల కోట్లకు పెరిగిందన్నారు. విఫరీతమైన అప్పులు చేశారని, చేసిన ఖర్చు దేనికి ఉపయోగపడుతుందన్నది గత ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు.

ఎఫ్‌ఆర్‌బీఎం యాక్ట్‌ ప్రకారం స్థూల ఉత్పత్తిలో 3 శాతం కంటే ఎక్కువగా అప్పు చేయకూడదని ఉంది. 2013–2014లో 1.37 శాతం ఉందన్నారు. 2016లో 4.42 శాతానికి చేరిందన్నారు. విఫరీతంగా హద్దులు దాటి అప్పులు చేస్తూ వెళ్లారు. వృథా ఖర్చులు, అనవసర ఖర్చులు బాగా పెరిగాయి. పెట్టుబడిపై ఖర్చు తగ్గుతూ వస్తోందని చెప్పారు. విభజన సమయానికి తెలంగాణలో ప్రతీ వ్యక్తి ద్వారా ఉన్న ఆదాయం రూ.14,411 ఉందని తెలిపారు. ఏపీలో ప్రతీ వ్యక్తి ద్వారా వచ్చే ఆదాయం రూ.8,309 ఉందని తెలిపారు. తెలంగాణ తరహాలో ఏపీకి పన్ను ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఇందుకోసమే కేంద్రం మనకు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌లో హామీ ఇచ్చింది.

టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను నీరుగార్చి, ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించింది. చట్టపరమైన హక్కును టీడీపీ తుంగలో తొక్కింది. చట్టంలో ఉన్నది కూడా తీసుకురాకుండా నీరుగార్చారు. లోటును కేంద్రమే భర్తీ చేయాల్సి ఉండగా, స్టాండ్‌డైజ్‌ పద్ధతిలో రూ.1600 కోట్లు లేవని టీడీపీ ఒప్పుకుంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో టీడీపీ మేమే కట్టుకుంటామని తీసుకుంది. దుగ్గరాజపట్నం కచ్చితంగా కేంద్రమే కట్టాలి.   2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోతూ రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టింది. దాదాపు రూ.18 వేల కోట్ల బిల్లులు పెండింగి పెట్టింది. 2018–2019లో రూ.8 వేల కోట్లు పవర్‌ డిస్కామ్స్‌కు రావాల్సి ఉండగా కేవలం రూ.2500 కోట్లు మాత్రమే కేటాయించి, ఇందులో రూ.1200 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. చంద్రన్న కానుక డబ్బులు కూడా చెల్లించలేదు.

అప్పు మాత్రం రూ.2.58 లక్షల కోట్లు, వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.58 వేల కోట్లు అప్పు, కరెంటుకు సంబంధించి రూ.18 వేల కోట్లు, సివిల్‌ సప్లైలో రూ.10 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, మొత్తంగా అప్పు రూ.3. 62 లక్షల కోట్లు ఉంటుందని వివరించారు. ఏదైనా పెవ్‌మెంట్‌ జరగాలంటే ట్రెజరీ ద్వారా నిర్వహించేవారు. ఏ డైరెక్టర్‌కు కూడా సరైన సమాచారం ఇవ్వకుండా పెవ్‌మెంట్లు జరిగాయి. ఆరు నెలల క్రితం ఉన్న మధ్యాహ్న భోజన పథకం బిల్లులు పెండింగ్, లెటెస్టు బిల్లులు మాత్రం పాస్‌..ఆరు నెలల క్రితం హోంగార్డు జీతాలు పెండింగ్, లెటెస్టు జీతాలు మాత్రం చెల్లించారు. పరిశ్రమల్లో ఆదాయం పెరిగితే కరెంటు ఖర్చు కూడా పెరగాలి కదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయం మైనస్‌లో ఉంది. అయినా కూడా ఈ ప్రభుత్వం ధైర్యంగా ఫెస్‌ చేస్తుందని, మానవ వనరులకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నామని, ఆర్థిక పరిస్థితి గురించిన ఆలోచన ఏమాత్రం లేదని బుగ్గన తెలిపారు. 
 

Back to Top