టీడీపీ హయాంలో లక్షల కోట్ల దోపిడీ

బాధిత శిబిరాలు అంటూ చంద్రబాబు దొంగ నాటకాలు

రాష్ట్రం అభివృద్ధి చెందకుండా టీడీపీ నేతల నెగటివ్‌ పబ్లిసిటీ

పరిశ్రమలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం

చింతమనేని, కూన రవి లాంటి వాళ్లు ఇప్పటికీ చెలరేగిపోతున్నారు

సీఎం వైయస్‌ జగన్‌ దేశానికే ఆదర్శం

తాడేపల్లి: చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు లక్షల కోట్లు దోచుకున్నారని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.  ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ప్రతిపక్షం అడ్డుపడుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికి ఆదర్శంగా మారుతున్నారని  శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతికి ఆమడదూరంలో ఉండాలని ప్రతి మీటింగ్‌లో మాట్లాడడమే కాకుండా, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అధికారులతో జరిగే ప్రతి రివ్యూ, ప్రతి మీటింగ్‌లో అవినీతి రహిత పాలన అందించాలని సూచిస్తున్నారన్నారు. ప్రభుత్వ సొమ్ముకు కాపలాదారుడిగా ఉండాలని, ఏ ఒక్క రూపాయి అవినీతి కాకూడదని రివర్స్‌టెండరింగ్‌ చట్టాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం వైయస్‌ జగన్‌ పాలన ప్రజలంతా మెచ్చారు. అది చూసి ఓర్వలేక తెలుగుదేశం ఆడే డ్రామాలు అనేకం చూస్తున్నాం. పెయిడ్‌ ఆర్టిస్టుతో టీడీపీ చేయిస్తున్న నాటకాలు ప్రజలంతా చూస్తున్నారు. అత్యంత గౌరవప్రదమైన స్పీకర్‌ స్థానాన్ని కోడెల శివప్రసాద్‌ దిగజార్చారు. అసెంబ్లీలోని ఫర్నిచర్‌ దాచుకున్న విషయం బయటకు వచ్చింది. ఆ విషయాలపై ఎక్కడ చర్చజరుగుతుందోనని భయపడి రాజధాని మార్చుతున్నారని టీడీపీ నేతలు టాపిక్‌ డైవర్ట్‌ చేస్తున్నారు. 

ప్రతి విషయంలో నీచ రాజకీయాలు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఐదేళ్ల పాలనపై టీడీపీ బాధితుల శిబిరం ఏర్పాటు చేస్తే కరకట్ట నిండిపోతుంది. ఏ నుంచి జెడ్‌ వరకు అన్ని అక్షరాలతో ట్యాక్స్‌లు వసూలు చేశారు. చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు లక్షల కోట్లు దోచుకున్నారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే చాలెంజ్‌ స్వీకరించాలి. బాబుకు నచ్చిన పది గ్రామాలు ఎంచుకోండి. ఆ గ్రామాల్లో టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ చేసిన అరాచకాలపై మాట్లాడుదాం. మీకు ఆ ధైర్యం ఉంటే చాలెంజ్‌ స్వీకరించాలి. 

సీఎం వైయస్‌ జగన్‌ పారదర్శక పాలన అందిస్తున్నారు. చంద్రబాబులా పోలీసులకు పచ్చ చొక్కాలు తొడగలేదు. గత ఐదేళ్ల పాలనలో పోలీసులను చంద్రబాబు టీడీపీ కార్యకర్తలుగా వాడుకున్నారు. గ్యాంగ్‌స్టర్స్, ఫ్యాక్షనిస్టులు అంతా టీడీపీలోనే ఉన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనివ్వకుండా చంద్రబాబు చేస్తున్న కుట్రలన్నీ ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్‌ దోపిడీలన్నీ ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 

నీచ రాజకీయాల కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైయస్‌ వివేకానందరెడ్డిని చంద్రబాబు చంపించారు. గతంలో వంగవీటి రంగాను చంద్రబాబు ఏ విధంగా హత్య చేశాడో హరిరామ జోగయ్య చెప్పారు. ఒక విలేకరుని ఏ విధంగా చంపించావో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. 

వంద రోజుల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు, ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఇంటింటికీ పెన్షన్‌ పంపిస్తున్నారు. పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. పదే పదే కిడ్నీ బాధితుల గురించి మాట్లాడే పవన్‌ ఎందుకు ఇప్పుడు మాట్లాడడం లేదు. ఈ విషయంలో ముఖ్యమంత్రిని అభినందించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం వర్కులు, నామినేటెడ్‌ పదవులు, ఆశా వర్కర్లకు జీతాలు, స్పందన కార్యక్రమ రూపకల్పన, హిందూ దేవాలయాల్లో హిందువులు మాత్రమే పనిచేయాలని ఆదేశం. రివర్స్‌టెండరింగ్‌ చట్టం, తిత్లీ తుఫాన్‌ బాధితులకు పరిహారం, ఇంకా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పారదర్శక పాలన అందిస్తున్నారని గడికోట అన్నారు.

Back to Top