‘స్థానిక’ ఉపఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ జయకేతనం

2 డిప్యూటీ మేయర్, మున్సిపల్‌ చైర్‌పర్సన్, 

3 వైస్‌ చైర్‌పర్సన్, 

 3 ఎంపీపీ, 4 వైస్‌ ఎంపీపీ పదవులు వైయ‌స్ఆర్‌సీపీకే..

అమరావతి: రాష్ట్రంలోని పట్టణ, స్థానిక సంస్థల్లో గురువారం జరిగిన పలు ఉప ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ జయకేతనం ఎగురవేసింది. ఒక మండలాధ్యక్ష పదవికి, మూడు మండల ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారులు వెల్లడించారు. మచిలీపట్నం నగరపాలక సంస్థలో రెండు డిప్యూటీ మేయర్‌ పదవులకు ఎన్నికలు జరిగాయి.
అధికార వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన మాడపాటి విజయలక్ష్మి (26వ వార్డు కార్పొరేటర్‌), సీలం భారతీనాగకుసుమ (మూడో­వార్డు) ఈ పదవుల్ని గెల్చుకున్నారు. పెడన మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన కటకం నాగకుమారి (ఏడోవార్డు కౌన్సిలర్‌) గెలుపొందారు. మాచర్ల మున్సిపాలిటీలో వైస్‌ చైర్మన్‌గా మాచర్ల ఏసోబు (18వ వార్డు) ఎన్నికయ్యారు. ధర్మవరం మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్లుగా వేముల జయరామిరెడ్డి (రెండోవార్డు), షేక్‌ షంసద్‌ బేగం (38వ వార్డు)  గెలుపొందారు.  

13 మండలాల్లో నాలుగు ఎంపీపీ, ఏడు మండల ఉపాధ్యక్ష, మూడు కో–ఆప్షన్‌ సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీటిలో రామకుప్పం (చిత్తూరు జిల్లా) మండలాధ్యక్ష, ఉపాధ్యక్ష పద­వులకు, విజయాపురం (చిత్తూరు), రాయ­దుర్గం (అనంతపురం) మండలాల ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు వాయిదాపడ్డాయి.

తొండంగి (కాకి­నాడ), వత్సవాయి (ఎన్టీఆర్‌), చేజర్ల (నెల్లూరు) మండలాధ్యక్షులుగా, పెదకడబూరు (కర్నూలు), గాలివీడు (అన్నమయ్య), రాపూరు (నెల్లూరు), పార్వతీపురం (పార్వతీపురం మన్యం) మండల ఉపాధ్యక్షులుగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. చిత్తూరు (చిత్తూరు), రాజంపేట (అన్నమయ్య), బి.­మఠం (వైయ‌స్ఆర్ జిల్లా) మండలాల్లో కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక పూర్తయింది.

తాజా వీడియోలు

Back to Top