అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ఆర్‌సీపీ ప్రభంజనం ఖాయమని టైమ్స్‌నౌ–ఈటీజీ సర్వే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ విజయం సాధిస్తుందని పేర్కొంది. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలున్న సంగతి తెల్సిందే. అంటే వైయస్ఆర్‌సీపీ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుందని ఈ సర్వే వెల్లడించింది. పేదలకు ఆలంబనగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి నేరుగా అందుతున్న నగదు, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన.. జనాదరణను మరింతగా పెంచాయని వైయస్ఆర్‌సీపీ నమ్ముతోంది. అందుకే 175 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించడం అసాధ్యమేమీ కాదని ఆ పార్టీ ముందు నుంచీ చెబుతోంది. తమకు క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసు కాబట్టే ‘వైనాట్ 175’ అంటున్నామని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం అప్రతిహతంగా కొనసాగనుందని ప్రముఖ వార్తా చానల్ టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే పార్టీ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని పేర్కొంది. వైయస్ఆర్‌సీపీ 24 నుంచి 25 స్థానాలు గెలుస్తుందని టౌమ్స్ నౌ–ఈటీజీ చేసిన సర్వే తేల్చింది. ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలున్న విషయం తెలిసిందే.