తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి విధ్వంస పాలన మొదలైంది. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తెల్లవారకముందే కూల్చివేశారు. ఉదయం 5:30గంటల సమయంలో కూల్చివేత ప్రారంభించారు. ప్రొక్లెయిన్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేశారు. శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. కూల్చివేతకు సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ నిన్న హైకోర్టును ఆశ్రయించిన వైయస్ఆర్ సీపీ. చట్టాన్ని మీరి వ్యవహరించ వద్దని హైకోర్టు ఆదేశం. సీఆర్డీయే కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలను వైయస్ఆర్ సీపీ న్యాయవాది తెలిపారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైయస్ఆర్ సీపీ కార్యాలయ భవనాన్ని కూల్చివేత. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామంటున్న వైయస్ఆర్ సీపీ. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయం కూల్చివేతపై ఆ పార్టీ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. చంద్రబాబు దమనకాండ మరో స్థాయికి చేరిందంటూ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన @YSRCParty కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు @YSRCParty తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు. మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుకి చురకలు అంటించారు. సూపర్ సిక్స్ అమలు కన్నా.. వైయస్ఆర్‌సీపీ ఆఫీసులను కూల్చడమే ఆయన ముఖ్యమని భావిస్తున్నారా?. ఇంతకీ చంద్రబాబు ప్రజాస్వామ్యవాదా? విధ్వంసకారుడా? అని ఎక్స్‌లో అంబటి సందేశం ఉంచారు.