తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి దెబ్బకు ఢిల్లీలో తన పెద్దమ్మ పురంధేశ్వరిని వెంట పెట్టుకొని అందరి కాళ్లు పట్టుకున్న వ్యక్తి లోకేష్. విద్యాశాఖ మంత్రిగా వంద శాతం ఫెయిల్ అయ్యారు. జగన్ గారు, మీరు బోత్ కెనాట్ బి సేమ్. జగన్ గారు ఓటమి ఎరుగని నాయకుడు.. నీవు పోటీ చేసిన మొదటిసారే మంగళగిరిలో చిత్తుగా ఓడిపోయావు. కూటమి నేతల కాళ్లు పట్టుకుంటే కానీ ఎమ్మెల్యే కాలేని వ్యక్తివి నీవు. కానీ వైయస్ జగన్ తన సొంత సత్తాతో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న నాయకుడు. వైయస్‌ఆర్ ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైయస్సార్‌సీపీ అయితే.. వైశ్రాయ్ హోటల్‌లో వెన్నుపోటుతో పుట్టిన పార్టీ టీడీపీ. పేద విద్యార్థుల కోసం 43 వేల పాఠశాలల్లో నాడు–నేడు పనులు చేసి విద్యా వ్యవస్థను మార్చిన నాయకుడు జగన్. కానీ రెండేళ్లలో ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి చేయలేని దద్దమ్మ లోకేష్. సీఎం అయిన మూడు నెలల్లోనే 1.20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ గారిది. కానీ 15 వేల టీచర్ పోస్టుల డీఎస్సీని కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థ మంత్రి లోకేష్. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ, ఐబీ, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పేద పిల్లలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన నాయకుడు జగన్. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని తొలగించి పిల్లలకు బొద్దింకల భోజనం పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే జగన్‌గారు, నారా లోకేష్.. బోత్ కెనాట్ బి సేమ్’. అందుకే ఇకనైనా వాస్తవాలు గుర్తించండి. పిచ్చి విమర్శలు, నిందలు మానండి. జగన్ గారిపై అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మా పాలనలో రెండేళ్లకే ఇంటింటికీ వెళ్లి చేసిన పనులు చెప్పాం. ఇప్పుడు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్‌లెట్‌తో ప్రజలకు కూటమి మోసాలను వివరిస్తున్నాం. మీకు దమ్ముంటే మీరు కూడా ఇంటింటికీ వెళ్లి ఏం చేశారో చెప్పండి అని వైయస్ఆర్‌సీపీ సవాల్ చేశారు. డీఎస్సీలో అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు వైయస్ఆర్‌సీపీ హితవు పలికింది. చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. పూర్తి మెరిట్ జాబితాను విడుదల చేసి డీఎస్సీ ఆశావహులకు నిజాయితీగా సమాధానం చెప్పాలే తప్ప డైవర్షన్ పాలిటిక్స్, వ్యక్తిగత దూషణలు చేస్తే సమాజం హర్షించదని హెచ్చరించింది. ఈ మేరకు వైయస్ఆర్‌సీపీ గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ పోస్టు చేసింది. డీఎస్సీ కుంభకోణంపై ప్రశ్నలకు లోకేశ్ ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారని నిలదీసింది. ‘వెబ్‌సైట్ నుంచి మెరిట్ జాబితాను ఎందుకు తొలగించారు?, పారదర్శకత లేకుండా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను ఎందుకు ఇచ్చారు?, రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఎందుకు నిరసన తెలుపుతున్నారు?’ అంటూ చురకలు అంటించింది. ‘మిమ్మల్ని (లోకేశ్‌ను) ఇంటర్మీడియెట్ పాస్ చేయించడానికి ఇప్పటి మంత్రి నారాయణ పడ్డ కష్టాలు అందరికీ తెలిసినవే. ఆ రోజుల్లో మీకోసం నారాయణ పడ్డ కష్టం వల్లే ఇప్పటికే మీమధ్య అనుబంధం అంత బలంగా ఉందనేది తెలిసినవారు అందరూ చెప్పుకుంటారు. అంతేకాదు.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మీరు తీసుకున్న డిగ్రీ వెనుక ఒక పారిశ్రామికవేత్తనుంచి తీసుకున్న ముడుపుల కథ ఉందని మర్చిపోకండి. ఆ రోజుల్లో ఆ ముడుపులను మీ ఫీజులు రూపంలో చెల్లించిన వాస్తవ కథ తెలుగు ప్రజలకు ఇంకా గుర్తు ఉంది. అలాంటి మీరు డిగ్రీల గురించి, పరీక్షల గురించి చెబితేం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది’ అని లోకేశ్ వ్యవహర శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడింది.