టార్గెట్‌ పిన్నెల్లి.. 

వైయ‌స్ఆర్‌సీపీ తీవ్ర ఆందోళన

ప‌ల్నాడు: నాలుగు సార్లు ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ప్రాణాలకు రక్షణ కరువైంది. ఒక కేసు నుంచి ఊరట దొరికిందని అనుకునేలోపు.. మూడు తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌ చేసే యత్నాలు చేస్తున్నారు. అం‍తేకాదు సదరు ఎమ్మెల్యేను హతమార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది వైయ‌స్ఆర్‌సీపీ. 

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఒకదాని వెంట ఒకటి వరుస కేసులు పెడుతున్నారు పోలీసులు. ఇప్పటికే ఈవీఎం ఘటన కేసులో హైకోర్టు ఆయనకు ఊరట లభించగా.. ఆయన్ని ఎలాగైనా అరెస్ట్‌ చేయాలని కంకణం కట్టుకున్న పోలీసులు మరో మూడు హత్యాయత్నం కేసులు పెట్టారు. అయితే ఈ పరిణామాలపై వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏదో ఒకలా ఆయన్ని హతమార్చేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ఇదంతా అని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా చెలరేగిన హింసాత్మ ఘటనలను.. తదనంతర పరిణామాలను చూసిన ఎవరికైనా కొన్ని అనుమానాలు రావడం సహజం. అటు ఎన్నికల సంఘం, ఇటు పోలీస్‌ శాఖ ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి అనుబంధ సంఘాలుగా మారాయి ఏమో అనిపించకమానదు. దీనికి తోడు పిన్నెల్లిని లక్ష్యంగా చేసుకుని పచ్చ బ్యాచ్‌ పన్నుతున్న కుట్రలు చూస్తున్నదే. అయితే దీని వెనుక కుట్ర జరుగుతోందని వైయ‌స్ఆర్‌సీపీ అనుమానిస్తోంది. సీఐ నారాయణస్వామిచౌదరి ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపిస్తోంది. 

వైయ‌స్ఆర్‌సీపీ సూటి ప్రశ్నలు

మాచర్లలో ఎన్నికల హింసకు సంబంధించి ఎస్సీ, డీఎస్పీ, ఎస్సై సస్పెండైనా ఐజీ త్రిపాఠీకి సన్నిహితుడైన సీఐ నారాయణస్వామిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. 

గతంలో కారంపూడి ఎస్సైగా ఉన్నప్పుడు అత్యంత వివాదాస్పంగా వ్యవహరించి సస్పెన్షన్‌కు గురైన నారాయణస్వామిని సీఐగా ఎలా నియమిస్తారు? 

ఆయన వ్యవహార శైలిపై గత నెల(ఏప్రిల్‌) 8నే ఎమ్మెల్యే పిన్నెల్లి ఫిర్యాదు చేసినా ఈసీ ఎందుకు పట్టించుకోలేదు? 

ఎన్నికల వ్యవస్థ, పోలీసు వ్యవస్థలు టీడీపీకి లొంగిపోయాయేమో అనిపిస్తోంది. పిన్నెల్లిపై కక్ష కట్టి తప్పుడు కేసులు బనాయిస్తున్నాయి :వైయ‌స్ఆర్‌సీపీ  

ఎమ్మెల్యే పిన్నెల్లికి ఏదైనా హాని జరిగితే సీఐ నారాయణస్వామి, ఐజీ త్రిపాఠిదే బాధ్యత అని ఇప్పటికే స్పష్టం చేసింది. పోలీస్‌ వ్యవస్థకు మాయని మచ్చలా కొందరు అధికారులు తయారు అయ్యారని, వైఎస్సార్‌సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని, టీడీపీ కూటమికి కొమ్ము కాస్తున్న అధికారులు జూన్‌ 4 ఎన్నికల పలితాల మూల్యం చెల్లించుకోక తప్పదని సున్నితంగా హెచ్చరిస్తోంది కూడా.

Back to Top