అంద‌రి మాట..మళ్లీ వైయ‌స్ జగనే ముఖ్య‌మంత్రి 

‘జగనన్నే మా భవిష్యత్తు’కు విశేష స్పంద‌న‌

ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లకు ఘన స్వాగతం  

వైయ‌స్ జ‌గ‌న్‌కు మద్దతుగా 63 లక్షల మిస్డ్‌ కాల్స్‌ 

ఈ నెల 29 వరకు  కార్యక్రమం పొడిగింపు

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రతి ఊళ్లోనూ సందడి నెలకొంది. మ‌ళ్లీ రాష్ట్రానికి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావాల‌ని ప్ర‌తి ఒక్క‌రి నోటా వినిపిస్తోంది. 
సీఎం వైయ‌స్ జగన్‌ ప్రతినిధులుగా వచ్చిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లకు ప్రజలు చిరునవ్వుతో స్వాగతం పలుకుతున్నారు. పలు చోట్ల ఎదురువెళ్లి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల వద్దకే ఎమ్మెల్యే రావడం అంటే అది కేవలం ఒక్క సీఎం జగనన్న వల్లే సాధ్యమైందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తు­న్నారు.

నాలుగేళ్లలో ఏ మేరకు లబ్ధి కలిగిందో ప్రజలే ఆనందంగా నేతలకు వివరిస్తుండటం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అందరి బాగు కోరుకుంటున్న జగనన్ననే మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామని అన్న­దమ్ములు, అక్కాచెల్లెళ్లు, అవ్వాతాతలు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌ 7వ తేదీన ’జగనన్నే మా భవిష్యత్తు’ పేరుతో మెగా పీపుల్స్‌ సర్వే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలు వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ప్రజా మద్దతు సర్వే ద్వారా నమోదు చేస్తున్నారు. ఏప్రిల్‌ 18 నాటికి ఏకంగా 63 లక్షల మంది 82960 82960 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి మద్దతు తెలిపారు.   

ఈ నెల 29 వరకు ప్రచార కార్యక్రమం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన, సీఎం వైయ‌స్‌ జగన్‌ పాలన పట్ల విశేష సానుకూలత నేపథ్యంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమాన్ని ఈ నెల (ఏప్రిల్‌) 29వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు  వైయ‌స్ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మెగా సర్వే ఫలితాలను కూడా అదే రోజున ప్రకటించనున్నారు.

నెల్లూరు జిల్లాలో..
పొదలకూరు మండలం మరుపురు గ్రామం లో  మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం నిర్వ‌హించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డికి గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. మ‌ళ్లీ జ‌గ‌న‌న్నే ముఖ్య‌మంత్రిని చేసుకుంటామ‌ని నిన‌దించారు.

నంద్యాల జిల్లా..
శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాల మేరకు వెలుగోడు ప‌ట్ట‌ణంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం నిర్వ‌హించారు. 4వ సచివాలయం ప‌రిధిలోని ఎస్సీ కాలనీలో మేజర్ సర్పంచ్ వేల్పుల జయపాల్ , ఎంపీటీసీలు బాష, రాజేష్, స‌చివాల‌య క‌న్వీన‌ర్ ఏర్వ.శ్యామలమ్మ ఆధ్వ‌ర్యంలో ఇంటింటా ప‌ర్య‌టించి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రించారు.   

తాజా వీడియోలు

Back to Top