వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా విధ్వంసాలు 

కొనసాగుతున్న టీడీపీ దౌర్జన్యకాండ .. 

చంద్రబాబు, లోకేశ్‌ల అండతో రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులు

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చంపుతామని బెదిరింపు.. ఊరొదిలి వెళ్లాలని పోలీసుల ఉచిత సలహా

పట్టపగలు అందరూ చూస్తుండగానే గ్రామాల్లో దాడులు

తెనాలిలో, సత్తెనపల్లి మండలంలో ఇద్దరు నేతలపై హత్యాయత్నం

టీడీపీ దౌర్జన్యాలు, విధ్వంసాలపై నేడు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్న వైయ‌స్ఆర్‌సీపీ

ఢిల్లీ చేరుకుని అపాయింట్‌మెంట్‌ కోరిన ఎంపీల బృందం

జాతీయ మీడియాకు ఏపీలో పరిస్థితిని వివరించనున్న ఎంపీలు

రాష్ట్రంలో బీభత్సకాండపై సుప్రీంకోర్టు తలుపు తట్టిన వైయ‌స్ఆర్‌సీపీ

హైకోర్టుకు వెళ్లాలని సూచన.. పిటిషన్‌ దాఖలు.. 13న విచారణ

 అమ‌రావ‌తి: రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. వారం రోజు­లుగా జరిగిన వందలాది ఘటనల్లో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు తీవ్ర గాయాలపాలయ్యారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలను లక్ష్యంగా చేసు­కుని విధ్వంసం సృష్టిస్తున్నారు. శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ.. వైయ‌స్ఆర్ విగ్రహాలను కూలదోస్తున్నారు. పోలింగ్‌ ముగిసినప్పటి నుంచి దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలు మొదలైనప్పటికీ.. ఫలితాల వెల్లడి తర్వాత పరిస్థితి శ్రుతిమించి పోయింది.  

ఎక్కడికక్కడ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను దారి కాచి దాడులు చేస్తున్నారు. గ్రామాల్లో ఇళ్లలోకి దూరి కొడుతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీకి ఓటు వేశారన్న అనుమానంతో సామాన్యులను సైతం కక్ష సాధింపుతో వేధిస్తున్నారు. ‘ఇదేం అన్యాయం.. కాపాడండయ్యా..’ అంటూ బాధితులు పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీస్తున్నా.. ఆ ఖాకీలు మాత్రం వృత్తి ధర్మాన్ని మరచి చోద్యం చూస్తున్నారు. తాజాగా అనంతపురంలో హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను చంపుతామని బెదిరించారు.

ఊరు వదిలి వెళ్లాలని సాక్షాత్తు పోలీసు అధికారులే ఉచిత సలహా ఇస్తుండటం నివ్వెరపరుస్తోంది. తెనాలిలో వైయ‌స్ఆర్‌సీపీ నేత కాళిదాసు సత్యంపై, పల్నాడు జిల్లా బట్లూరులో ఆర్‌ఎంపీ వైద్యుడు శివయ్యపై హత్యా­యత్నం చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న టీడీపీ నేతలు, కార్యకర్తల అరాచకం.. దౌర్జన్యం.. కనుసైగ చేసి దాడులను ప్రోత్సహిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్‌ల తీరుపై రాష్ట్రపతికి నివేదించాలని వైయ‌స్ఆర్‌సీపీ నిర్ణయించింది. 

ఇందులో భాగంగా పార్టీ ఎంపీల బృందం మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకుంది. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ కోరింది. రాష్ట్రంలో విధ్వంసకాండ గురించి బుధవారం జాతీయ మీడియాకు కూడా వివరించనుంది. ఇదే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించగా, హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఆ మేరకు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నెల 13న ఈ పిటిషన్‌ విచారణకు రానుంది.    

 

కొనసాగుతున్న శిలాఫలకాల ధ్వంసం 

Jangareddygudem Municipality Lighting Board destroyed

 రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తల విధ్వంసకాండ కొనసాగుతోంది. పలుచోట్ల మంగళవారం ఇష్టారీతిన వ్యవహరించారు. పలు ప్రభుత్వ కార్యాలయాలపై పేర్లను తొలగించారు. ప్రగతిపనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. అధికారం పార్టీ ఆగడాలతో ప్రజలు భయపడుతున్నారు.  

» జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ కార్యాలయ లైటింగ్‌ సైన్‌ బోర్డును ధ్వంసం చేశారు. నూతనంగా ని­రి్మంచిన జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ కార్యాలయా­నికి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మున్సిపల్‌ కార్యాలయంగా పేరును నిర్ధారిస్తూ లైటింగ్‌ నే­మ్‌ బోర్డును కార్యాలయ భవనంపై ఏర్పాటు చేశా­రు. ఈ లైటింగ్‌ బోర్డును టీడీపీ మండల క­మి­టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, మ­రో ఎనిమిదిమంది ధ్వంసం చేశారు. నిచ్చెన­లు వేసుకుని కర్రలతో కొట్టి ధ్వంసం చేయగా, నేల­రాలిన అక్షరాలతో ఆ ప్రాంతం చిందర వందర­గా తయారైంది. ఘటనపై మున్సిపల్‌ కార్యా­ల­య మేనేజర్‌ కె.వి.రమణ పోలీసులకు ఫిర్యా­దు చేశారు.  

» దెందులూరు మండలం పోతునూరులోని సచివాలయం, రైతుభరోసా కేంద్రం, రోడ్డు వద్ద ఉన్న శిలాఫలకం, చల్లచింతలపూడిలోని సచివాలయం వద్ద నవరత్నాలతో ఉన్న బోర్డులను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ సంఘటనల్ని పోతునూరు సర్పంచ్‌ బోదుల స్వరూప్, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత డి.ఎన్‌.వి.డి.ప్రసాద్‌ తప్పుబట్టారు.  

»  తిరుపతిలో ఒక శిలాఫలకంపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పేరును కొందరు ధ్వంసం చేశారు. తిరుపతి నగరంలో గతంలో ఎమ్మెల్యే హోదాలో భూమన కరుణాకర్‌ రెడ్డి ఆవిష్కరించిన శిలాఫలకాన్ని మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధి చేసిన భూపిరాట్టి మార్గాన్ని గత ఏడాది నవంబర్‌ 26వ తేదీన అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నగర మేయర్‌ డాక్టర్‌ శిరీషతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకంపై భూమన కరుణాకర్‌రెడ్డి పేరును కొందరు ధ్వంసం చేశారు.  

» శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం ఆత్మకూరు పంచాయతీలో నిరి్మంచిన రైతుభరోసా కేంద్రం వద్ద శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. గది తాళాన్ని పగలగొట్టి లోపల ఉన్న ఫ్యాన్‌ను అపహరించారు. టీడీపీ కార్యకర్తలు ఈ పనిచేసి ఉండొచ్చని, దీనిపై ఫిర్యాదు చేస్తామని కాంట్రాక్టర్‌ తెలిపారు. మండలంలో గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని వైఎస్సార్‌సీపీ కనీ్వనర్‌ పోతురాజు, జేసీఎస్‌ కనీ్వనర్‌ ధనకోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.  

»  బాపట్ల జిల్లా వేమూరు బస్టాండ్‌ సెంటర్‌లోని నవరత్నాల స్థూపాన్ని టీడీపీ దుండగులు సోమవారం అర్థరాత్రి కూల్చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో నవరత్న పథకాలు ప్రజలకు గుర్తుండేలా వేమూరు బస్టాండ్‌ సెంటరులో పంచాయతీ అనుమతితో స్థూపం నిర్మించారు. ఈ నెల 7వ తేదీన స్థూపం కూల్చేసేందుకు జేసీబీతో ప్రయత్నించారు.

 సిమెంట్‌ కాంక్రీట్‌తో గట్టిగా నిరి్మంచడం వల్ల జేసీబీ వల్ల కాలేదు. పంచాయతీ అధికారులు, ఎంపీడీవో దగ్గర ఉండి, స్థూపంపై ఉన్న  శిలాఫలకాలు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, నందిగం సురే‹Ù, మేరుగ నాగార్జున బొమ్మలను పూర్తిగా తొలగించారు. తిరిగి సోమవారం రాత్రి యంత్రాన్ని తీసుకొచ్చి స్థూపాన్ని పూర్తిగా తొలగించారు. తెల్లవారుజామున సెంటరుకు వచ్చిన ప్రజలు స్థూపం కూలి్చవేసి ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు.  

»చిత్తూరు జిల్లా చౌడేపల్లె ప్రవేటు బస్టాండు ప్రాంతంలో ఏర్పాటుచేసిన వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మె­ను గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి తొలగించారు. కూడలి సమీపంలో ఏర్పాటుచేసిన జెండా దిమ్మెను జేసీబీ సహాయంతో పెకలించినట్లు వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. ఈవిషయమై  పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు  చెప్పారు.  

»  అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో శృంగవరం గ్రామ సచివాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. సచివాలయంపై ఉన్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ బొమ్మలతో పాటు నవరత్నాల పోస్టర్‌ను «ధ్వంసం చేశారు. ఈ విధ్వంసం హేయమైన చర్య అని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యవర్గసభ్యుడు, సర్పంచ్‌ భర్త ఉలబాల శ్రీనువాసు పేర్కొన్నారు. కోర్టు వివాదంలో ఉన్న ప్రభుత్వ భవనం తాళం విరగొట్టి టీడీపీ కార్యకర్తలు ప్రవేశించటం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని చెప్పారు.  

Back to Top