ఇది సంక్షేమ పథకాల 2020

అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 90 శాతం హామీలు అమలు

దేశానికే దిక్సూచిగా సీఎం వైయస్‌ జగన్‌

సుపరిపాలనను చూసి ఓర్వలేకపోతున్న ప్రతిపక్ష పార్టీలు

అమరావతి:  వైయస్‌ జగన్‌ అనేనేను...ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ... అని మే 30న ప్రమాణం చేసిన రోజు నుంచి గడిచిన కాలం కేవలం తొమ్మిదినెలల కాలం. ఆరోజు నుంచి ఈ రోజు దాకా...ఇలా ప్రతిరోజు ప్రజాసంక్షేమపథకాల ప్రస్తావనే. హామీల అమలుకు తిరుగులేని దీక్షతో కృషి చెయ్యడమే. వైఎస్‌ జగన్‌ సంకల్పబలం...ప్రజలకు మంచి చేసి తీరాలనే పట్టుదల కారణంగా అనితరసాధ్యమైన పథకాలు..ఆంధ్రప్రదేశ్‌లో ఆచరణలోకి వచ్చేశాయి. వస్తున్నాయి. ఈదేశ చరిత్రలోనే ఇంత స్వల్పకాలంలో, ప్రజలకోసం రాజీలేని ధోరణిలో..వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ పోవడం నిజంగా కొత్తచరిత్రే. అంగీకరించి తీరాల్సిన పరిస్థితే.
వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన రోజున రాష్ట్రపరిస్థితుల గురించి తెలియనివారు లేరు. ఆ అప్పుల ఊబి గురించి చెబితే చర్వితచర్వణమే అవుతుంది. ఆర్థికంగా ఊపిరితీసుకోనివ్వని ఉక్కిరిబిక్కిరితనం మధ్య ...జగన్‌ రాష్ట్రపాలన మొదలయింది. అప్పుల భారం తలచుకుంటూ...బాబు పాలనను విమర్శిస్తూ పోతే కాలం గడిచిపోతుంది. చెప్పేది నిజమే కాబట్టి, ప్రజలు ఓపిగ్గానే వినేవారు. అర్థం చేసుకునేవారు. కానీ అలా చేస్తే వైఎస్‌ జగన్‌ ఎలా అవుతారు. దేవుడి పట్ల అపారవిశ్వాసం ఉన్న వ్యక్తి. ప్రజల పట్ల అంతులేని ప్రేమాభిమానాలు పెంచుకున్న నాయకుడు. నిరంతరం ప్రజల ఆశీస్సులు కోరుకునేవాడు. ప్రజలతో మమేకమైపోయిన జీవితం. తనకు, ప్రజలకు మధ్య విడదీయరాని బంధాన్ని ముడివేసుకున్నవాడు. రాజకీయనాయకుల్లో తనో స్పెషల్‌.
క్రికెట్లో టెస్ట్‌ మ్యాచ్‌ అంత సుదీర్ఘబాధలు చూశాడు. కష్టాలు పడ్డాడు. కుట్ర, కుతంత్రాలకు లోనయ్యాడు. అయినా, బౌన్సర్లు, బాడీలైన్‌ బౌలింగుల అరాచకాలను తట్టుకుంటూనే..హెల్మెట్‌ లేMýంండానే బ్యాటింగ్‌ చేసిన బ్యాట్‌మన్‌ నిలిచాడు. కష్టాల కొలిమిలో రాటు దేలినవాడు కాబట్టి, ఆ బాధలు ఇతరులు పడితే తట్టుకోలేని మనస్తత్వం అబ్బింది. బంగారంలా పుటం తేలాడు కాబట్టే...బంగరు మనసుతో ప్రజలందరి మంచికోరే నాయకుడిగా మారాడు.
ఇలా చెప్పుకుంటూపో..జగన్‌ తన టెన్‌ ఇయర్స్‌ రాజకీయపోరాటచరిత్ర నిజంగా ఈకాలచరిత్రలో ఓ గొప్ప అధ్యాయమే. ఓరకంగా స్పూర్తిదాయకమే. అందుకే జగన్‌ అంటే జనం. జనమంటే జగన్‌లా ఇప్పుడు కొత్త దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. యువతరానికి ఓ ఇన్సిపిరేషన్‌ నిలుస్తున్నాడు. సమాజంలోని అన్నివర్గాల ప్రజల నమ్మకాన్ని చూరగొన్న నాయకుడిగా ఎదుగుతున్న జగన్‌ పాలనలో సంక్షేమ పథకాల వేగం అంతా ఇంతాకాదు. అది టీ ట్వంటీ మ్యాచ్‌ను తలపిస్తున్న తరహాలో సాగుతోంది. ఆ మ్యాచ్‌లో ప్రేక్షకుల్లో అంతులేని  ఉద్వేగాలను, సంతోషాతిశయాలను నింపినట్టే...జగన్‌ పాలనలో సంక్షేమ పథకాల అమలు ప్రతి మొహంలోనూ ఓ భరోసా అయి మెరుస్తోంది. ఓ ధైర్యమై కనిపిస్తోంది. ఓ స్థైర్యమై ముందుకు నడిపిస్తోంది. సంక్షేమపథకాల ఆనందతాండవం వెల్లివిరుస్తోంది.
అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ధైర్యంగా జనాన్ని అడుగుతున్నారు. తాను ఎనిమిదినెలల్లోనే చేసిన పథకాల గురించి అడుగుతున్నారు.
మంచి పనులు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు 
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి, ప్రతి సామాజిక వర్గానికి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా దేవుని ఆశీస్సులతో మంచి చేస్తున్నాం. మంచి పరిపాలన చేస్తున్నపుడు సహజంగా ఓర్చుకోలేని వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. చంద్రబాబు మాటలు విన్నప్పుడు అలాగే అనిపిస్తుంది. ఆయనకు ఎంతటి కడుపు మంట ఉంటుందో అందరూ అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి మనుషుల్ని మహానుభావులుగా చూపించే కొన్ని చానెళ్లు, పత్రికలు ఉన్నాయి. వీరిని బాగుచేసే మందులు ఎక్కడా లేవు. వీటన్నింటి మధ్య  నిజాయితీతో పని చేస్తున్న ముఖ్యమంత్రికి అందరం తోడుగా నిలవాలి.

అవ్వాతాతలూ పెంచిన పెన్షన్‌ అందుతోందా? ఇంటి దగ్గరకే వస్తోందా?..అక్కాచెల్లెమ్మలకు అమ్మ ఒడి డబ్బులు అందాయా?అన్నదమ్ముళ్లకు రైతు భరోసా డబ్బులు అందాయా..ఆటో, ట్యాక్సీ డ్రైవర్‌ అన్నలకు రూ.10 వేలు ముట్టాయా..అంటూ అడకకుండానే డబ్బులు ఇచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకునే మొట్ట మొదటి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక్కరే అని చెప్పడంలో అతిశయోక్తి  లేదు.
 

Back to Top