ఇసుక కొరత - వాస్తవాలు

రాష్ట్రంలో ఇసుక కొరత ఉండటం పూర్తి అవాస్తవం కాదు. అయితే నిర్మాణ రంగానికి సరిపడా పూర్తి ఇసుక లభ్యత అనేది రాష్ట్రంలో గతంలోనూ లేదు.ఇసుక సరఫరా విషయంలో జిల్లాల వారీగా తేడాలు ఉంటాయి.
2015లో గత ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం చూస్తే ఆ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. తూగో,పగో జిల్లాల్లో ఇసుక ఆర్డర్ ను 20%, కడపలో 38%, విశాఖలో 20%  వేగంగా తీర్చలేక పోయినట్టు నివేదిక తెలియజేస్తోంది.

నేటి కొరతకు ప్రధాన కారణం
దాదాపు 10 సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు లేవు. పెద్దగా వరదలు వచ్చిన దాఖలాలూ లేవు. అందువల్లే రాష్ర్టంలో అత్యధికంగా ఇసుకను అందించే నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదులకు వరదలు లేవు ప్రవాహం ఎక్కవగా లేని నదుల నుంచి ఇసుకను ఇష్టానుసారం బ్లాక్ లో అమ్ముకుంది గత టీడీపీ ప్రభుత్వం. నేడు వర్షాలు, వరదలు అధికం అయ్యాయి.రాష్ట్రంలో ప్రతి నదీ ప్రవాహంతో ఉరకలు వేస్తోంది. అలాంటప్పుడు నదుల్లోకి వెళ్లి ఇసుకను తెచ్చే పరిస్థితి అసంభవం ఇప్పటికే పదుల సంఖ్యలో వరదలు ముంచెత్తడంతో నదీతీరాలకు ఇసుక చేరవేయడం వీలు పడటం లేదు. నిండుకుండల్లా ఉన్న చెరువులు  కుంటలు, కాల్వలు, చెరువులు నిండి ఇసుక తవ్వకానికి ఆటంకంగా ఉన్నాయి

పరిష్కారం
వరద తగ్గుముఖం పట్టిన వెంటనే రీచ్ లు పెంచారు  ఒక్క కృష్ణా నదివద్దే 10 ఇసుక రీచ్ లు, 10 డంపింగ్ యార్డులు గుర్తించారు. ప్రతి 15 రోజులకూ ఇసుకపై సమీక్ష చేసి అవసరం మేరకు అందుబాటులోకి తెస్తున్నారు మరోపక్క ఇసుక అక్రమ రవాణా అడ్డుకుంటున్నారు జిల్లాలు, రాష్ట్రాలు దాటకుండా చూసుకుంటున్నారు దీపావళి నాటికి ఇసుక కొరత పూర్తి స్థాయిలో తీరిపోతుందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రానికి నిర్మాణ రంగం ఎంత ముఖ్యమో, వ్యవసాయ రంగమూ అంతే ముఖ్యం. సమృద్ధిగా ఉన్న వర్షాలు, నీటి వనరులు, పెరిగిన భూగర్భ జలాలతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది.
మున్ముందు ఇసుక సమస్యలూ తీరిపోతాయి.

Read Also: మీరే రేపటి "ఏపీ బ్రాండ్‌' క్రియేటర్

Back to Top