రెడ్డి కాంగ్రెస్ పేరుతో బాబు అస‌త్య ప్ర‌చారం

 

ఎప్పుడూ అబ‌ద్ధాల‌తో, వంచ‌న‌తో రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఏమార్చ‌డం చంద్ర‌బాబు అల‌వాటు. ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెప్పి ప్ర‌తిప‌క్షంలో కూర్చోబెట్టినా ఆయ‌న బుద్ధిలో మార్పు రాలేదు. ప్ర‌తిప‌క్ష నేత‌గా శాస‌న స‌భ‌లో హుందాగా వ్య‌వ‌హ‌రించ‌డం లేక‌పోగా మ‌ళ్లీ వైఎస్ కుటుంబంపై, వైఎస్సార్ పై అబ‌ద్ధ‌పు ప్ర‌చారాలు చేస్తూనే ఉన్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి రెడ్డి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ లోకి మారారంటూ ప‌చ్చి ప‌చ్చ ప్ర‌చారానికి తెగ‌బ‌డ‌టం చూస్తే 40 ఏళ్ల అనుభ‌వం, ఇర‌వైఏళ్ల అధికారం ఏవీ చంద్ర‌బాబుకు జ్ఞానాన్నైతే ఇవ్వ‌లేద‌ని రుజువైంది. 

రెడ్డి కాంగ్రెస్ అనే పేరు ప‌చ్చ నేత‌ల కుట్ర‌

1970వ ద‌శ‌కంలో జ‌రిగిన వివిధ ప‌రిణామాలు తెలుసుకుంటే చంద్ర‌బాబు పుట్టించిన రెడ్డి కాంగ్రెస్ అనేది ఎంత అబ‌ద్ధ‌మో క్లియ‌ర్ గా అర్థం అవుతుంది. ఇందిరాగాంధీ హ‌యాంలో దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించి 1977లో దాన్ని ఎత్తేసారు. ఆ త‌ర్వాత జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ 153 స్థానాలకు ప‌రిమితం కాగా జ‌న‌తా పార్టీ 295 స్థానాలు గెలుపొంది ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌ర్వాత కాంగ్రేసేత‌ర ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌టం బ‌హుసా అదే తొలిసారి. 1977 మే 6న కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక‌లు జ‌రిగాయి. అప్ప‌టికే ఓట‌మి చ‌విచూసిన కాంగ్రెస్ పార్టీలో వ‌ర్గ‌పోరు మొద‌లై తారాస్థాయికి చేరి ఉంది. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి జ‌రిగిన ఆ ఎన్నిక‌ల్లో ఇందిరా గాంధీ అనుచ‌రుడు, ఎమ‌ర్జెన్సీ విధించాల‌నే స‌ల‌హా ఇచ్చిన సిద్ధార్థ శంక‌ర్ రాయ్ ను కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి ఓడించారు.  ఇందిరా, కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి మ‌ధ్య విబేధాల‌తో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. హేమాహేమీలైన నాయ‌కులంతా కాసు వ‌ర్గంలో ఉండిపోయారు. 1978 జ‌న‌వ‌రిలో ఇందిర వ‌ర్గీయులు ప్ర‌త్యేకంగా భేటీ అయి ఆమెను పార్టీ అధ్య‌క్షురాలిగా ఎన్నుకున్నారు. ఆ మ‌రునాడే కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి ఇందిరా గాంధీతో స‌హా ఆ వ‌ర్గీయులంద‌రినీ పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు. కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి వ‌ర్గంగా ఉన్న పార్టీని రెడ్డి కాంగ్రెస్ అని పిలిచేవారు.కొద్దిరోజుల‌కే ఇందిరాగాంధీ త‌న సొంత వ‌ర్గంతో కాంగ్రెస్ (ఐ) అనే కొత్త పార్టీ స్థాపించారు. దాన్ని ఇందిరా కాంగ్రెస్ అని ప్ర‌చారం చేసారు. అప్ప‌టికి ఉమ్మ‌డి కాంగ్రెస్ గుర్తు అయిన ఆవు దూడ గుర్తు కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న ఉన్న కాంగ్రెస్ కు ద‌క్క‌గా, ఇందిరా కాంగ్రెస్ కు హ‌స్తం గుర్తు ల‌భించింది. 1978 లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ తో పాటు ఆరు రాష్ట్రాల‌కు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌య్యింది. ఆ ఎన్నిక‌ల్లో కాసు బ్ర‌హ్మాంన‌ద‌రెడ్డి ఆవుదూడా గుర్తు కాంగ్రెస్ కు 30 స్థానాలు మాత్ర‌మే వ‌చ్చాయి. జ‌న‌తా పార్టీకి 60 స్థానాలు ద‌క్కాయి. స్థాపించి 2 నెలలు కూడా కానీ ఇందిరా కాంగ్రెస్ 175 సీట్లు గెలుచుకుంది. 1980 లోక్ స‌భ ఎన్నిక‌ల నాటికి ఈసీ ఇందిరా కాంగ్రెస్ నే అస‌లైన కాంగ్రెస్ గా గుర్తించింది. కాసు అధ్య‌క్ష‌త‌న ఉన్న కాంగ్రెస్ ఇందిర స్థాపించిన కాంగ్రెస్ లో విలీనం అయ్యింది. 

కొస‌మెరుపు

1978లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టారు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి. కాసు బ్ర‌హ్మానంద రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి పులివెందుల నుండి పోటీ చేసారు. 21,000 అఖండ మెజారిటితో గెలుపొందారు. దేశవ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యాలు సాధించిన ఇందిరా కాంగ్రెస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పులివెందుల‌లో 5 వేల ఓట్ల‌ను కూడా పొంద‌లేక‌పోయింది. అంటే చంద్ర‌బాబు ప్ర‌చారం చేసిన‌ట్టు రెడ్డి కాంగ్రెస్ అనే పార్టీయే లేదు. కేవ‌లం బుర‌ద చ‌ల్లాలల‌ని, చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించాల‌నే చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం వాస్త‌వాల ముందు నిల‌బ‌డ‌లేదు. ఎల్లో ఫేక్ ప్ర‌చారాల‌కు ఇక ఏమాత్రం అవ‌కాశం లేదు. 

   
Back to Top