నాడు నేడూ ప్రజల కోసమే వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రయాణం

ప్రజా సంకల్ప యాత్రకు నేటితో ఆరు వసంతాలు పూర్తి 

అమ‌రావ‌తి: పేదల కష్టాలు తెలుసుకునేందుకు వేసిన తొలి అడుగుకు ఆరేళ్లు పూర్తయ్యాయి. వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సంకల్ప యాత్ర (పాదయాత్ర)కు శ్రీకారం చుట్టి నేటి (సోమవారం)తో ఆరు వసంతాలయ్యాయి. 2017 నవంబరు 6వ తేదీన వైయ‌స్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 13 జిల్లాలను టచ్ చేస్తూ పాదయాత్ర సాగించారు.. 134 నియోజవర్గాల్లో 341 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు.. 3,648 కిలోమీటర్లు నడిచారు. 2,516 గ్రామాల గుండా పాదయాత్ర సాగింది. మొత్తం 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమవేశాలు.. ఇంకా ఎందరితో మమేకం అయ్యారు.. దారిలో రైతులను పరామర్శించారు.. పొలాల్లోకి వెళ్లి.. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.. తమ ప్రభుత్వం వస్తే అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.. అందుకు అనుగుణంగా.. 2019 ఎన్నికల ముందు నవరత్నాల పేరుతో మేనిఫెస్టో తీసుకొచ్చారు.. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా పార్టీ ప్రణాళికను రూపొందించారు.. ఇక, సార్వత్రిక ఎన్నికల్లో వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని మెజార్టీతో గెలిపించారు ప్రజలు.. అసెంబ్లీలోనే కాదు.. పార్లమెంట్‌ స్థానాల్లోనూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది.

 
పాద‌యాత్ర‌లో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  చ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత 99 శాతం మేర నెరవేర్చారు.. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకునివైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైయ‌స్‌ జగన్‌ పనిచేస్తున్నారు.. వై నాట్ 175 అంటూ ముందుకు సాగుతున్నారు.. గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో.. మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రజాక్షేత్రం బాట పట్టించారు.  తమ ప్రభుత్వ హయాంలో ఏ వర్గాలకు ఎంత మేర లబ్ధి చేకూరిందనే వివరాలను చెబుతూ.. ఈ ప్రభుత్వంలో మీకు లబ్ధి చేకూరినట్టు అనిపిస్తేనే.. నాకు ఓటు వేయండి.. మరోసారి అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు సీఎం వైయ‌స్‌ జగన్‌..

నేడు పార్టీ కేంద్ర కార్యాల‌యంలో సంబ‌రాలు
ప్రజా సంకల్పయాత్ర ఆరేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తాడేపల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంతో సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నారు.. ప్రతీ నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌ విగ్రహాలకు పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించడం, సర్వమత ప్రార్ధనలు, కేక్ కటింగ్‌లు ఇలా వివిధ కార్యక్రమాలను పార్టీ శ్రేణులు నిర్వ‌హిస్తున్నాయి. 

 

Back to Top