నవశకానికి నాంది 

ఊరూరా సంక్షేమ పథకాల జాతర

కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక

బియ్యం, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ, జగనన్న విద్యా దీవెన–వసతికి వేర్వేరు కార్డులు

ప్రచార ఉద్యమంగా గ్రామ, పట్టణ వలంటీర్ల ఇంటింటి సర్వే 

అమరావతి: వైయస్‌ఆర్‌ నవశకం..సంక్షేమ పథకాల అమలులో విప్లవానికి నాంది కాబోతోంది. సంక్షేమ పథకాల పరిమితులను విస్తరిస్తూ నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 20 వరకు పాదర్శకంగా సర్వే చేపట్టి, సామాజిక తనిఖీ, గ్రామ సభల ద్వారా వందశాతం సంతృప్తి స్థాయిలో అర్హులను గుర్తించి రాష్ట్రంలోని ప్రతి కుటుంబలో సంతోషాలను నింపడమే వైయస్‌ఆర్‌ నవశంక ప్రధాన లక్ష్యం. జనవరి 1, 2020 నుంచి కొత్త కార్డులను(బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కార్డు, వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కార్డులు) పంపిణీ చేస్తారు. ప్రతి పథకానికి ప్రత్యేక కార్డుల జారీ చేయనున్నారు. ఎక్కువ మంది ప్రయోజనం పొందేలా ఆదాయ పరిమితి భారీగా పెంచారు.

కార్డులు పొందేందుకు అర్హత నిబంధనలు
బియ్యం కార్డు, వైయస్‌ఆర్‌ పిన్షన్‌ కార్డు:

  • - గతంతో గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.5 వేల లోపు ఆదాయ పరిమితి ఉన్నవారు అర్హులైతే, దానిని ప్రస్తుత ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది.
  • - గతంలో పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.6 వేల లోపు ఆదాయ పరిమితి ఉన్నవారు  అర్హులైతే దానిని ప్రస్తుత ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది
  • - గతంలో కుటుంబానికి రెండు ఎకరాలలోపు మగాణి, 5 ఎకరాలు మెట్ట కలిగిన వారు అర్హులు కాగా, ప్రస్తుతం 3 ఎకరాలలోపు మగాణి, 10 ఎకరాల మెట్ట భూమి లేదా మగాణి, మెట్ట భూమి కలిపి 10 ఎకరాలలోపు ఉన్నవారందరినీ అర్హులుగా గుర్తించారు.
  • - గతంలో నెలవారీ విద్యుత్‌ వినియోగం 200 యూనిట్ల లోపు ఉన్నవారు అర్హులైతే, ప్రస్తుత ప్రభుత్వం దాన్ని 300 యూనిట్లకు పెంచింది.
  • - ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు అనర్హులు, అయితే పారిశుద్ధ్య కార్మికులను మినహాయింపు 
  • -ఫోర్‌వీలర్‌ ఉను్న కుటుంబాలు అనర్హులు(టాక్సీ, ఆటో, ట్రాక్టర్‌కు మినహాయింపు)
  • - కుటుంబంలో ఏ ఒక్కరైనా ఆదాయ పన్ను చెల్లించినట్లైతే ఆ కుటుంబాలు అనర్హులు. పట్టణ ప్రాంతాల్లో ఆస్తులు లేని వారు, 750 చదరపు అడుగుల లోపు మాత్రమే ఇల్లు కలిగిన వారు అర్హులు
  • జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కార్డు:

 

  • - జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తిగా ఫీజు రీయిబర్స్‌మెంట్‌ - జగనన్న వసతి దీవెన పథకం కింద 2019-2020 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతీ విద్యార్థికి ఆహారం, వసతి ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేలు అందజేత.
    - డిగ్రీ, ఉన్నత చదువులు చదువుతున్న ప్రభుత్వ కళాశాలలు, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ కాజీలకు చెందిన విద్యార్థులు అర్హులు.
    - కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలు లోపు గల వారు అర్హులు
    - 10 ఎకరాల లోపు మాగాణి, 25 ఎకరాలలోపు మెట్ట భూమి, మెట్ట, మగాణి కలిపి 25 ఎకరాలలోపు ఉన్న వారు అర్హులు.
    - కుటుంబంలో ఏ ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, పెన్షన్‌తీసుకుంటున్నా అనర్హులు. పారిశుద్ధ కార్మికుల కుటుంబాలకు మినహాయింపు.
    - ఆయా కుటుంబాలకు ఫోర్‌ వీలర్‌ ఉండరాదు.(టాక్సీ, ఆటో, ట్రాక్టర్‌కు మినహాయింపు)
    - కుటుంబంలో ఏ ఒక్కరైనా ఆదాయ పన్ను చెల్లించినట్లైతే ఆ కుటుంబాలు అనర్హులు
    - పట్టణ ప్రాంతాల్లో 1500 చదరపు అడుగుల లోపు ఇళ్లు కలిగిన వారు కూడా అర్హులే.
  • వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కార్డు
  • -గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.60 వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.70 వేల లోపు ఆదాయం గల కుటుంబాలు. ప్రస్తుతం కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉన్న వారు అర్హులు.
  • - గతంలో 2.5 ఎకరాల లోపు మగాణి, 5 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వారు అర్హులు. ప్రస్తుతం 12 ఎకరాల లోపు మాగాణి, 35 ఎకరాల లోపు మెట్ట భూమి, మెట్ట, మాగాణి కలిపి 35 ఎకరాల లోపు ఉన్న వారు అర్హులు.
  • - గతంలో కారు లేని వారు మాత్రమే అర్హులు. ప్రస్తుతం కుటుంబానికి ఒక కారు ఉన్న వారు కూడా అర్హులే.
  • - గతంలో 750 చదరపు అడుగుల లోపు ఇళ్లు కలిగిన వారు మాత్రమే  అర్హులు. ప్రస్తుతం 300 చదరపు అడుగుల లోపు ఇళ్లు కలిగిన వారు కూడా అర్హులే. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకంలోకి రాని ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తింపు.
  • వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ:
  • -2019 ఏప్రిల్‌ నాటికి ఉన్న మొత్తం స్వయం సహాయక సంఘాల రునాల వడ్డీ భారం తగ్గించేందుకు 2019-2020 ఏడాదికి వడ్డీని ప్రభుత్వమే కట్టేందుకు ప్రతిపాదనల
  • - పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 లక్షల లోపు రుణాలు కలిగిన డ్వాక్రా మహిళలందరూ అర్హులు
  • - 2019 మార్చి నాటికి సెర్ఫ్‌, మెప్మా వారి సమాచారం మేరకు నిరర్ధక ఆస్తులుగా గుర్తించబడిన స్వయం సహాయక సంఘాలు అర్హులు.
  • జగనన్న అమ్మ ఒడి:
  • - ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కాలేజీలలో 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు 09.01.2020 నుంచి రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేత.
  • దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్‌:
  • -డయాలసిస్‌ పేషంట్లు, తలసేమియా, సికిల్‌ సెల్‌, హీమోఫిలియా వ్యాధిగ్రస్తులకు కూడా నెలకు రూ.10 వేలు
  • - ప్రమాదాల కారణంగా లేదా పక్షవాతం, తీవ్రమైన కండరాల క్షిణత వల్ల వీల్‌ చైర్‌ లేదా మంచానికే పరిమితమై ఉన్న వారికి, బోదకాలు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు(స్టేజ్‌-3,4,5) నెలకు రూ.5 వేలు
  • - లెప్రసీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.3 వేలు

Read Also: ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌పై సీఎం సమీక్ష

Back to Top