జగనన్నే మా భవిష్యత్తు..1.1 కోట్ల మిస్డ్ కాల్స్‌

తాడేపల్లి:  జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వేలో 1.45 కోట్ల కుటుంబాలకు వైయ‌స్ఆర్‌సీపీ చేరువైంది. ప్రభుత్వ పాలనపై 80 శాతం ప్రజల సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని భారీ మెగా పీపుల్స్ సర్వేగా జగనన్నే మా భవిష్యత్తు నిలిచింది. సర్వేలో విశేషంగా పాల్గొన్న ప్రజలకు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మెగా సర్వేతో వైయ‌స్ఆర్‌సీపీ  క్యాడర్ మరింత ఉత్సాహవంతమైంది.

 

 

వైయ‌స్ఆర్‌సీపీ ప్రతిష్టాత్మక జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వే శనివారం నాటితో రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలను కలిసి సీఎం జగనన్న పాలనపై వారి అభిప్రాయాలను సేకరించింది. సీఎం జగన్ పాలనకు 1.1 కోట్ల కుటుంబాలు మిస్డ్ కాల్ ద్వారా మద్దతు ప్రకటించారు. ఈ మెగా సర్వే పూర్తి వివరాలను పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు మీడియా సమావేశంలో వెల్లడించారు.

సీఎం జగన్ పాలనపై 80 శాతం ప్రజల సంతృప్తి..
"జగన్ నాయకత్వం మీద రాష్ట్ర ప్రజలు పూర్తి సంతోషంగా ఉన్నారు. ఇంత భారీ పబ్లిక్ సర్వే చేయడం ద్వారా వైయ‌స్ఆర్‌సీపీ సాహసం చేసింది. ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే కార్యక్రమంతో చరిత్ర సృష్టించింది. ఈ సర్వేతో వైఎస్సార్ సీపీ రాజకీయంగా బలంగా ఉందని నిరూపించింది. ఈ మెగా సర్వే అన్ని రకాలుగా పారదర్శకంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమం దేశంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టలేదు. తక్కువ సమయంలో ఈ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. గ్రామస్థాయిలో కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్న వాస్తవాలు తెలుసుకున్నాము.

ఇంత భారీ సర్వే చేయగలమా అనుకున్నాం కానీ సీఎం జగన్ నేతృత్వంలో విజయవంతం పూర్తి చేసాము. సర్వే ప్రారంభంలో మా అధినేత సీఎం జగన్ తన విజన్ ని నేతలకు పూర్తిగా వివరించడంతో దానికి తగినట్లుగా పనిచేసాము. ఈ సర్వేలో గత ప్రభుత్వం చేసిన పనితీరును మా ప్రభుత్వ పని తీరును గురించి ప్రజలని అడిగి తెలుసుకున్నాము. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా కూడా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీద ప్రజల అభిప్రాయం తెలుసుకుంటున్నాం. మొత్తం ఆరు లెవల్స్ లో ఈ మెగా సర్వే పూర్తి చేసాము." అని రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి అన్నారు.

శ్రీశైలం నియోజకవర్గం లో 75వేల200 కుటుంబాలు, 67, 432 మిస్డ్ కాల్స్

1.45 కోట్ల కుటుంబాల మద్దతుతో ఓ చరిత్ర
"రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ మెగా సర్వేలో కకోటి 45 లక్షల కుటుంబాల మద్దతు సాధించి ప్రజల అభిప్రాయాలు తీసుకుని వైయ‌స్ఆర్‌సీపీ ఓ చరిత్ర సృష్టించింది. 7 లక్షల మంది గృహసారథులు, నాయకల ద్వారా ఈ కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం అయ్యింది. ప్రజల్లో సీఎం జగనన్న ప్రభుత్వం మీద మంచి స్పందన వచ్చింది. ప్రజలు వారి భవిష్యత్తు కోసం మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. భావి తరాలు కూడా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సీఎం జగన్ తోనే సాధ్యం నమ్ముతున్నారు. ప్రజా మద్దతు పుస్తకంలో ప్రశ్నలకు ప్రజల స్వచ్చందంగా సమాధానాలు ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ఈ మెగా సర్వే ఫలితాలు ప్రదర్శిస్తాము. సిఎం జగన్ ఇచ్చే ప్రతి పథకం ప్రజలకి నేరుగా అందుతోంది."

"చంద్రబాబు సంస్కార హీనుడిలా మాట్లాడటం సరికాదు. ప్రజల ఇష్టంతోన్ వారి ఇళ్లకు స్టిక్కర్ అంటించాము. అన్ని పార్టీల ప్రజలకి పథకాలు అందుతున్నాయి. మే 9 నుండి జగన్నన్నకి చెబుదాం అనే నూతన కార్యక్రమం కూడా ప్రారంభిస్తాము." అని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలిపారు. 

ప్రజా మద్దతు వైయ‌స్ఆర్‌సీపీకే..
"ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ ఇలాంటి కార్యక్రమం చేయలేదు. మెగా సర్వేతో ప్రజా మద్దత్తు వైఎస్సార్ సీపీకే ఉందని స్పష్టం అయ్యింది. సిఎం జగన్ పాలనకు 80 శాతం ప్రజలు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రతి గడపకి మా నాయకులు వెళ్లి వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నారు. కాకినాడ, ఎన్టీఆర్, బాపట్ల, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలో సర్వే అద్భుతంగా జరిగింది. అవినీతి, వివక్ష లేని పాలనకు ప్రజలు మద్ధతుగా నిలిచారు.. ఇదే సర్వేలో స్పష్టమైంది. చంద్రబాబు ఇలాంటి సర్వే జీవితంలో ఎప్పుడైనా చేశారా. తాము 15 వేల సచివాలయల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించాము. సీఎం జగన్ చేస్తున్న మంచికి ప్రజల్లో ఆమోదం, సంతృప్తి ఉంది." అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు వివరించారు.

22 రోజుల్లో 1.45 కోట్ల కుటుంబాలకు చేరువ
"దేశంలోనే ఇలాంటి సర్వే చేసిన మొదటి ప్రభుత్వం మాది. గతంలో 40 ఏళ్ళు అనుభవం అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు. సీఎం జగనన్న చెప్పే మాటకు చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మా సైన్యం సిద్ధంగా ఉంది. కేవలం 22 రోజుల్లో 1.45 కోట్ల కుటుంబాలను కలిసాము.ఇలాంటి కార్యక్రమం చేసే దమ్ము చంద్రబాబుకి ఉందా.. కులం, మతం అతీతంగా వైసీపీ పాలన చేస్తోంది. ఈ మాట చంద్రబాబు ఒక్కసారైనా తన ప్రభుత్వ హయాంలో చెప్పగలిగారా.  రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెగా సర్వేను విజయవంతం చేసిన ప్రతి ఒకరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం." అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.

ప్రజా మద్దతు పుస్తకం ప్రజాభిప్రాయానికి ప్రతీక.
"ఇలాంటి ఆలోచన దేశంలో ఎలాంటి సీఎంకి రాలేదు. ప్రజలోకి నేరుగా వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీద అభిప్రాయం తీసుకున్నాము. ప్రజా మద్దతు పుస్తకం ద్వారా ప్రజలు అభిప్రాయం చెప్పారు. కులం, మతం చూడకుండా ఓటు వేయని వారికీ కూడా లబ్ది చేకూరుతోంది. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజలను ఈ సర్వేలో కలిసాము. చంద్రబాబు లాగా గాల్లో లెక్కలు వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నటికీ చెప్పదు. సీఎం జగనన్న పరిపాలన మీద ప్రజల్లో నమ్మకం ఉంది కాబట్టే జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వేను ప్రజలు విశేష స్థాయిలో అందరించారు." అని విజయవాడ తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్ వివరించారు.

Back to Top