అమరావతి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటా పర్యటించిన జగనన్న సైన్యం ప్రజా మద్దతు పుస్తకంలోని ఐదు ప్రశ్నలకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు వెల్లువెత్తుతోంది. అందరూ మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని నినదిస్తున్నారు. నవరత్నాలు కొనసాగాలని కోరుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లకు ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. ఇదివరకెన్నడూ లేని రీతిలో గత 46 నెలలుగా సీఎం వైయస్ జగన్ సంక్షేమ పథకాలు, సుపరిపాలన ద్వారా మేలు చేశారంటూ అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదమ్ములు ప్రశంసిస్తున్నారు.
2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా అమలు చేయకుండా తమను మోసం చేశారని అన్ని వర్గాల ప్రజలు మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ తాము పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం వైయస్ జగన్ నిలబెట్టుకున్నారని కొనియాడారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అని నినదించారు. మళ్లీ వైయస్ జగనే అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ప్రజా మద్దతు పుస్తకంలో తమ అభిప్రాయాలను నమోదు చేయించి, రసీదు తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్స్ పోటెత్తుతున్నాయి. సీఎం వైయస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్‌ను అడిగి మరీ తీసుకుని ఇంటి తలుపులకు, మొబైల్ ఫోన్‌లకు అతికించుకుని అభిమానాన్ని చాటుకుంటున్నారు.
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఈ నెల 7న ప్రారంభమైంది. వైయస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇప్పటికే 40 లక్షల కుటుంబాలకు చెందిన అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదమ్ములు 82960 82960 మిస్డ్ కాల్స్ ఇచ్చారు. అన్ని వర్గాల నుంచి ప్రభుత్వానికి మద్దతు వెల్లువెత్తుతుండటం సీఎం వైయస్ జగన్ సుపరిపాలనకు దర్పణంగా నిలుస్తోందని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విశాఖలో ఆయన ఇంటింటా పర్యటించి ప్రజలతో మాట్లాడుతున్నారు. వారి అనుమతితో ఇంటికి స్టిక్కర్ అంటించారు.

నంద్యాల జిల్లా:
శ్రీశైలం శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాల మేరకు.. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో నువ్వే మా నమ్మకం జగనన్న కార్యక్రమం నిర్వహించారు. వైయస్ఆర్‌సీపీ పట్టణ అధ్యక్షుడు ఎన్ఎస్ సయ్యద్ మీర్ ఆధ్వర్యంలో గృహ సారధులు, వాలంటీర్లు, పార్టీ శ్రేణులు ఇంటింటా పర్యటించి గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను వివరిస్తూ ఇళ్లకు స్టిక్కర్లు అంటించారు. కార్యక్రమంలో వార్డు నాయకులు చేపల రఫిక్ తబ్రేష్, అహ్మద్ రసూల్, మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షుడు ఎన్ఎస్ జయ్యుం, వరాల మాలిక్, జేసీఎస్ టౌన్ ఇంచార్జ్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.

వెలుగోడు పట్టణంలో..
వెలుగోడు పట్టణంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది. గురువారం పట్టణంలోని 4వ సచివాలయం పరిధిలోని గాంధీనగర్ జగనన్నే మా నమ్మకం కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ లాలం రమేష్, సర్పంచ్ వేల్పుల జయపాల్, సచివాలయ కన్వీనర్ ఏర్వ శ్యామలమ్మ, వాలంటీర్లు, గృహ సారధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
హిందూపురం నియోజకవర్గంలో..
హిందూపురం నియోజకవర్గంలో జగనన్నే మా భవిషత్తు" - " జగనన్నే మా నమ్మకంష దిగ్విజయంగా కొనసాగుతోంది. ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇంచార్జ్ "షేక్ మహమ్మద్ ఇక్బాల్ష ఆదేశాలు మేరకు 18వ వార్డ్ బోయపేటలో ఇంటింటా పర్యటించి వైయస్ జగన్ పరిపాలన గురించి వివరించి స్టిక్కర్లు అంటించినట్లు వార్డ్ ఇన్‌చార్జ్ కవిత అరుణాచలం తెలిపారు. కార్యక్రమంలో వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు సుహెల్, మహేష్, అభి, పార్వతి, రవి, మారుతి తదితరులు పాల్గొన్నారు.
