చెల్లెమ్మల వివాహాలకు అండగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

నేడు ‘కళ్యాణమస్తు, షాదీ తోఫా’ నగదు జమ

అమరావతి: పేద కుటుంబాల్లో చెల్లెమ్మల వివాహాలకు అండగా నిలిచే వైయ‌స్ఆర్‌ కళ్యాణమస్తు, వైయ‌స్ఆర్‌ షాదీ తోఫా పథకాల కింద శుక్రవారం అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైయ‌స్‌ జగన్‌ నగదు జమ చేయనున్నారు. ఈ మేరకు జనవరి–మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. తన క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో సీఎం జగన్‌ నగదు జమ చేస్తారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గత ఆరు నెలల్లోనే ఈ పథకాల కింద 16,668 మంది లబ్ధిదారులకు మేలు జరిగినట్టవుతుంది. వీరి ఖాతాల్లో వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం ఏకంగా రూ.125.50 కోట్లు జమ చేసింది. 

దేశంలోనే ఎక్కడా లేనివిధంగా.. 
‘పిల్లల చదువు ఇంటికి వెలుగు– ఇల్లాలి చదువు వంశానికే వెలుగు’ అనే మాటను స్ఫూర్తిగా తీసుకుని దేశంలో ఎక్కడా లేని విధంగా వైయ‌స్ఆర్‌ కళ్యాణమస్తు, వైయ‌స్ఆర్‌ షాదీ తోఫా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఓవైపు పేద కుటుంబాల్లోని చెల్లెమ్మల పెళ్లిళ్లకు అండగా నిలుస్తోంది. మరోవైపు ప్రతి చెల్లెమ్మను, ప్రతి తమ్ముడిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం, బాల్యవివాహాలను నివా­రిం­చడం, పేద కుటుంబాలకు చెందిన వధువుల తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకోవడం వంటి సమున్నత లక్ష్యాలతో ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని చెల్లెమ్మలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, ముస్లిం మైనార్టీ చెల్లెమ్మలకు వైయ‌స్ఆర్‌ షాదీ తోఫాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది.  

పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.. 
కేవలం వందకు వంద శాతం అక్షరాస్యతే లక్ష్యంగా కాకుండా వందకు వంద శాతం గ్రాడ్యుయేట్‌లుగా పిల్లలను తీర్చిదిద్దాలన్న సమున్నత లక్ష్యంతో ప్రభుత్వం కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద సాయం పొందడానికి పదో తరగతి ఉత్తీర్ణతను తప్పనిసరి చేసింది.  వధువుకు కనీస వయసు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు ఉండాలని నిర్దేశించింది. ఇంటర్‌ వరకు జగనన్న అమ్మఒడి కింద రూ.15 వేలు, జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్స్, జగనన్న వసతి దీవెన కింద ఏటా రూ.20 వేల సాయం అందిస్తుండటంతో ఉన్నత చదువులు కూడా సాకారమవుతున్నాయి.  

 
నాడు.. 
గత టీడీపీ ప్రభుత్వంలో అరకొ­రగా కొన్ని వర్గాలకే ఆర్థిక సాయం అందేది. అది కూడా సకాలంలో అందరికీ అందేది కాదు. సాయం కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి ఉండేది. అర్హులైన లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ నెలల తరబడి జాప్యం చేసి 2018 అక్టోబర్‌ నుంచి ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం ఎత్తేసింది. 2018–19లో 17,709 మంది లబ్ధిదారులకు రూ.68.68 కోట్ల వివాహ ప్రోత్సాహకాలను చెల్లించకుండా ఎగ్గొట్టింది.  

Back to Top