చిన్నపరిశ్రమలకు నవోదయం 

డాక్టర్ వైయస్సార్ నవోదయం పథకం రాష్ట్రంలో నిరాశలో కూరుకుపోయిన చిన్న తరహా పరిశ్రమలకు ఊపిరిలూదింది. ఈ పథకం ద్వారా సంక్షోభంలో చిక్కుకుపోయిన పరిశ్రమల పునరుద్ధరణతో పాటు అభివృద్ధికి చేయూతనిచ్చేలా లక్ష్యాలు నిర్దేశించారు. 85,070 ఎంఎస్ఎంఈ యూనిట్లు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో 3,493 కోట్లకు వన్ టైమ్ రీ స్ట్రక్చరింగ్ ద్వారా పరిష్కారం చూపుతున్నారు. పారిశ్రామిక రాయితీల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 2019 జనవరి నుంచి ఈ పథకం అమలు మొదలౌతుంది. 
బాబు హయాంలో నష్టపోయిన చిన్న పరిశ్రమలు
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించేవి చిన్నతరహాపరిశ్రమలు. ఫుడ్ ప్రొడక్ట్స్, బేవరేజెస్, పొగాకు ఉత్పత్తులు, కాటన్ ఫ్యాబ్రిక్స్, ఉన్ని, సిల్కు వస్త్రాలు, జ్యూట్, కలప, కలప ఉత్పత్తులు, లెదర్, లెదర్ వస్తువులు, కెమికల్స్, డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, మెటల్స్, మెషినరీలతో పాటు ఆగ్రో పరిశ్రమలు ఈ రంగంలో ఉన్నాయి. బాబు 15ఏళ్ల పాలనా కాలంలో అత్యంత నష్టపోయిన రంగాల్లో చిన్నతరహా పరిశ్రమలు కూడా ఉన్నాయి. బాబు పదేళ్ల పాలనలో కరెంటు ఛార్జలు తట్టుకోలేక, బాబు ప్రపంచ బ్యాంకు విధానాలతో నాశనమై మూతబడ్డ పరిశ్రమలెన్నో లెక్కే లేదు.  
వైయస్ హయాంలో ప్రోత్సాహకాలు
2004 సమయానికి 27% సంస్థలు మూతబడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాడు వైయస్సార్ 2006లో చిన్నతరహా పరిశ్రమల పునరుద్ధరణ పథకం (APSSIRS) ప్రవేశపెట్టారు. MSMED చట్టం ద్వారా పెట్టుబడి పరిమితులు పెంచారు.  ఏపీ స్మాల్ స్కేల్ సిక్ ఇండస్ట్రీస్ రివైవల్, రిహాబిలిటేషన్ నిధి ఏర్పాటు చేసారు. నష్టపోయిన చిన్న పరిశ్రమల యూనిట్లకు 6శాతం వడ్డీతో 3 సంవత్సరాలు సబ్సిడీ ఇచ్చారు. కొనుగోళ్ల పన్ను, అమ్మకపు పన్ను 3 ఏళ్లు రద్దు చేసారు. 
చిన్నతరహాపరిశ్రమలకు నవోదయం
ఈ పథకం వినియోగించుకోవడం వల్ల బ్యాంకు రుణాల చెల్లింపులకు 6సంవత్సరాల గడువు దొరుకుతుంది. వడ్డీ కూడా 12% నుండి 9%నికి తగ్గుతుంది. వైయస్సార్ నవోదయం పథకానికి 10కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. అన్ని జిల్లాల్లో రంగాల వారీగా అధ్యయనం  చేసి చిన్న పరిశ్రమలు ఎదిగేలా అనుకూలమైన విధివిధానాలను రూపొందిస్తామని చెబుతోంది ప్రభుత్వం. 

Read Also: కాపుల అభ్యున్నతికి సీఎం వైయస్‌ జగన్‌ కట్టుబడి ఉన్నారు

Back to Top