రాష్ట్రంలో అల్ల‌ర్లు సృష్టించేందుకు చంద్ర‌బాబు ఎత్తులు

అధికారం దూరం అయిపోయింది. ప్ర‌జ‌లు ఛీ కొట్టారు. కేంద్రంలో పాచిక‌లు పార‌లేదు. ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిద్దామ‌న్నా ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి పాల‌న‌లో అలాంటి అవ‌కాశం దొర‌క‌డం లేదు. విమ‌ర్శించాలంటే వీలుండ‌టం లేదు. ప్ర‌జ‌లు మెచ్చే పాల‌న‌, ప్ర‌జారంజ‌క పాల‌న‌, ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకునే పాల‌న అంటే ఏమిటో నెల రోజుల్లోనే చేసి చూపారు వైఎస్ జ‌గ‌న్. దాంతో దిక్కుతోచ‌కుండా అయ్యింది టీడీపీ ప‌రిస్థితి. కృత్రిమ ఓదార్పులు చేయించుకుంటూ, ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందేందుకు నానా తంటాలూ ప‌డుతున్నాడు టీడీపీ అధినేత‌. న‌ల‌భై ఏళ్ల అనుభ‌వం ప్ర‌జ‌ల కోసం కాదు ప్ర‌జ‌ల్లో జాలి క‌లిగించి ఏదో లాభం పొదాల‌ని, ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌నే కుళ్లు ఆలోచ‌న‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతోంది. 

అల్ల‌ర్లు సృష్టించేందుకేనా
ప్ర‌తిప‌క్ష నేత‌కు సెక్యూరిటీ త‌గ్గిస్తున్నారు అంటూ ముందు ప్ర‌చారం చేసారు. ఇప్పుడు దానికి కొన‌సాగింపుగా నాపై దాడి జ‌రిగితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయ‌లేరు అంటూ స్వయంగా చంద్ర‌బాబు వాఖ్యానిస్తున్నారు. ఇది ముంద‌స్తు కుట్ర‌గా క‌నిపిస్తోంద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల‌ను రాష్ట్రంలో అల‌జ‌డులు, అల్ల‌ర్లు సృష్టించేందుకు బాబు స‌మాయ‌త్తం చేస్తున్న‌ట్టుగా నిఘా వ‌ర్గాలు కూడా అనుమానిస్తున్నాయి. చంద్ర‌బాబుపై చిన్న‌పాటి దాడి లాంటిది జ‌ర‌గ‌డం దాన్ని భ‌ద్ర‌తా వైఫ‌ల్యంగా ప్ర‌చారం చేస్తూ, తెదేపా శ్రేణులు రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించేలా గొడ‌వ‌లు చేయ‌డం ఈ ప్లాన్ లో భాగం కావ‌చ్చు.

గ‌తంలోనూ బాబు వైఖ‌రి ఇలాగే
గ‌తంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలోనూ చంద్ర‌బాబు ఇలాంటి కుటిల నీతినే ఉప‌యోగించారు. విశాఖ విమానాశ్ర‌యంలో హ‌త్యాయ‌త్నం జ‌రిగిన‌ప్పుడు కూడా విప‌రీత‌మైన ధోర‌ణిలో, వెకిలిగా, క‌వ్వించేలా వాఖ్య‌లు చేసి, వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానుల‌ను రెచ్చ‌గొట్టేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ నాడు వైయ‌స్ జ‌గ‌న్ అభిమానుల‌ను సంయ‌మ‌నంతో ఉండాల‌ని చెప్పి ఎలాంటి అల్ల‌ర్లూ జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. వైఎస్ వివేకానంద‌రెడ్డి గారి హ‌త్యోదంతంలోనూ చంద్ర‌బాబు, టీడీపీ నేత‌లు ఇలాగే రెచ్చ‌గొట్టే వాఖ్య‌లు చేసారు. తుని రైలు సంఘ‌ట‌న‌లోనూ రాయ‌ల‌సీమ రౌడీలు అంటూ మాట్లాడిన చంద్ర‌బాబు దీనిపై అల్ల‌ర్లు రేగితే వాటిని వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతాలో వేయాల‌నుకున్నారు. ఫాక్ష‌నిష్టుల ముద్ర వేసి ప్ర‌జ‌ల్లో ఆ పార్టీ ప‌ట్ల‌, ఆ పార్టీ నాయ‌కుడి ప‌ట్ల వ్య‌తిరేక‌త క‌లిగించాల‌ని ప‌న్నాగం ప‌న్నారు. కానీ బాబు పాచిక‌లు పార‌లేదు. నాడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారి మాట మేర‌కు కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, సానుభూతిప‌రులూ బాబు ట్రాప్ లో ప‌డ‌లేదు. రాష్ట్రంలో ఒక్క‌సారి కూడా అల్ల‌ర్లు రేగ‌లేదు. 

సానుభూతి కోస‌మే నాట‌క‌మా?
గ‌తంలో చంద్ర‌బాబు పై అలిపిరిలో బాంబు దాడి జ‌రిగింది. అది న‌క్స‌ల్స్ ప‌ని అని ప్ర‌చారం చేసుకున్నా, ఎన్నిక‌ల ముందు సానుభూతి కోసం స్వ‌యంగా చంద్ర‌బాబు చేయించుకున్న దాడే అని చాలా మంది బ‌లంగా చెప్పారు. త‌న ప్ర‌భుత్వంపై, త‌న‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను సానుభూతి ద్వారా త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేసాడ‌ని అప్ప‌టి రాజ‌కీయ వ‌ర్గాలే విమ‌ర్శించాయి. ఇప్పుడు కూడా అదే విధంగా అరువు ఆర్టిస్టుల‌ను ఇంటికి పిలిపించుకుని సానుభూతి వాక్యాలు ప‌లికించుకునే డ్రామా ఆడుతున్నారు టీడీపీ అధినేత‌. ప్ర‌జ‌లు ఈ కృత్రిమ ఏడుపుల‌ను చూసి అస‌హ్యించుకుంటున్నార‌ని తెలియ‌డంతో మ‌రో కొత్త నాట‌కానికి తెర తీస్తున్నారు. నాకేదైనా అయితే ప్ర‌జ‌లు ఊరుకోరు అంటూ త‌న‌పై ఏదో దాడి జ‌రుగుతుంద‌నే భ్ర‌మ‌లు క‌ల్పిస్తున్నాడు.

నిజానికి ముఖ్య‌మంత్రికి, ప్ర‌తిప‌క్ష నేత‌కు ఇచ్చే భద్ర‌త‌, సెక్యూరిటీ విష‌యంలో చాలా తేడాలు ఉంటాయి. వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు ఆయ‌న‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నం ఏమాత్రం ప‌నికి రానిది. కానీ నేడు చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు అయ్యినా అధికారంలో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆయ‌న భ‌ద్ర‌త‌కు ఏ లోటూ రానీయ‌లేదు. ప్రొటోకాల్ ప్ర‌కారమే ఆయ‌న భ‌ద్ర‌త‌ను పూర్తిగా అందిస్తోంది. కానీ ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు మాట‌లు, అబ‌ద్ధాలు చెబుతూ సింపతీ సంపాదించుకునే ప‌నిలో ప‌డ్డారు న‌ల‌భైఏళ్ల అనుభ‌వ‌జ్ఞుడు.

 

Back to Top