బాబు సెక్యూరిటీపై కోర్టు క్లారిటీ

 

 
అధికారంలో ఉంటే ఒకలా ప్రతిపక్షంలోకి వస్తే ఒకలా ఉండటం చంద్రబాబుకే చెల్లింది. తానింకా ముఖ్యమంత్రే అన్నట్టు భావిస్తూ, నా భద్రత ఎందుకు తగ్గిస్తున్నారంటూ కోర్టుకు వెళ్లాడు. 
ప్రతిపక్ష నాయకుడికి ప్రొటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన సెక్యూరిటీ 54 కాగా ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు 74 మందిని ఇస్తోంది. అయినా కూడా నా భద్రతకు ముప్పు అంటూ బాబు గోలచేయడం విడ్డూరం. గతంలో ఇదే చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్ కు ఇచ్చిన సెక్యూరిటీ ఇంతకంటే తక్కువే. 7 ప్లస్ 7 భద్రత మాత్రమే జగన్ కు కల్పించింది గతంలోని టీడీపీ ప్రభుత్వం. చివరికి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం కూడా ఇవ్వకుండా కక్ష సాధింపులకు పాల్పడింది. కాలం చెల్లిన వాహనాలనిచ్చి ప్రతిపక్ష నాయకుడి భద్రతను విస్మరించింది. ఎయిర్పోర్టులో వైఎస్ జగన్ పై హత్యాప్రయత్నం జరిగితే సంఘటన జరిగిన చోటు మా పరిధి కాదని చేతులు దులుపుకుంది. చివరకు హత్యాయత్నం విచారణను కూడా జాప్యం చేసింది. కానీ నేటి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన భద్రత కంటే ఎక్కువమందినే కేటాయించింది. 
ఆ జాబితా ఇది -
చంద్రబాబుకు 20 మంది ఆర్మ్ డ్ సెక్యూరిటీ రెసిడెన్స్ దగ్గర ఎలాట్ చేసారు. పిఎస్‌ఓలు షిప్ట్‌ కు ముగ్గురు చొప్పున మూడు షిఫ్టులకు 6మంది. చుట్టుముట్టి ఉండే ఎస్కార్టులు 24 మంది. వాచర్లు పగలు రెండు షిఫ్టులకు ఇద్దరు చొప్పున నలుగురు, రాత్రికి ఒకరు కలిపి 5మంది. సబ్ ఇన్సిపెక్టర్ ఇంఛార్జ్ 1, ఆర్ ఐ 1, వచ్చేవారిని స్కానర్ తో తనిఖీ చేసే అధికారులు 2 షిఫ్టులకు కలిపి ఆరుగురు. బీపీ కార్ అండ్ జామర్. షిప్టుకు ఇద్దరు డ్రైవర్లు చొప్పున మూడు షిప్టులకు 6మంది డ్రైవర్లు. దీనిబట్టి  చూసే గతంలో ప్రతిపక్ష నాయకుడికి ప్రభుత్వం  కల్పించిన భద్రతకంటే మూడు రెట్లు ఎక్కువ భద్రత చంద్రబాబుకు వైసీపీ ప్రభుత్వం కల్పించినట్టు అర్థం అవుతోంది. కానీ ఎప్పుడూ జగన్ ప్రభుత్వం మీద బురద చల్లాలనే కారణంతోనే ఈ వాస్తవాలను బాబు ఒప్పుకోకుండా భద్రత తగ్గించారంటూ యాగీ చేస్తున్నాడు.
అయితే కోర్టు ఈ విషయంపై ప్రభుత్వానకి అనుకూలంగా స్పందించింది. ప్రతిపక్షంలో ఉంటూ కూడా 147 మంది సెక్యూరిటీ కావాలని చంద్రబాబు కోరడాన్ని తప్పు పట్టింది. చంద్రబాబు నివాసానికి, పార్టీ కార్యాలయానికీ తప్ప వారి సొంత ఆస్తులకు సెక్యూరిటీ ఇవ్వడం కుదరదని ప్రభుత్వం చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. 54 మందితో భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండగా 97 మందిని ఇవ్వడం తక్కువ కాదంటూ న్యాయస్థానం అభిప్రాయపడింది. చంద్రబాబు అడిగినంత మందిని కాక ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న సంఖ్యలోనే భద్రతా సిబ్బంది నియామకానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అనవసరంగా రాద్ధాంతం చేస్తూ ప్రజల్లో సానుభూతి పొందాలనుకున్న చంద్రబాబు వైఖరికి కోర్టు ఆదేశాలు బ్రేకులు వేసినట్టైనాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Back to Top