అవాస్తవాలు ప్రచారం చేస్తే ఉపేక్షించం

  సీఎం వైయస్ జగన్

పత్రికల్లో ప్రభుత్వంపై వచ్చే అవినీతి ఆరోపణలు అవాస్తవాలని రుజువైతే చర్యలు తీసుకోమని ప్రభుత్వ సంస్థల సెక్రెటరీలకు అధికారాలు ఇచ్చిన జీవో సంచలనం అయ్యింది. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే అంటూ కొన్ని మీడియా హౌజులు గగ్గోలు పెట్టాయి. వాటికంటే ఎక్కువగా చంద్రబాబు కంగారు పడ్డాడు. తుమ్మినా, దగ్గనా, కంటిమీద కురుపేసినా, ముక్కుమీద ఈగ వాలినా బాబు బ్రహ్మాండం అంటూ కాకమ్మ కథనాలు రాసే తన మిత్ర పత్రికా, ఛానెళ్లకు ఈ జీవో నిజంగా కష్టం కలిగించే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబును తప్ప మరొకరిని ముఖ్యమంత్రిగా ఊహించుకోలేని స్థితిలో కొన్ని తెలుగు మాధ్యమాలు ఉన్నాయన్నది బహిరంగ సత్యం. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలన, సీఎం జగన్ పారదర్శక పాలనతో ప్రజలను మెప్పించడం బాబు భజనపరులకు కంటకింపుగా ఉంది. అందుకే వైయస్ జగన్ అధికారం చేపట్టిన క్షణం నుంచే నిరాధారమైన ఆరోపణలతో ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 
కొమ్ముకాసే కమ్మ మీడియా
అవినీతి జరిగితే ఏ ప్రభుత్వాన్నైనా ప్రశ్నించే హక్కు, విమర్శించే బాధ్యత మీడియాకు ఉంటుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక వర్గానికి కొమ్ము కాసే అత్యధిక మీడియా హౌజులు పనిగట్టుకుని మరీ కొత్త ప్రభుత్వంపై రోత రాతలు రాస్తున్నాయి. ఆధారాలు లేకుండానే దారుణమైన ఆరోపణలు చేస్తున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంటున్న ఈ తరహా విష ప్రచారంపై కొత్త ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వాస్తవమైన ఆరోపణలు చేస్తే సంబంధిత శాఖలు వాటిపై స్పందించి దిద్దబాట్లు చేసుకుంటాయి. అవినీతి ఉందని తెలిస్తే బాధ్యులను ప్రభుత్వం శిక్షిస్తుంది. కానీ కేవలం ప్రభుత్వానికి పేరు రాకూడదనే కక్షతో, సొంత కుల నాయకుడు ముఖ్యమంత్రి కాలేదనే అక్కసుతో వాస్తవాలను దాచి, ప్రజలను మభ్యపెడుతూ, తప్పుదోవ పట్టించేలా ఉండే కథనాలపై, అబద్ధపు వార్తలపై ఉపేక్షించే సమస్యే లేదని వైయస్ జగన్ స్పష్టం చేసారు. దీన్ని మీడియా నియంత్రణగా చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా చింత్రించేందుకు చేసే ప్రయత్నాన్ని ఖండించింది ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం. తప్పుడు ప్రేరేపిత నివేదికలపై చర్యలు తీసుకునేందుకు మంత్రివర్గ విభాగాల కార్యదర్శులకు ఇచ్చిన అధికారం మీడియాను నియంత్రించే చట్టం కాదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విధమైన జీవో ఉందని, దాని అధికారాన్ని వికేంద్రీకరించడం మాత్రమే చేసామని తెలియజేసింది. 
పారదర్శకంగా పాలన
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో పూర్తి పారదర్శకత పాటిస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా నిబంధనలకు లోబడి నిబద్ధతతో పనిచేస్తోంది. అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. గ్రామ స్థాయి నుంచీ పై స్థాయి వరకూ అవినీతికి తావు లేకుండా ముఖ్యమంత్రి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసారు. 10లక్షలు దాటిన కాంట్రాక్టును కూడా పారదర్శక విధానంలో చేపట్టేలా చర్యలు తీసకుంటున్నారు. ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రికలు ఛానెళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారం ప్రజలపై ప్రభావం చూపిస్తాయి. వాస్తవాలను వక్రీకరించి, ప్రభుత్వంపై బురదచల్లడం కాకుండా, నిజమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది. 

Read Also:కల్కి ఆశ్రమం భూములను పేదలకు పంచాలి

 

తాజా వీడియోలు

Back to Top