2004 తర్వాత మారిన ప్రాధాన్యతలుసాగునీటి రంగానికి పెద్దపీటకోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యంతో చేపట్టిన జలయజ్ఞంవైఎస్ హయాంలో కొత్తగా సాగులోకి వచ్చిన 23.49 లక్షల ఎకరాలుసాగునీటి రంగానికి వైఎస్ చేసిన కేటాయింపులు, కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టే ఆయన కృషికి రుజువు
జలయజ్ఞం.. అద్భుత సంకల్పం... కోటి ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందించి, రైతన్న భవిష్యత్తుకు భరోసాను కల్పించడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న దృఢ నిర్ణయం. భారీగా బడ్జెట్ కేటాయింపులు. అదే వేగంతో నిర్మాణాలు.. ఆయన హయాంలోనే పలు ప్రాజెక్టులు పూర్తయ్యాయి. పొలాలకు సాగునీరూ అందించారు. కానీ.. చంద్రబాబు తీరు అందుకు భిన్నం.తన తొమ్మిదేళ్లలో సాగునీటికి ప్రాధాన్యమివ్వలేదు. పునాదిరాళ్లు, ప్రచార ఆర్భాటమే ప్రత్యేకత అయ్యింది. ఈ నిజాన్ని గణాంకాలే చెబుతున్నాయి.చరిత్రను చెరిపేయడానికి ప్రయత్నించడం వృథాప్రయాసే. చరిత్రను తిరగరాద్దామనుకున్నా.. అది అందరికీ సాధ్యం కాదు. సాగునీటి రంగంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసిన కృషిని తక్కువ చేసి చూపించడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విశ్వసించే పరిస్థితుల్లో ప్రజలు లేరు. సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ప్రాధాన్యం, ఫలితంగా వివిధ ప్రాజెక్టుల కింద సాగైన బీడు భూములు, రైతుల ఇంట కురిసిన సిరులు, భారీగా నిధుల కేటాయింపు ఫలితంగా శరవేగంగా పనులు జరిగి ఆయన మరణంతో నిలిచిపోయిన ప్రాజెక్టులు, మళ్లీ చంద్రబాబు అధికారం చేపట్టాక ప్రాధాన్యం కోల్పోయిన నీటిపారుదల రంగం.. ఇవన్నీ సజీవ సాక్ష్యాలే
బాబు హయాంలో చిన్నచూపే...అరకొర కేటాయింపులే అందుకు నిదర్శనంతన హయాంలో పోలవరానికి పాలనా అనుమతీ ఇవ్వలేదుహంద్రీనీవాలో ఎకరాకు రూ.16,750 ఖర్చంటూ వ్యతిరేకించిన బాబుఇప్పుడేమో.. హంద్రీనీవా ద్వారా అనంతపురానికి నీళ్లిస్తున్న ఘనత తనదేనట!వైఎస్ చేసిన కృషిని కావాలని తక్కువగా చూపే ప్రయత్నం