రెండు పుట్టిన రోజులూ జన సమక్షంలోనే



ప్రజా సంకల్ప యాత్ర ఆరంభం
అయి నేటికి 327 రోజులు.
2017 నవంబర్ 6న మొదలైన
ప్రజాసంకల్ప పాదయాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. ఎన్ని
వ్యతిరేక శక్తులు పాదయాత్రను భగ్నం చేయాలని చూసినా, ఎందరు
కుయుక్తులతో పాదయాత్రపై బురద చల్లాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రజా
సంకల్ప పాదయాత్ర నుంచి జనం దృష్టిని మళ్లించాలని, యాత్రలో
జనమే లేరంటూ ప్రచారం చేయాలనీ చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఆటంకాలను
దాటుకుంటూ, అవరోధాలను అధిగమిస్తూ వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర అప్రతిహతంగా
మునుముందుకు సాగుతూనే ఉంది. సూదంటు రాయిలా రాష్ట్ర ప్రజలందరినీ తన వెంట నడిపిస్తూనే ఉంది. ఏ జిల్లాలోనూ, ఏ నియోజకవర్గంలోనూ , ఏ మండలంలోనూ, ఏ గ్రామంలోనూ
జగన్ రాకకై నిరీక్షించని గడప లేదంటే అతిశయోక్తి కాదు. పట్టుదలతో
ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ఈ పాదయాత్రికుడు తన రెండు పుట్టిన రోజులూ ప్రజల మధ్యే గడుస్తున్నాయి. ఇది చరిత్రలో
ఇంత వరకూ మరే నాయకుడికీ దక్కని రికార్డు.

పాదయాత్రలోనే పుట్టిన రోజులు

పుట్టిన రోజు వేడుకల కంటే
ప్రజలతో వేసే అడుగులే ఎంతో ముఖ్యమైనవి అన్నారు వైఎస్ జగన్. అందుకే
గత సంవత్సరం కూడా తన పుట్టినరోజు నాడు ప్రజల మధ్యలోనే ఉన్నారు. ఆయన్ను
చూసేందుకు కుటుంబ సభ్యులే పాదయాత్ర జరుగుతున్న ప్రదేశానికి వచ్చి జగన్ కు శుభాకాంక్షలు
చెప్పారు. సంవత్సరం గడిచిపోయింది. వైఎస్
జగన్ పుట్టిన రోజు మరోసారి వచ్చింది. ఈ ఏడాదికాలంగా వైఎస్ జగన్ ప్రజల్లోనే ఉన్నారు. ఇల్లు, కుటుంబం
వీటికంటే ప్రజలు వారి బాధ్యత ఇవే ప్రధానం అన్న తండ్రి మాటలను శాసనాలుగా అమలు చేస్తున్నారు. ఈసారి
పుట్టిన రోజును కూడా ప్రజల మధ్య, అభిమానుల సమక్షంలో, పాదయాత్రను సాగిస్తూ జరుపుకుంటున్నారు
యువనేత. వరుసగా రెండు పుట్టిన రోజులు అంటే ఒక సంవత్సర కాలంపైగా జనంతో
మమేకమై సాగుతున్న జన నేత, జన హృదయ నేత వైఎస్ జగన్. ఇంత ఎక్కువ
సమయం ప్రజలతో ఉన్న నాయకుడు దేశం మొత్తంమీద, బహుసా ప్రపంచం మొత్తం మీద వైఎస్ జగన్
ఒక్కరే. ఇదో అరుదైన అద్భుతమైన రికార్డు.

ఇది అందరి వేడుక

వైఎస్ జగన్ జన్మదినం ఆయకంటే
ఆయన అభిమానులకు, ప్రేమించే వారికి, ఆప్యాయత కురిపిస్తున్న తెలుగు ప్రజలకే
ఎక్కువ వేడుక. రాష్ట్రవ్యాప్తంగానే కాదు ప్రపంచం నలుమూలలా ఉన్న వైఎస్ జగన్
అభిమానులు ఈ రోజును ఓ పండుగలాగే జరుపుతారు. వైయస్సార్, వైఎస్
జగన్ ఆశయాలను కొనసాగిస్తూ సేవా మార్గంలో యువనేత పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఇది ఒక
నాయకుడు పంచిన ఆదర్శం.

 

Back to Top