హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన ఫ్రెడరల్ ఫ్రంట్ వేదిక హర్షించదగిన విషయమని వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్‌తో కేటీఆర్ బృందం ఫ్రడరల్ ఫ్రంట్‌పై చర్చించారు. అనంతరం వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడిన పిమ్మట ఆయన కుమారుడు కేటీఆర్ వచ్చి చర్చించారు. ఫ్రెడరల్ ఫ్రంట్.. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించాం. ప్రత్యేక హోదాను పార్లమెంట్‌ను సాక్షిగా చేస్తూ ఇచ్చిన హామీకి దిక్కు లేదు.
రాష్ట్రానికి అన్యాయం జరిగింది. దీన్ని అధిగమించాలంటే రాష్ట్రం పరిధిలోని ఎంపీల సంఖ్య పరంగా సాధ్యం కాదు కాబట్టి..25 మంది ఎంపీలకు తోడు పక్కనే ఉన్న 17 మంది ఎంపీలు కలిసి మొత్తం 42 మంది ఎంపీలు కలిసి వచ్చి పోరాటం చేస్తే కేంద్రం స్పందిస్తుంది. అప్పుడు రాష్ట్రానికి మేలు జరిగే పరిస్థితి ఉంటుంది.
ఇది స్వాగతించాల్సిన అంశం. రాష్ట్రాల హక్కులు కాపాడాలంటే సంఖ్య పరంగా పెరగాలి. అప్పుడే కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసే విషయంలో వెనుకడుగు వేస్తుంది. కేసీఆర్ వేసిన ఫ్రెడరల్ ప్రంట్ అడుగులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయం. కే టీఆర్ కూడా అదే విషయాలు చెప్పారు. మళ్లీ చర్చలకు కేసీఆర్ వస్తారని కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ చెప్పిన అంశాలపై మేం పార్టీలో సుదీర్ఘంగా చర్చిస్తాం. ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకుంటాం.రాష్ట్రానికి మేలు జరిగేలా ముందుకు వెళ్తాం.