బాబు అందం చూసి ఎవ్వరూ రారు

అనంతపురంలో నేడు జరిగిన యువభేరి కార్యక్రమం విజయవంతం అయ్యింది. జగన్ సభాప్రాంగణంలోకి అడుగుపెడుతున్న సమయంలో యూత్ జై జగన్ నినాదాలతో హోరెత్తించింది. కాబోయే సిఎమ్ జగనన్నే అంటూ యువత ఉత్సాహంతో నినాదాలు చేసారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ జగన్ పిలుపునిస్తే అది అందుకుని అవును అంటూ గొంతు కలిపారు విద్యార్థులు. ప్రొఫెసర్లు, సామాజికవేత్తలు హోదా అవసరాన్ని యువతకు వివరంగా చెప్పారు. తర్వాత ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం ఆరంభం కాగానే ప్రజలంతా ఉత్సాహంతో ఉరకలేసారు. ఆయన ప్రసంగంలోని కొన్ని విషయాలకు సభ అంతా చప్పట్లు, ఈలలతో దద్దరిల్లిపోయింది. జగన్ ప్రసంగంలో యూత్ ను ఎంతగానో మెప్పించిన కొన్ని పంచ్ లు ఇవే-

చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి పరిశ్రమలు రావు-
స్పెషల్ స్టేటస్ ఉంటే, రాయతీలు ఉంటే పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయి.
ఎన్నికలైపోయాయి – ప్రజలతో పనైపోయింది అనుకుంటున్నాడు చంద్రబాబు.
పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలి.
పాలకులకు చెవుడు ఉంది అందుకే మనం గట్టిగా అడగాలి.
అవసరానికి వాడుకోవడం, అవసరం తీరాక వెన్నుపోటు పొడవటం బాబు నైజం
ఎయిమ్స్ కి అనుబంధ కేంద్రం ఏర్పాటు చేస్తానన్నాడు బాబు -
కాని ఉన్న హాస్పటల్ లోనే ఎమెర్జెన్సీ వైద్యానికి కూడా దిక్కులేదు. 
జరగబోయే పాదయాత్రలోనూ హోదా కోసం ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ ముందుకు సాగుతాను.
హోదాకోసం అవసరమైతే ఎమ్ పిలతో రాజీనామా కూడా చేయిస్తాం.
ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన యువభేరి అనంతపురం యువతలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. ప్రతిపక్ష నేత తోడుగా ఉంటే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని అనంత యువ వాహిని యువభేరి మోగించి మరీ చెప్పింది. Back to Top