నంద్యాలలో నవరత్నాలు

నంద్యాల మొత్తం ఇప్పుడు ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. నువ్వా నేనా అంటూ సాగిన ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడనుంది. అవినీతిని ఎండగడుతూ జగన్ ప్రచారం చేస్తే... వరాల జల్లు కురిపిస్తూ బాబుగారు మరోసారి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు చంద్రబాబు వాగ్దానాలకంటే నంద్యాలలో నవరత్నాల సందడే ఎక్కువగా ఉందట. ప్రతి ఒక్కరూ వాటి గురించి చర్చించుకుంటున్నారట. ఇటీవల జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీలో జగన్ ప్రకటించిన నవరత్నాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అవి తెలుగువారందరికీ మరోసారి వైయస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలనను గుర్తుచేశాయన్నది నిర్వివాద అంశం. అయితే ఉప ఎన్నిక సమరానికి ముగింపు పలకడానికి సిద్ధమైన నంద్యాల నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు అవే నవరత్నాలను ఒక్కసారి మననం చేసుకుంటున్నారనేది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం.
  • రైతులకు వైయస్సార్ భరోసా పేరిట ఏటా రూ.50 వేలరూపాయలు 
  • డ్వాక్రా మహిళలకు అండగా వైయస్సార్ ఆసరా పథకం
  • వృద్ధులకు నెలకు రూ.2000 రూపాయల పెన్షన్
  • జలయజ్ఞం
  • ఆరోగ్యశ్రీని మళ్లీ గాడిలో పెట్టడం
  • దశలవారీ మధ్యనిషేధం 
  • ఫీజు రీఎంబర్స్ మెంట్
  • ప్రతి ఒక్కిరికి విద్యను అందించేలా అమ్మ ఒడి పథకం
  • నిరుపేదలకు 25 లక్షల ఇళ్లు నిర్మించడం....
ఇలా నవరత్నాల్లాంటి పథకాలు నంద్యాల ప్రజలను ఆలోచింపజేస్తున్నాయట. ఇవన్నీ 2019 ఎన్నికల్లో విజయం సాధించాక చేస్తానని చెప్పినవే అయినా సరే... ఆ కురుక్షేత్ర యుద్ధానికి నంద్యాల విజయం నాంది పలకాలని జగన్ కోరడంతో...  ప్రజల దృష్టి నవరత్నాల వైపు మళ్లిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Back to Top