పార్లమెంటులో కార్యాచరణ

రేపటి నుంచి ప్రారంభమయ్యే
పార్లమెంటు సమావేశాల్లో వైఎస్సార్సీపీ ఏ ఏ అంశాల మీద ద్రష్టి పెట్టాలనే దానిపై
పార్టీ పరంగా లోతుగా చర్చ జరిగింది. పార్లమెంటు సమావేశాలకు ముందు పార్టీ ఎంపీలను
పిలిచి చర్చించటం అధ్యక్షులు వైఎస్ జగన్ కు అలవాటు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి  అనుగుణంగా పార్లమెంటరీ పార్టీ సమావేశం
నిర్వహాంచారు.

ఈ సారి పార్లమెంటు
సమావేశాలు జరగబోయే తీరు తెన్నుల్ని పార్టీ ఎంపీలు 
అంచనా వేశారు. పార్లమెంటు సెషన్స్ లో హైలెట్ అయ్యే అవకాశం ఉన్న అంశాల్ని
చర్చించారు. పార్టీ పరంగా ఎంపీలు ద్రష్టి పెట్టాల్సిన అంశాల మీద లోతుగా చర్చించారు.
ముఖ్యంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా మీద ప్రధానంగా ద్రష్టి
పెట్టాలని పార్టీ అధ్యక్షులు దిశ నిర్దేశం చేశారు. ఒక వైపు అధికారంలో ఉన్న
తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా మీద కావాలని అడగడానికి సిద్ధంగా లేదు.  ఈ విషయాన్ని తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్
రెడ్డి స్వయంగా చెప్పనే చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ప్రజల అవసరాలకు అనుగుణంగా
స్పందించే లక్షణం తెలుగు తమ్ముళ్లకు లేనే లేదని చెప్పుకోవాలి. ప్రత్యేక హోదా అంటే
ఒక సంజీవని యా అంటూ సెటైర్లు వేసిన చంద్రబాబు నాయకత్వంలోని పార్టీకి ధీటుగా
పనిచేయాలని నిర్ణయించారు.

వీటితోపాటు ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు అయిన
కరవు, రైతాంగ సమస్యలు, కొన్ని రోజులుగా విరుచుకు పడిన వరదలు వంటి అంశాల్ని ప్రస్తావించాలని
నిర్ణయించారు. వీటిపై అధ్యయనం చేసి సమావేశాలకు వెళ్లేట్లుగా ఎంపీలకు అధ్యక్షులు
వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని
గుర్తించి వాటిని ప్రజా స్వామ్య దేవాలయంలో ప్రస్తావించేలా నిర్ణయించారు. 

Back to Top