రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీకి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన వినతిపత్రం పూర్తిపాఠం ఇది... శ్రీయుత ప్రణబ్ ముఖర్జీ గారికి, మాన్య రాష్ట్రపతి, రాష్ట్రపతి భవన్, న్యూ ఢిల్లీ.   తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ఒక తెలుగుదేశం ప్రజా ప్రతినిధి చే త తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేయించిన అనైతిక విధానాల్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకు కోట్లాది రూపాయల సొమ్మును ఇవ్వచూపుతూ ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రమేయం పూర్తిగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువంటి చర్యలకు పాల్పడటం అంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని గుర్తుంచుకోవాలి. ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎమ్మెల్యే చాలా స్పష్టంగా తమ బాస్ చెప్పిన సూచనల ప్రకారం నడుచుకొన్నానని చెప్పటం జరిగింది. దీంతో పాటు సదరు ఎమ్మెల్యే నేరుగా చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడటం జరిగింది. దీన్ని బట్టి జరిగింది అర్థం అవుతోంది. ఒక ముఖ్యమంత్రి ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతూ చిక్కినప్పటకీ, వదిలిపెట్టేయటం అంటే ముఖ్యమంత్రి కదా అని వదిలేసినట్లు అవుతుంది. మహానాడు సదస్సులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. పార్టీ ఇక నుంచి జాతీయ పార్టీగా మారుతోందని, చంద్రబాబునాయుడు పార్టీకి జాతీయ అధ్యక్షుడు అని చెప్పుకోవటం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ పని చేయటంలో రేవంత్ రెడ్డి పాత్ర అప్పగించిన పనిని పూర్తి చేయటం అని అర్థం అవుతోంది. అత్యున్నత పదవిలో ఉండటం, పార్టీ అగ్ర స్థానంలో ఉండటం వంటి కారణాలతో దీనికి ప్రాధాన్యం పెరిగింది. దీని మీద జాతీయ స్థాయిలో దృష్టి కేంద్రీకృతమైందనే చెప్పుకోవాలి. ఇటువంటి చీడ సాంప్రదాయాల్ని, అవినీతిని అధికారాన్ని విచ్చలవిడిగా వాడుకోవడాన్ని పారదోలేందుకు మన భారతీయ పార్లమెంటరీ వ్యవస్థలో అంతర్గతంగా ఏర్పాట్లు ఉండనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ చర్యలకు పాల్పడింది. మేం ఆంధ్రప్రదేశ్ లో ప్రదాన ప్రతిపక్షంగా ఉన్నాం. ప్రజలందరి ముందు ఈ అవినీతి బాగోతం బట్ట బయలైంది. తెలుగుదేశం చేసిన అవినీతి చేష్టల్ని ఏసీబీ అధికారులు వీడియోలో చిత్రించారు. ఆయన(రేవంత్‌రెడ్డి) బాస్ సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నట్లు ఇందులో వెల్లడైంది. ఒక్క ఓటు కోసం కోట్లు కుమ్మరించటం అంటే తెలుగుదేశం పార్టీ ఏ రీతిన విచ్చల విడిగా కోట్లాది రూపాయలతో అవినీతికి పాల్పడుతోందనేది అర్థం అవుతోంది. ఎక్కడ నుంచి ఈ కోట్లాది రూపాయలు వచ్చాయనేది అధికారులు కనుక్కోవటం ముఖ్యం. ఎందుకంటే ఒక్క ఓటుకే ఇన్ని కోట్లు అంటే ఇతర ఎమ్మెల్యేలను కొనేందుకు ఎంత మొత్తం వెచ్చిస్తారు అనేది అర్థం అవుతుంది. ఈ డబ్బుకు మూలం ఏమిటనేది కనుక్కోవటంతో పాటు మూల సూత్ర ధారిగా నిలిచిన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర పై పూర్తి నిర్ధారణ అవసరం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పాత్ర స్పష్టంగా నిర్ధారణ అయ్యాక కూడా మొట్ట మొదటి నిందితుడుగా చంద్రబాబు పేరు పెట్టకపోవటంలో కారణం కనిపించటం లేదు. ఏసీబీ అధికారులు వెంటనే ఆయన పేరుని ఈ నోటుకి ఓటు కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా చేర్చాలి. అప్పుడే ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటంతో పాటు దర్యాప్తు సంస్థల మీద ఎటువంటి ప్రభావాలు పడటం లేదన్న సంగతి రూఢి అవుతుంది. ఇందులో వాస్తవాల్ని దాచిపెట్టేందుకు కొన్ని శక్తులు ్రపయత్నిస్తున్నాయనేది మా అనుమానం. అందుచేత నే న్యాయం కోసం మే మిమ్మల్ని కలుస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఏరులై పారుతోంది. అత్యధికంగా అవినీతి చోటు చేసుకొంటున్న కొన్ని దృష్టాంతాల్ని ఇక్కడ పొందుపరుస్తున్నాం.  1. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో టెండర్ల ఖరారును చూస్తే అర్థం అవుతుంది. నచ్చిన కాంట్రాక్టర్ కు ఇచ్చుకొనేందుకు వీలుగా నిబంధనల్ని మార్చుకొన్నారు. దీంతో ఇద్దరు మాత్రమే పాల్గొన్నారు. 21.9శాతం అదనంగా కోట్ చేశారు. ఇందులో ఐదు శాతాన్ని అదనంగా చూపించి, మిగిలిన 16.9 శాతాన్ని బోనస్ గా చూపించారు. ఎందుకని ఇలా చేశారనేది అందరికీ తెలుస్తునే ఉంది.2. గవర్నర్ పక్కన పెట్టేసినప్పటికీ, పట్టుబట్టి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎమ్ ఎస్ నెం.22 ను విడుదల చేయించింది. దీంతో కాంట్రాక్టర్లకు అదనపు లబ్ది చేకూరటంతో పాటు గా ఆ మేరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోంది. 3. కొన్ని డిస్టిల్లరీ సంస్థలకు మాత్రమే మద్యం అదనపు ఉత్పత్తి చేసేందుకు అనుమతి ఇవ్వటం జరిగింది. ఈ సంస్థలు బాగా దగ్గర వారివన్న ప్రచారం ఉంది. అందుకే వాటికి అనుమతులు దక్కాయని చెబుతున్నారు. మిగిలిన సంస్థలు మాత్రం ఇంకా అనుమతుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి.4. కొన్ని పరిశ్రమలకు మాత్రమే ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించటం జరిగింది. అడగకుండానే ఇష్టానుసారంగా వీటిని కేటాయించారు. అదే సమయంలో ఎప్పటినుంచో అడుగుతున్న వి అలాగే ఉండిపోయాయి.5. వైఎస్సార్ జిల్లా లోని రాజంపేట ప్రాంతంలో ఖనిజ సంపద సమృద్ధిగా ఉందన్న సంగతి మీకు తెలుసు. రైల్వే కోడూరు కు చుట్టుపక్కల ఉన్న 200 బెరైటీస్ యూనిట్లు దాదాపుగా 40వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ చిన్న సంస్థలకు ముడి సరుకు సరఫరాను నిలిపివేశారు. అంతే కాకుండా అయిన వారికోసం పెద్ద సంస్థల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ చర్యలతో వేలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు.6. సహజ వనరుల్ని తెలుగుదేశం కార్యకర్తలు కొల్లగొట్టేందుకు వీలుగా ఇసుక క్వారీ విధానాన్ని రూపొందించారు. స్వయం సహాయక బృందాల పేరుతో వీటిని కేటాయించారు. వాస్తవానికి ఈ స్వయం సహాయక బృందాలు చాలా వరకు తెలుగుదేశం పార్టీయుల బినామీలే. కోట్లాది రూపాయిల్ని దొడ్డిదారిన మళ్లించేందుకే ఈ మార్గాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. దీంతో ఇసుక రేట్లు 3 నుంచి 5 రెట్లు పెరుగుతున్నాయి. సామాన్యుడు పూర్తి గా నష్టపోతున్నారు. పైగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి.7. రాజధాని నిర్మాణం కోసం స్విస్ చాలె ంజ్ విధానాన్ని అనుసరించటం తో కొన్ని నిర్ణీత రియల్ ఎస్టేట్‌కంపెనీలకు ప్రయోజనం కలుగుతోంది. ఇందులో భారీ మొత్తంలో చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది.8. 24 గంటలూ పూర్తి స్థాయిలో విద్యుత్ ను అందిస్తామన్న నెపంతో కొన్ని సంస్థలతో పీపీఏ తరహాలో ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. దీని వల్ల కొన్ని ప్రైవేటు ఉత్పాదక సంస్థలకు లబ్ది కలుగుతుంది. ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం కలగనుంది.9. గడచిన ఏడాది కాలంలో అంత ర్జాతీయ మార్కెట్ లో బొగ్గు ధరలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, కొన్ని ప్రైవేటు సంస్థల ప్రయోజనం కోసం అధిక ధరలు చెల్లించి బొగ్గును కొనటం జరగుతోంది.10. పేదలకు అంటే తెల్లరంగు రేషన్ కార్డు దారులకు కొన్ని నిత్యావసర వస్తువులు సరఫరా చేసే చంద్రన్న కానుక పథకాన్ని కూడా అవినీతి మయం చేసేశారు. టెండర్లు పిలవకుండానే నామినేషన్ విధానంలో కొంతమంది సరఫరా దారుల్ని ఎంపిక చేసి అధిక ధరలు చెల్లించి వస్తువులు కొనేశారు. కనీసం నాణ్యతను కూడా పట్టించుకోలేదు. ఈ ఉదాహరణల్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి పరవళ్లు తొక్కిందన్న సంగతి అర్థం అవుతుంది.అందుచేత సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, అసలు నేరస్తుల్ని ఆధారాలతో సహా పట్టుకోవాలని, ఈ నేరానికి ప్రధాన సూత్రధారి అయిన తెలుగుదేశం అధ్యక్షుడి పేరుని ఇందులో చేర్చాలని మేం కోరుతున్నాం. ఈ మేరకు సంబంధిత అధికారుల్ని ఆదేశించాలని మేం మిమ్మల్ని కోరుతున్నాం. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో అత్యున్నత స్థాయిలో జరుగుతున్న అవినీతి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం జరిపించాలని కోరుకొంటున్నాం.  ఇట్లు, వైఎస్ జగన్మ్హోహన్ రెడ్డి