ఏం చేసావని మళ్లీ వస్తావ్ బాబూ??!!

  

నాలుగేళ్లుగా రాజధానిని
గ్రాఫిక్స్ లో చూపిస్తున్నావ్.

వ్యవసాయరంగానికి, రైతులకు నోట్లో మట్టికొట్టావ్.

మద్యం బెల్టు షాపుల
రద్దు అని చెప్పి సందుకో బెల్టు షాపు నీ పచ్చతమ్ముళ్లతో నడిపిస్తున్నావ్

పోలవరం 2018 అని చెప్పి ఇప్పుడు
మళ్లీ మాట మారుస్తున్నావ్

హోదా గురించి దాగుడుమూతలాడి, ఇప్పుడు నోరు మూసుకున్నావ్

కేసులు, కోర్టు నోటీసుల తలబొప్పిని
అమెరికా సదస్సుల టోపీలతో కవర్ చేస్తున్నావ్

డ్వాక్రా రుణమాఫీకి
పైసా కూడా ఇవ్వకుండా, ఇచ్చేసామని చెబుతూ సంతకాలు పెట్టించుకుంటున్నావ్

పేద మహిళలకు స్మార్ట్
ఫోన్లు అని చెప్పి, నీ పార్టీ ప్రచారం చేయడానికి అంగన్ వాడీలకు ఫోన్లు ఇచ్చి, నీ ఫొటోలకు, ఫోజులకు లైకులు కొట్టమని
వేధిస్తున్నావ్..

ఇంటికో ఉద్యోగం అని
మాకుచెప్పి మతి లేని నీ కొడుక్కి మంత్రి పదవి కట్టబెట్టావ్.

నిరుద్యోగులకు 2000 ఇస్తాననినాలుగేళ్ల
కిందట చెప్పి, ఇప్పుడు 1000 ఇవ్వడానికి కూడాఆరు
నెలలుగా దొంగలెక్కలేస్తున్నావ్.

గిరిజన కుటుంబాలకు భూములు, ఇళ్లు అన్నావ్.వాళ్ల ఎమ్మెల్యేని కొనేసి వాళ్లకే మొండిచేయి చూపించి, చివరకు ఆ గిరిజన నేతను అవినీతిలో ఇరికించి, మావోయిస్టులకు బలిచేసావ్.

ముస్లిం విద్యార్థులకు
ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాల, కాలేజ్ అన్నావ్. ఉర్దూ యూనివర్సిటీ అన్నావ్..మైనారిటీకి ఒక్క మంత్రి
పదవి కూడా ఇవ్వకుండా మోసం చేసావ్.

పూజారులకు పదవీ విరమణ
ఉండదని ఆ ఎన్నికల ముందు చెప్పావ్...తిరుపతిఆలయంలో గుప్తనిధుల తవ్వకాల గురించి బైటపెట్టిన అర్చకుడిని
అన్యాయంగా వేధించి మరీ పదవినించి తీసేసావ్.

బిసిలకిచ్చిన 120 హామీలు తుంగలో తొక్కావ్

ఇచ్చిన హామీలు ఒక్కటీ
నెరవేర్చకుండా 96 శాతం చేసా...101శాతం చేసా అంటూ పచ్చి అబద్ధాల కోతలు కోస్తున్నావ్...

ఈసారి నీకు
గెలిచే అవకాశం కాదు కదా...ఓటేసే అవకాశం కూడా ఉండకూడదు అని కోరుకుంటున్నారు
ఆంధ్రాప్రజలు.

 

 

 


తాజా ఫోటోలు

Back to Top