మభ్య పెట్టి మోసగించటం బాబుకి వెన్నతో పెట్టిన విద్య


() హైదరాబాదీలను మోసగిస్తున్న చంద్రబాబు

() గాలికి వదిలేసిన బాబు

() సత్య వాక్యాలు పలుకుతున్న బాబుపై మండిపాటు

 

హైదరాబాద్) “తెలుగువారు ఎక్కడ ఉన్నా మనవారే. వారిని
ఆదుకోవటానికి మా ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుంది.“ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో చంద్రబాబు
20 సార్లు అయినా ఇటువంటి ప్రకటనలు చేసి ఉంటారు. కానీ వాస్తవంలో మాత్రం ఇందుకు
భిన్నంగా ప్రవర్తించారు.

ఎన్నికల సమయంలో కోలాహలం

2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు మాయ మాటల్ని హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర
ప్రజలు బాగా నమ్మారు. అందుకే తెలంగాణ అంతటా టీడీపీని ఓడించినప్పటికీ జంట నగరాలలో
ఎక్కువ సీట్లు కట్టబెట్టారు. అంతే కాదు. చాలా మంది సీమాంధ్ర ప్రజలు వాహనాలు పెట్టుకొని
మరీ ఏపీకి వెళ్లి చంద్రబాబు పార్టీకి ఓటు వేసి వచ్చారని కథలుగా చెబుతుంటారు.
చంద్రబాబు అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తాడని నమ్మారు. నిజంగానే అద్బుతాలు
చేసి చూపించాడు కూడా

రుణమాఫీ లో షాక్

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రుణమాఫీని పూర్తిగా గాలికి వదిలేశారు.
అక్కడక్కడా కొంత మంది కి మాత్రం బ్యాంకు అకౌంట్ల లో రుణమాఫీ కింద కొంత మొత్తం
విదిలించారు. ఆయన ఇచ్చిన డబ్బు మొత్తంగా చూసుకొన్నా..రైతుల అప్పుల మీద వడ్డీలో
మూడోవంతుకు కూడా సరిపోలేదు. అయితే ఈ కాస్తపాటి డబ్బు కూడా హైదరాబాద్ వాసులకు
అందలేదు. హైదరాబాద్ ఆధార్ కార్డు ఉన్న వారు రుణమాఫీకి అనర్హులు అని ఒక్క కలం
పోటుతో రద్దు చేసేశారు.

పిల్లల చదువులకు సైతం షాక్

ఆంధ్ర పిల్లలు ఎక్కడ చదువుకొన్నా ప్రోత్సహిస్తాం అని కబుర్లు చెప్పే చంద్రబాబు
వాస్తవంలో దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 40వేల మంది సీమాంధ్ర
విద్యార్థులు ఫీజు రీఇంబర్స్ మెంట్ పథకం కింద జంట నగరాల కాలేజీల్లో చదువుతున్నారు.
ఈ విద్యార్థుల్ని ఆదుకొంటామని చంద్రబాబు మొదలు టీడీపీ నేతలు పదే పదే చెబుతూంటారు.
కానీ వాస్తవంలో మాత్రం ఒక్క రూపాయి విదిలించటం లేదు. దీంతో విద్యార్థుల్ని ఫీజుల
కోసం యాజమాన్యాలు నిలదీస్తున్నాయి. ఈ పాస్ కింద వెబ్ సైట్ లో చెక్ చేసుకొంటే
రాష్ట్రాంతర సమస్య అంటూ దర్శనం ఇస్తోంది. దీంతో చదువులు ఆపుకోలేక, కొనసాగించుకోలేక
కాలేజీల్లో అవమానాలు ఎదుర్కొంటున్నారు. ప్రజల్ని ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్న
చంద్రబాబు మాత్రం నవ నిర్మాణ దీక్ష పేరుతో ఉత్సవాలు, ప్రతిజ్నలు, వేడుకలు
జరిపిస్తున్నారు. ప్రజల్ని అదే పనిగా మభ్య పెడుతున్నారు.

 

Back to Top