ఈ ఆర్తి...భ్రమరావతి బండల గుండెల్ని తాకేనా....?

మా జగనన్నను సీఎంను చేయాలన్నదే నాన్న కోరిక

మా కుటుంబంపై అసత్య ప్రచారాలు మానుకోండి

హత్య ఎవరు చేశారన్నది విచారణలో తేలుతుంది

విచారణ నిష్పక్షపాతంగా జరగనివ‍్వండి

మానాన్నకు ప్రజలంటే ప్రాణం. కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యమనుకునే వ్యక్తి. కుటుంబం పట్ల కూడా ఆయన ప్రేమ తక్కువేమీ కాదు. అందరం ఆయన ప్రేమను అనుభవించినవాళ్లమే. ఆప్యాయతలు చవిచూసినవారమే. నాన్న నాకందించిన ప్రేమ మాటల్లో చెప్పలేనంత. అలాంటి నాన్న లేరన్న బాధ గుండెల్ని పిండేస్తోంది. అంతకన్నా ఎక్కువగా...ఆయన మరణం తర్వాత పేపర్లలో...టీవీ ఛానల్స్‌లో వస్తున్న వార్తలు బాధిస్తున్నాయి.

చనిపోయిన మనిషి విషయంలో కనీస మర్యాద చూపని వార్తలు కుమిలిపోయేలా చేస్తున్నా...వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్యపై స్పందిస్తూ...ఆయన ఏకైక కుమార్తె మీడియా ముందు మాట్లాడిన మాటలివి. 

’సిట్‌ని వేశారు. దాని పని దానిని చేసుకోనిస్తున్నారా? సిట్‌పైన కూర్చున్న వారే ఫైండింగ్స్‌ చేసేశామంటున్నారు. కన్‌క్లూజన్స్‌కు ఇచ్చేస్తున్నారు. పైవాళ్లే జరిగింది ఇదే  అని చెబుతుంటే...అది ఇన్వెస్టిగేషన్‌ మీద ప్రభావం చూపదా?’ అని వివేకానందరెడ్డి కుమార్తె సునీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకిలా చేస్తున్నారో? ఇలా చేయడం వల్ల ప్రజల్లోకి రాంగ్‌మెసేజ్‌ పోదా? అలా పోవడమే వీరికి కావాలి? మా కుటుంబంపై నెగెటివ్‌ ప్రచారం చేయడానికి రాజకీయనాయకులు చాలా మాట్లాడుతున్నారు. సాక్షాత్తూ సీఎంగారు ప్రచారసభలోనూ అలాగే మాట్లాడుతున్నారని మీరు చెబుతుంటే...చాలాచాలా బాధేస్తోంది. 

మాకుటుంబం చాలా పెద్దది. దాదాపు 700మంది కలిసికట్టుగా వున్న కుటుంబం మాది. అన్ని కులాలవారు, మతాల వారు, ఇతర రాష్ట్రాలవారు, ఇతర దేశాల వారు కూడా మా కుటుంబ సభ్యుల్లో వున్నారు.  ఎప్పుడైనా అభిప్రాయాల్లో ఏకాభిప్రాయం కుదరపోవచ్చుకానీ, అంతమాత్రాన గొడవలు పడుతూ కూర్చోవడం మాకు తెలీదు.  ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి అభిప్రాయభేదాలు వస్తుంటాయి.పోతుంటాయి. అలాంటివే మా కుటుంబంలోనూ. నాన్నను ఇంత పాశవికంగా ఎవరు చంపారు అన్న విషయాన్ని బయటకు తీయాల్సింది పోయి,  మా కుటుంబపైనే అనుమానాలు సృష్టించడం...ఎంత దారుణం? అని ఆమె ప్రశ్నించారు. అమ్మ అనారోగ్యం వల్ల నాదగ్గర వుంది. నాన్న పులివెందుల్లో వున్నారు. అయినా ఆయనకు అన్నివేళలా దగ్గరుండి చూసుకునేవారున్నారు. ఆయన ఎవరికీ శత్రువు కాదు. అలాంటి నాన్నకు ఎందుకిలా జరిగింది అన్నదే మా బాధ. 

నాన్నది ఒకటే ఒక లక్ష్యం. జగనన్నను సీఎంను చేయాలి. జగనన్నను సీఎంగా చూడాలి అన్న లక్ష్యం కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలాంటి సమయంలో ఇలాంటి దారుణం జరగడమంటే..ఆలోచించాల్సిన విషయం కాదా? కేవలం కుటుంబసభ్యులపై తోసేసి...రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటే ఎలా అన్నది డాక్టర్‌ సునీత మనోవేదన.

నాన్న గురించి రాజకీయనాయకులు చేస్తున్న ప్రచారాలన్నీ ట్రాష్‌. చెత్తను చెబుతున్నారు. చెత్తను రాస్తున్నారు. అసలు విషయాన్ని మరుగు పరుస్తున్నారు. దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడుతున్నారు....అని బాధపడుతూ...దయచేసి మా కుటుంబాన్ని బాధపెట్టకండి అని వేడుకున్నంత పనిచేశారామె. గాయపడ్డ గుండె మనోవేదనను  మొదటిసారి మీడియా ముందుకొచ్చి చెప్పారు. మరి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తూ...తామెప్పుడో దర్యాప్తు చేసేశాం..నిజం కనిపెట్టేశామన్నట్టుగా మాట్లాడుతున్న నాయకులు చేస్తున్నది తప్పని...  వై.ఎస్‌. వివేకానందరెడ్డి కూతురు అన్యాపదేశంగానే చెప్పకనే చెప్పారు. 

అబద్దాలను పట్టుకునే మనుగడ సాగించే  రాజకీయానికి ....ఎదుటివారి బాధలు అర్థమవుతాయా? 

ఇప్పటికే చూశారా? తమ్ముళ్లు...కడిగేశారు..కడిగేశారు అంటూ ముఖ్యమంత్రి హోదాను కూడా మరిచిపోయి...నాలుగుఓట్లను పొందాలనే యావతో మన చంద్రబాబుగారు మాట్లాడేస్తున్నారు. స్వంత ఇంట్లోనే మర్డర్‌. అలాంటివారు అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏమైపోతుందన్నట్టుగా లేని గుండెను బాదుకుంటున్న నారాచంద్రబాబుగారు.... అధికారం కోసం వెన్నుపోటు, అధికారం కోసం నీతిమాలిన ప్రచారాలు చేస్తూ...ఆ విధంగా ముందుకు పోతూ...ఇంకెంత పాపం మూటగట్టుకుంటారు. 

తాజా వీడియోలు

Back to Top