వైఎస్ జగన్ టాప్ టెన్ కామెంట్లు..!

విశాఖపట్నం) చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలు, తప్పిదాల్ని ప్రతిపక్షనేత,
వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ తూర్పారబట్టారు. విశాఖ జిల్లా పార్టీ
అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ దీక్షను విరమింప చేసిన తర్వాత ఆసుపత్రి దగ్గర ఆయన
మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని టాప్ టెన్ కామెంట్లు ఇప్పుడు చూద్దాం.

1.   
చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయింది. ఇప్పటిదాకా పునర్ వ్యవస్థీకరణ
చట్టంలోని హామీల మీద ఎందుకు మాట్లాడటం లేదు.

2.    ప్రత్యేక
హోదా గురించి వైఎస్సార్సీపీ తరపున అడుగుతున్నాం కాబట్టి అది బతికి ఉంది లేకపోతే
దాన్ని పట్టించుకొనేవారే ఉండరు.

3.    ప్రత్యేక
హోదా, పోలవరం, రైల్వే జోన్ కు సంబంధించి ఇప్పటిదాకా ఎందుకు అడగటం లేదు.

4.   
అబద్ధాలు చెప్పడం, మోసం చేయడమే
బాబు నైజం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తున్నారు.

5.   
బాబుకైతే ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది కానీ, ప్రజలకు ఒక్క ఉద్యోగం వచ్చినది
లేదు. పైగా ఉన్న ఉద్యోగాల్ని ఊడబెరుకుతున్నారు.

6.   
ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్ మీద కేంద్రం హామీలను ఎందుకు అమలు చేయటం
లేదు, కేంద్రంలో ఇంకా మీ మంత్రుల్ని ఎందుకు కొనసాగిస్తున్నారు.

7.   
అవినీతి సొమ్ములతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం బయట పడుతుందనే చంద్రబాబు
కేంద్రాన్ని ప్రశ్నించటం లేదు.

8.   
దమ్మూ ధైర్యం ఉంటే అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల చేత రాజీనామా
చేయించు, లేదా అనర్హుల్నిగా చేయించు

9.   
ప్రజల్లోకి వెళదాం. నీ మీద నమ్మకం ఉందో, మా మీద నమ్మకం ఉందో తేలిపోతుంది.

10.   అందరం కలిసికట్టుగా రైల్వే జోన్ కోసం
ఉద్యమిద్దాం. ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దాం.

 

Back to Top