ప్రతిపక్ష నేత
వైఎస్ జగన్ చింతపల్లి బహిరంగ సభలో గిరిజనుల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని
నిలదీశారు. బాక్సైట్ తవ్వకాల కోసం చంద్రబాబు కుట్రల్ని ఆయన ఎండగట్టారు. ఆయన
ప్రసంగంలోని టాప్ టెన్ కామెంట్స్:
- గ్రామసభ జరిగి ఉంటే పుస్తకాల్లో ఉండాలి.. అవి
కూడా ఏమీ లేవని ప్రస్తుత సర్పంచి చెప్పారు. గ్రామాలు ఏవీ అంగీకరించకపోయినా
చంద్రబాబు అబద్ధాలు చెబుతూ ముందుకెళ్లిపోతున్నారు. శ్వేతపత్రంలో ఇవే అబద్దాలు
పలికించి చూపించారు.
- ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఎందుకు వేయడం లేదని
చంద్రబాబును గట్టిగా నిలదీస్తున్నా. కారణం ఏమిటంటే రాష్ట్రంలో మొత్తం 7 గిరిజన స్థానాలుంటే ఆరింటిలో వైఎస్ఆర్‌సీపీ
సభ్యులున్నారు. కమిటీ వేస్తే, అందులో
అంతా వైఎస్ఆర్‌సీపీ సభ్యులే ఉంటారు కాబట్టి, బాక్సైట్‌కు
అనుకూలంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోలేరు కాబట్టి గిరిజన సలహా కమిటీ
నియామకాన్ని కూడా వాయిదా వేస్తున్నారు
- మీరు చేసేదేమీ ఎక్కువ రోజులు సాగదు. ఒత్తిడి
తెచ్చి, గిరిజన సలహా కమిటీ
వేయించి, అందులో గట్టిగా
వ్యతిరేకిస్తాం
- గిరిజనులతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని
కేంద్రం చెప్పడంతో మనం బతికిపోయాం
- చంద్రబాబు సీఎం అయ్యాక ఒకటి కాదు, రెండు కాదు.. 10.2.2015న ఒకటి, 23.2.2015, 21.7.2015, 5.8.2015న ఇంకోటి.. ఇలా
వరుసపెట్టి లేఖలు కేంద్రానికి రాసి, ఒత్తిడి
తెస్తేనే బాక్సైట్ తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
- ప్రభుత్వం జీవో ఇస్తే చేస్తుంది, ఉపసంహరించుకుంటే చేయదు. మధ్యలో పెండింగులో
పెట్టడం ఏ ముఖ్యమంత్రి దగ్గరా వినలేదు.
- చంద్రబాబు జీవితం అంతా మోసం.. మోసం.. మోసం..
అన్న మూడు పదాల చుట్టే తిరుగుతుంది.
- బాక్సైట్ తవ్వకాలకు ఆయన అనుమతి ఇచ్చినా ఒక్క
అంగుళం కూడా ముందుకు కదలదు
- నువ్వు(చంద్రబాబు) నిజంగా మంచోడివైతే, మాటమీద నిలబడే తత్వం ఉంటే వెంటనే జీవోను రద్దు
చేసి, మాట నిలబెట్టుకోండి.
- అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం, అండగా ఉంటాం. అన్ని రకాలుగా మనం గట్టిగా పోరాడుదాం.