అయిన వారి కోసం ఆగాల్సిందే

రాజధాని పనుల్లో మరో విచిత్రం
కన్సల్టెన్సీ ఎంపికలోనూ అదే సూత్రం
సాకులు చెబుతూ తాత్సారం
మాస్టర్ డెవలపర్ కే కేటాయించే చాన్సు

విజయవాడ: రాజధాని నిర్మాణం పూర్తిగా సొంత ప్రక్రియ లా చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తోంది. మేనేజిమెంటు కన్సల్టెన్సీ ఎంపిక కూడా ఇదే కోవలో నిలుస్తోంది.

కన్సల్టెన్సీల మయం
రాజధాని అంటే కొన్ని భవనాలు, దానికి కావలసిన మౌళిక సదుపాయాలు. కానీ, దీని కోసం కుప్పలు తెప్పలుగా కన్సల్టెన్సీలను నియమిస్తున్నారు. ఈ కన్సల్టెన్సీలకు ఇచ్చే ఫీజులు లక్షల్లో ఉంటున్నాయి. ఇదంతా ప్రజల కష్టార్జితమే అని వేరే చెప్పనక్కర లేదు. ఈ కన్సల్టెన్సీలు ఇచ్చే నివేదికల కోసం ఈ స్థాయి హంగామా చేస్తూనే ఉన్నారు. 

మేనేజిమెంటు వ్యవహారం
అన్నీ కన్సల్టెన్నీల్లోనూ మేనేజిమెంటు కన్సల్టెన్సీ కు మరింత గ్లామర్ ఉంటుంది. అందుకే దీన్ని దక్కించుకొనేందుకు చంద్రబాబు కోటరీ నేతలు పావులు కదుపుతున్నారు. నచ్చిన సంస్థలకే ఇప్పించాలని పట్టు పడుతున్నారు. ఇప్పటికీ రెండు సార్లు టెండర్లు పిలిచినప్పటికీ ఉన్నతాధికారులు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. చివరకు మాస్టర్ డెవలపర్ మాదిరిగానే దీన్ని కూడా చాప చుట్టేసి అయినవాళ్లకు అప్పగిస్తారన్న మాట కూడా ఉంది.

పట్టిసీమ టెండర్ల విషయంలో జరిగిన గోల్ మాల్ ను ఈ సందర్భంగా గుర్తు చేసుకొంటున్నారు. అనేక ఇంజనీరింగ్ సంస్థలు పోటీ పడినప్పటికీ సొంత సంస్థల కోసం టెండర్ అర్హతల్ని అడ్డగోలుగా మార్చేశారు. దీంతో రెండు సంస్థల్ని మాత్రమే అర్హులుగా ప్రకటించి, మామూళ్లు సమకూర్చే సంస్థకు కేటాయింపులు చేసేశారు. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ పునరావ్రతం అవుతుందా అన్న మాట వినిపిస్తోంది. 
Back to Top