- ఇక్కడ అమలు చేయని హామీలతో మళ్లీ వస్తున్న చంద్రబాబు - వెబ్‌సైట్ నుంచి తీసేసిన మేనిఫెస్టోనే అచ్చేసిన తెలంగాణ తెలుగు తమ్ముళ్లు- అధికారంలో ఉన్న ఆంధ్రాలో లోకాయుక్త ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రజలు ప్రశ్న- అమలుకు నోచుకుని ఎస్సీ వర్గీకరణ పేరుతో మరోసారి దోపిడీకి సిద్ధం
అమ్మకు అన్నం పెట్టలేనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని చెప్పినట్టుంది చంద్రబాబు వ్యవహారం. నాలుగేళ్లు ఆంధ్రాలో అధికారంలో ఉన్న చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చింది లేదు. నిరుద్యోగ భృతి, రుణమాఫీ, అన్న క్యాంటీన్‌లు, రెండు రూపాయిలకే 20 లీటర్ల శుద్ధ జలం, కేజీటు పీజీ ఉచిత విద్య వంటి దాదాపు 600లకు పైగా హామీలను 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు మేనిఫెస్టోలో చేర్చాడు. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో ఆయా పథకాల అమలు గురించి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే.. మేనిఫెస్టోనే టీడీపీ వెబ్‌సైట్ నుంచి తొలగించేశారు. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. అదే మేనిఫెస్టోను కాపీ చేసి తెలంగాణలోనూ అమలు చేస్తామని జనాన్ని బురిడీ కొట్టించేందుకు సిద్ధమయ్యాడు. నాలుగుళ్లు అధికారంలో ఉండి అమలు చేయలేని పథకాలను తెలంగాణలో అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని చెప్పడం విడ్డూరం. పైగా తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తున్నది కేవలం 13 సీట్లే.. అందులో గెలిచేవి ఎన్నో ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే. 13కి 13 సీట్లు గెలిచినా వాటితో చంద్రబాబుకు తెలంగాణలో నిర్ణయాధికారం ఏ విధంగా వస్తుందో హామీలు ఎలా నెరవేరుస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు...
తెలంగాణ టీడీపీ మేనిఫెస్టో
అధికారం కోసం తెలంగాణలో అధికారంలో ఉన్నఆంధ్రాలో
1. ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటిస్తాం లేదు2. రూ.2లక్షల వరకు రైతులకు రుణమాఫీ 30 శాతం కూడా లేదుకౌలు రైతులకు వర్తింపు చేస్తామని తెలిపారు ఊసే లేదు3. అన్నా క్యాంటీన్ల ద్వారా రూ.5లకే భోజనం రోజుకు 150 మందికి 4. ఇంటర్ విద్యార్థులకు, వర్శిటీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఊసే లేదు5. విభజన బిల్లులో అంశాల అమలుకు కేంద్రంపై ఒత్తిడి బీజేపీతో కలిసి ఉన్నంత కాలం నోరెత్తలేదు6. అమరవీరుల కుటుంబాల్లో ఇంటికో ఉద్యోగం, ఇల్లు పుష్కర బాధితులకు న్యాయం జరగలేదు7. లోకాయుక్త ఏర్పాటు, లోకాయుక్త పరిధిలోకి ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు 8. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి రెండు నెలల నుంచి అమలు.. అదీ వెయ్యి మాత్రమే9. బెల్ట్ షాపుల రద్దు ఏరులై పారుతున్న మద్యం10. విద్యారంగానికి బడ్జెట్‌లో అదనంగా రూ.5వేల కోట్లు కేటాయింపు ====11. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు నాలుగున్నరేళ్లలో 10 వేలు కూడా ఇవ్వలేదు12. పేద యువతుల వివాహానికి రూ.1.50 లక్షల ఆర్థికసాయం రూ. 50 వేలే13. ఎస్సీ వర్గీకరణ 20 ఏళ్లుగా చెబుతున్నదే14. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు పోరాడుతుంటే అరెస్టులు చేశారు15. 58 ఏళ్లు నిండిన అనాథలు, వితంతువులు, వృద్ధులకు నెలకు రూ.2వేల పింఛన్ టీడీపీ కార్యకర్తలకే16. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల సంక్షేమానికి చర్యలు ------- 17. పక్కా ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం ఊరికి ఐదు కూడా లేవు18. దివ్యాంగులకు రూ.3వేలు పించన్ సదరం క్యాంపులు పెట్టి ఎత్తివేత 19. ప్రతి ఇంటికీ మంచినీరు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ------20. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, బీసీలకు సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపులు అరకొరే